top of page

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 6


'Nenu Premisthunnanu - Episode 6'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 12/02/2024

'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్. 


వంశీ కాలేజీ లో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్ లో పడతాడు. స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధ పడతాడు వంశీ. తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు. 


ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి. 

స్వాతి పెదనాన్న ప్రేమ వ్యవహారం గురించి ఆమె తల్లి స్వాతితో చెబుతుంది. 


ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 6 చదవండి. 


"ఇంతకీ మనల్ని బస్సు స్టాప్ లో ఎవరు చూసారో చెప్పనే లేదు.. ?"


"నిన్న బస్టాప్ లో మనం మాట్లాడుకోవడం మా పెదనాన్నగారు చూసి మా ఇంట్లో చెప్పారు. మా డాడీ ఊళ్ళో లేరు. అతనికి తెలిస్తే.. ఏం చేస్తారో అని భయంగా ఉంది. మా డాడీ కి ఇలాంటివి నచ్చవు.. "


"ఎందుకు అంత భయపడతావు స్వాతి.. ! ధైర్యంగా ఉండాలి.. "


"వంశీ! ఎన్నాళ్ళ నుంచో నీకొక విషయం చెబుదామని అనుకుంటున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను. 'నేను ప్రేమిస్తున్నాను.. ' అని చెప్పి.. కౌగలించుకుని ఏడ్చింది. తన మనసులో ఉన్న టెన్షన్ ఇన్నాళ్లకు వీడిందని ఆనందపడ్డారు వంశీ. తాను కూడా మెల్లగా స్వాతి ని కౌగలించుకుని, మొదటసారి ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. 


"నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను స్వాతి.. నీ తోడు నాకు జీవితాంతం కావాలి.. నువ్వు తోడుంటే, ఎగ్జామ్స్ బాగా రాస్తున్నాను. నువ్వు నా జీవితం లోకి వస్తే, నేను చాలా లక్కీ అవుతాను.. "


ఆ రోజు రాత్రి వంశీ కి.. నిద్రపట్టలేదు. ఉదయం జరిగిన విషయాన్ని తలుచుకుంటే.. ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు. వెంటనే స్వాతి ని కలవాలనిపించింది. టైం చూస్తే, రాత్రి పదకుండు. బయటకు వెళ్తున్నవంశీ ని తల్లి ఎక్కడికని అడిగితే.. ఫ్రెండ్ దగ్గర కంప్యూటర్ నోట్స్ తెచ్చుకోవాలని చెప్పాడు. 


తన బైక్ తీసి.. స్వాతి ఇంటికి బయల్దేరాడు. జనాలు లేని రోడ్ పై యాభై కి మించి స్పీడ్ లో దూసుకుపోయాడు వంశీ.. 


స్వాతి ఇంటికి చేరుకున్న వంశీ.. గేట్ దగ్గర బండి ఆపాడు. ఇంటి గేట్ మీద నుంచి మెల్లగా దూకి.. పైప్ సహాయం తో మేడ మీదకు చేరుకున్నాడు. వేసవికాలం కావడం చేత, కిటికీ తలుపులు తెరిచే ఉంచారు. కిటికీ లోంచి స్వాతి ని చూసాడు. నైటీ లో ఆమె అందం వర్ణించలేనిది. అందమైన పాదాలు, అటు ఇటు కదులుతున్నప్పుడు సవ్వడి చేసే పట్టీలు, చంద్రబింబం వలే ప్రకాశించే మోము, చక్కటి సౌందర్యం.. వంశీ మనసున అలజడి రేపాయి. 


కిటికీ శబ్దం చేసి.. స్వాతి ని పిలిచాడు. స్వాతి నిద్ర లేచి.. కంగారు పడుతూ తలుపు తీసింది. 


"వంశీ! ఇంత రాత్రి వేళ ఏంటి ఇక్కడ? ఎవరైనా.. చూసారంటే, ఏమవుతుంది.. ?"


"నిన్ను చూడాలనిపించింది.. వచ్చేసాను.. అంతే!"


