top of page

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 5'Nenu Premisthunnanu - Episode 5'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 07/02/2024

'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్. 


వంశీ కాలేజీ లో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్ లో పడతాడు. బస్ స్టాప్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధ పడతాడు వంశీ. తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు. 


కాలేజీ పిక్నిక్ కి రావడానికి స్వాతిని ఒప్పిస్తాడు వంశీ. 


ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి.


ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 5 చదవండి.  


"నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి.అదే మీ పెదనాన్నగారు రవి గురించి. మీ పెదనాన్నగారిదీ లవ్ ఫెయిల్యూరే.అతనికి కూడా మీ నాన్న లాగే ప్రేమ అంటే చాలా  ద్వేషం..." అంది తల్లి. 

"అయితే, పెదనాన్నకు కుడా ఒక లవ్ స్టొరీ ఉందా..?"

"మీ నాన్న మా పెళ్ళైన కొత్తలో నాతో ఆ లవ్ స్టొరీ చెప్పారు..కావాలంటే నీకు చెబుతాను.."

"చెప్పు..వింటాను.."


కాలేజీ లో మీ పెదనాన్నగారు రవి,రమ అనే అమ్మాయితో లవ్ లో పడ్డారు. ప్రతిరోజూ రవి, రమను కలవసాగాడు. వారిద్దరి మధ్య స్నేహం బాగా బలపడింది. ప్రేమిస్తున్న విషయాన్ని రవి రమతో సమయం వచ్చేవరకు చెప్పకూడదని భావించాడు. రమకు రవి పైన మంచి అభిప్రాయమే. మంచివాడని, బాగా చదువుతాడని  గొప్ప నమ్మకం. 


ఒకనాడు ఇద్దరూ కాలేజీ లో మాట్లాడుతుండగా,వారిద్దరిని రమ చిన్నాన్న చూసారు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పడం, తద్వారా రమ, నాన్నగారి చేత తిట్లు తినాల్సి వచ్చింది. నాన్నగారంటే రమకు చాలా భయం. ఈ విషయం అంతటితో ఆపక, లేని పోనివన్నీ ఉహించుకుని,రమను వేరొక ఊరికి పంపించి చదివించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రమ నాన్నగారికి ఈ ప్రేమలు అంటే నమ్మకం లేదు..పైగా అసహ్యం కూడా. ఒక ఆడ, మగ కలిసి మాట్లాడుకోవడం కూడా నచ్చదు.


జరిగిన సంఘటన తలచుకుంటూ రమ బాగా కృంగిపోయింది. రమ మొదటి నుంచి అమాయకురాలే కాదు, భయస్తురాలు కుడా. మానసిక బాధతో జ్వరం తెచ్చుకుంది. వారం రోజుల వరకు కాలేజీ ముఖం చూడలేదు. ఇన్నిరోజులు రమను చూడకుండా ఉండలేని రవి, ఎలాగైనా తనని కలవాలని రమ ఇంటికి వెళ్ళాడు. ఎవరూ చూడకుండా రమ గదిలోకి చేరుకున్నాడు. అది గమనించిన రమ, తలుపు తీసి, అలా వచ్చినందుకు రవిని తిట్టింది. 


ఇద్దరూ బయటకు వస్తున్నప్పుడు రమ నాన్నగారు చూసి,చెలరేగిన కోపంతో రవిని కొట్టించారు.


మర్నాడు హాస్పిటల్ లో ఉన్న రవిని చూడడానికి రమ వచ్చింది. రవికి  చాలా ఆనందం కలిగింది. ఆ ఆనందంలో తన బాధను కూడా మర్చిపోయాడు. ఒంటి నిండా దెబ్బలు చూడగానే, రమకు కంట్లో నీరు తిరిగింది. రవి ఆమెను ఓదారుస్తూ,సరదాగా మాట్లాడాడు. "నేను ప్రేమిస్తున్నాను" అని తన మనసులో ఉన్న ప్రేమను రవి బయట పెట్టాడు. రవి  అంటే కుడా రమకు ఇష్టమే. తన కోసం ఇన్ని బాధలు పడుతున్న రవి కి దగ్గరవ్వాలంటే, ఇంట్లో నుండి పారిపోవడమో,లేకపోతే ఇంట్లో తెలియకుండా పెళ్ళి చేసుకోవడమో చెయ్యాలి. పోనీ, ఇంట్లో ఒప్పిద్దామా అంటే, రమకు నాన్నగారిని ఒప్పించడం అంటే,ఆ బ్రహ్మకు కుడా సాధ్యం కాదని తెలుసు. అందుకే, రవికి  బదులు చెప్పకుండా వెళ్లిపోయింది. నిజానికి, రమ కుడా ప్రేమ విషయం చెప్పడానికే రవి దగ్గరకు వచ్చింది.