"డాడీ కనుక లేచారంటే.. కొంప మునుగుతుంది.. "


"భయపడుతున్నావా.. ? డాడీ ఊరిలో లేరని చెప్పావు కదా! స్వాతి.. "


"నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని అలా చెప్పను.. బాగానే రియాక్ట్ అయ్యావు.. డాడీ ఇంట్లో లేరంటే, ఇంటికి వచ్చేయ్యడమే.. ?"


"చిలిపి.." అని స్వాతి బుగ్గను గిల్లాడు వంశీ..


"స్వాతి! చాలా ఆకలి వేస్తుంది. నీ గురించే ఆలోచిస్తూ, భోజనం కుడా సరిగ్గా చెయ్యలేదు తెలుసా? గదిలో ఏమైనా తినడానికి ఉన్నాయ్యా.. ? నీ బ్యాగ్ తీసుకురా.. అందులో ఏమైనా ఉంటాయేమో.. "


వంశీ.. స్వాతి బ్యాగ్ తీసి, అందులో చూస్తే, తను ఇచ్చిన కిట్ కాట్ ఫ్యాక్టరీ ఉంది లోపల.. 


"నేను రోజూ ఇస్తున్న చాక్లెట్ తినట్లేదా.. ?


"దాచుకుని.. తింటాను.. కావాలంటే, నువ్వు కుడా తిను.. " అంది స్వాతి.


"చాక్లెట్ ఓపెన్ చేసి.. తినిపించు స్వాతి.. "


అలా వంశీ.. తన తలను స్వాతి వొడిలో పెట్టుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ముద్దు పెట్టుకోవాలనిపించినా.. ఎందుకో భయపడ్డాడు వంశీ. మెత్తటి ఆమె వొడిలో తలవాల్చి వంశీ.. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ.. మాట్లాడుతుంటే.. టైం తెలియలేదు. ఇద్దరు ప్రేమలోకం లో తేలియాడారు. 


మర్నాడు కాలేజీ అయిపోయిన తర్వాత.. పార్క్ లో కలిసినప్పుడు స్వాతి తో వంశీ సరదాగా మాట్లాడుతూ ఉంటే, ఆమె మాత్రం సీరియస్ గా ఉంది. వంశీ అడిగితే కథ అంతా చెప్పింది స్వాతి.. 


వాళ్ళ డాడీ కి పెదనాన్నగారి ద్వారా మన విషయం తెలిసి.. తనని తిట్టారని, కొట్టారని చెప్పింది. ఇంకోసారి నీతో తిరిగితే తనని చంపేస్తానన్నారు. స్వాతి తన డ్రెస్ టాప్ కున్న జిప్ కిందకు దించి.. నున్నటి తన వీపు మీద దెబ్బలు చూపించింది. దెబ్బలు చూడగానే, వంశీ చాలా బాధపడ్డాడు. చాలా కోపం వచ్చింది. ఇంకో సారి మళ్ళీ ఇలాగ కలిస్తే, నిన్ను కూడా వదిలిపెట్టమని హెచ్చరించారని చెప్పింది. వంశీ.. స్వాతి ని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అప్పుడే అనుకోకుండా.. ఆమె ను కిస్ చేసాడు. 


"వంశీ.. ! నీ అంత ధైర్యం నాకు లేదు.. మా నాన్నతో నేను ఎదిరించలేను. ఏమైనా తేడా వస్తే, మా నాన్న నిన్ను కుడా వదలరు. నా వలన నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అసలే మా ఫ్యామిలీ లో మా అత్త కు జరిగిన దారుణం మా నాన్న జీవితం లో మర్చిపోరు. అలాగే.. మా పెదనాన్న తనను అమ్మాయి మోసం చేసిందన్న బాధా పోదు.. "


"ప్రేమ కోసం ఈవన్నీ తప్పవు స్వాతి.. "


"వంశీ.. నువ్వు బాగా చదువుతావు.. బాగా ఆలోచించు.. నా గురించి అలోచించి నీ జీవితం నాశనం చేసుకోకు.. "


"అంతా మర్చిపో.. అంతా బాగానే జరుగుతుంది.. బై స్వాతి.. " అన్నాడు వంశీ. 


=====================================================================

ఇంకా వుంది.. 

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


44 views0 comments
bottom of page