మర్నాడు రమ ఊరికి బయల్దేరవలసి వచ్చింది. ఎప్పటిలాగే రవి రమ కోసం కాలేజీ లో ఎదురు చూస్తున్నాడు. రమ బస్సు సాయంత్రం బయల్దేరుతుంది. రవిని కలిసే అవకాశం ఉంది. కానీ ఒక పక్క తండ్రి మాట కాదనలేక, మరో పక్క తల్లిదండ్రులను విడచి లేచిపోవడం ఇష్టంలేక, రవిని ఇక బాధపెట్టడం ఇష్టం లేక, బయట చదవటం ఇష్టం లేకపోయినా,తల ఊపేసింది. ఒక పక్క రమ పిరికితనం బయటపడింది.


కొన్ని రోజుల తర్వాత రవికి, రమ ఊరు విడచి వెళ్లిపోయిందని తెలుస్తుంది. తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లినందుకు, రవి చాలా బాధ పడ్డాడు. ఇంట్లో కాదనలేక వెళ్ళింది కానీ, తనంటే ఇష్టంలేక కాదని రవికి తెలుసు. ఏ ఊరు వెళ్లిందో తెలియకుండా చేశారు ఇంట్లో. ఎంత ప్రయత్నించినా, రమ అడ్రస్ దొరకలేదు. ఎప్పటికైనా వస్తుందేమోనని ఎదురు చూసాడు రవి. ఆ నిరీక్షణలో చదువు మీద ధ్యాస తగ్గింది. ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదు. రోజులు గడుస్తున్నాయి. రవి చదువును ఎలాగో నెట్టుకుని వచ్చాడు. ఇంట్లోవాళ్ళ, కొడుకు పెద్దచదువులు చదువుతాడన్న ఆశలు కల్లలైనాయి. పక్క ఊరిలో ఒక చిన్న జాబ్ లో చేరాడు రవి.


కొత్తగా వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవడానికి మేనేజర్ని కలవడానికి వెళ్ళాడు రవి. ఊహించని విధంగా అక్కడ రమను చూసాడు. నుదిటి మీద బొట్టు లేదు. ముఖం కళాహీనంగా ఉంది. చిరునవ్వుతో రమను పలకరించాడు రవి. రమ మాత్రం కంట్లో కన్నీటితో తన కథ మొత్తం చెప్పింది.


తనని చదివించడానికి కాకినాడ పంపించారని, ఒక ధనవంతునితో పెళ్లి చేశారని చెప్పింది. సంవత్సరం తిరగకుండానే,భర్త మరణించడంతో, రమ జీవితంలో అంతవరకు ఆనందం లేకపోగా విషాదం మటుకు చేరుకుంది. రమ భర్తకు లేని పాడుఅలవాటు అంటూ లేదు. ఎన్నడూ భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకోలేదు. అటు ప్రేమించిన వాడిని దూరం చేసుకుని,ఇటు తన భర్తతో సుఖపడక, నరకయాతన అనుభవించింది రమ.


కథ వినగానే, రవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. చాలా బాధపడ్డాడు. ఇలాంటి పరిస్థితిలో కూడా రమపై తనకి ఇంకా ప్రేమ, అభిమానాలు అలాగే ఉన్నాయి. ఏమాత్రం తగ్గలేదు. ధైర్యం చేసి,తనని పెళ్లి చేసుకుంటానని రమని అడిగేశాడు రవి. రవి ప్రేమించింది తన మనసునే కానీ, రమ గత జీవితంతో తనకి సంబంధం లేదని చెప్పాడు.


రమకు ఇప్పుడు అడ్డు చెప్పడానికి వాళ్ళ నాన్నగారు కూడా లేరు. రెండు నెలల క్రితమే తన కూతురు జీవితం ఇలా అయ్యిందని,మంచం పట్టి చనిపోయారు. రమ తాను రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపించలేదు. రవి ఇక అక్కడ పని చెయ్యలేక ఉద్యోగం వదిలి వచ్చేసాడు.


"మనింట్లో అందరూ "నేను ప్రేమిస్తున్నాను" అన్నారన్నమాట.." అంది స్వాతి.


మర్నాడు కాలేజీ బస్ స్టాప్ లో స్వాతి క్లోజ్ గా వంశీతో మాట్లాడడం, వాళ్ళ  పెదనాన్నగారు చూసారు. ఆ విషయం ఇంట్లో చెప్పడం స్వాతి విన్నది.


"వంశీ! మొన్న మనం బస్ స్టాప్ లో మాట్లాడుకోవడం ఇంట్లో తెలిసింది. నాకు చాలా భయంగా ఉంది.." అంది స్వాతి.

=====================================================================

ఇంకా వుంది..

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

58 views0 comments

Comments


bottom of page