top of page

టార్గెట్ కంప్లీట్



'Target Complete' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 11/02/2024

'టార్గెట్ కంప్లీట్' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

అది ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి. సోమయ్య తన కూతురికి నొప్పులు వస్తున్నాయని సాయంత్రం హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. కూతురికి ఏమవుతుందో అని చాలా కంగారు పడుతున్నాడు సోమయ్య. 


"డాక్టర్ గారు! ఒక డెలివరీ కేసు వచ్చింది.." అని నర్స్ పెద్ద డాక్టర్ సర్ కు చెప్పింది.


"అడ్మిట్ చేసుకుని..లోపలికి తీసుకు రా.." అన్నాడు డాక్టర్.


"అలాగే సర్.." అని నర్స్ వెళ్లిపోయింది.


"డాక్టర్ సరళ! మీరు ఆ డెలివరీ కేసుని అటెండ్ చెయ్యండి...మీరు ఇందాకల నాతో మాట్లాడారు కదా..దానికి మీకు బాగా హెల్ప్ అవుతుంది"


"థాంక్స్ సర్..అలాగే అటెండ్ చేస్తాను.."


డాక్టర్ సరళ అడ్మిట్ అయిన అమ్మాయి దగ్గరకు వచ్చి చూసింది. తర్వాత బయటకు వచ్చి, అడ్మిట్ చేసిన వ్యక్తి దగ్గరకు వచ్చి...


"ఈ అమ్మాయికి నువ్వు ఏం అవుతావు ..?"


"నా కూతురు డాక్టర్ ..నేను సోమయ్య.. "


"మీ అమ్మాయికి నొప్పులు ఎక్కువయ్యాయి..చాలా లేట్ గా తీసుకుని వచ్చావు..ఇప్పుడు చూడు కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది..వెంటనే ఆపరేషన్ చెయ్యాలి..డబ్బులు సిద్దం చేసుకో సోమయ్య"


"ఎంతవుతుందో చెప్పండి డాక్టర్ గారు.." అని టెన్షన్ పడుతూ అడిగాడు సోమయ్య.

 

"ఒక రెండు లక్షలు అవుతుంది..తొందరగా తీసుకురా..లేకపోతే తల్లీ బిడ్డ.. ఇద్దరికీ ప్రమాదం.."


"అలాగే డాక్టర్..మీరు ఆపరేషన్ కి రెడీ చేసుకోండి..నేను డబ్బులు తెస్తాను.."


తొందరగా డబ్బులు కట్టమని చెప్పి.. డాక్టర్ సరళ లోపలికి వెళ్ళిపోయింది. ఆఖరి నిముషంలో పేషెంట్ ని తీసుకుని వచ్చి.. మా డాక్టర్ లకు తెగ టెన్షన్ తెస్తారని మనసులో తిట్టుకుంది సరళ.


ఈ లోపు సోమయ్య..తన కొడుకు కి ఫోన్ చేసాడు...


"బాబు రాము..మీ అక్క ను హాస్పిటల్ లో జాయిన్ చేశాను కదా..! ఇక్కడ బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ అన్నారు. నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి..?"


"నా దగ్గర ఒక పది వేలు ఉన్నాయి నాన్న..ఎంత కావాలి ఏంటి..?"


"ఒక రెండు లక్షలు కావాలి.."


"రెండు లక్షలా?.."


"వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళు నాన్న.."


"ఇప్పుడు అక్క పరిస్థితి బాగోలేదంటే..ఇంకో హస్పిటల్ అంటున్నావు..నువ్వు అసలు తమ్ముడువేనా..? నువ్వు చిన్నవాడివి, నీకు ఏమీ తెలియదు..చెప్పినట్టు చెయ్యి అంతే..!"


"ఏం చెయ్యమంటావు మరి చెప్పు నాన్న.."


"మన పొలం ఆ సేట్ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకో.."


"సరే...నువ్వు ఎలా అంటే..అలాగే.."


"తొందరగా సేట్ దగ్గరకు వెళ్ళు..ఆలస్యం చెయ్యకు.."


ఫోన్ పెట్టేసి, రాము డబ్బుల కోసం సేట్ దగ్గరకు బయల్దేరాడు..


"సేట్..నాకు కొంచం డబ్బు కావాలి..తొందరగా.."


"ఎంత కావాలి బాబు .."


"ఒక రెండు లక్షలు..."


"అంత మొత్తం అయితే..ఏదైనా తాకట్టు పెట్టాలి.."


"మా పొలం పెట్టుకుని...డబ్బు ఇవ్వు సేట్.."


"మీ పొలం పత్రాలు తెచ్చి ..డబ్బు తీసుకెళ్ళు .." అన్నాడు సేట్


పొలం పత్రాలు ఇచ్చి..డబ్బులు తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు రాము. ఈలోపు హాస్పిటల్ లో నర్స్ డాక్టర్ దగ్గరకు వచ్చి..


"డాక్టర్! ఆ అమ్మాయికి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి..నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది. .."


"ఆపరేషన్ కి రెడీ చెయ్యి...నేను వస్తున్నాను.." అంది డాక్టర్ సరళ. 


ఈ లోపు సోమయ్య కౌంటర్ లో రెండు లక్షలు కట్టేశాడు. ఆ మాట డాక్టర్ సరళ చెవిన పడిన తర్వాత..ఇంక ఒక్క నిమిషం కుడా ఆలస్యం చెయ్యకుండా..వెంటనే ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళింది.


బయట సోమయ్య తన కూతురిని చల్లగా చూడమని అక్కడే ఉన్న దేవుని ఫోటో కు దణ్ణం పెట్టుకున్నాడు. తన కూతురిని డెలివరీ కోసం ఇంటికి తీసుకుని వచ్చిన రోజు ఇంకా గుర్తుంది సోమయ్యకు..


****


"మావయ్య! ఎప్పుడు వచ్చారు? కులాసా?..అత్త ఎలా ఉన్నారు?"


"బానే ఉన్నాము బాబు..."


"అమ్మాయిని డెలివరీ కి ఇంటికి తీసుకుని వెళ్తాను. నువ్వు ఇక్కడ పనికి వెళ్ళాలి కదా..అమ్మాయిని చూసుకోవడం నీకు కుడా కష్టమవుతుంది"


"నేను చూసుకుంటాను...కావాలంటే, సాయం కోసం మీరూ ఇక్కడకే వచ్చేయండి.."


"లేదు బాబు..ఊరిలో చాలా పనులు ఉన్నాయి. మీరు భయపడకండి..నేను అమ్మాయిని మంచి హాస్పిటల్ లో జాయిన్ చేస్తాను.."


"జాగ్రత్త మామ..మీ అమ్మాయి అంటే మీకు ప్రేమ ఉంటుంది..కానీ నా భార్య అంటే, నాకు ఇంకా చాలా ప్రేమ.."


"అలాగే బాబు..నువ్వు కంగారు పడకు..మంచి వార్త చెబుతాను..వెంటనే బయల్దేరి రా.."


****


ఆపరేషన్ థియేటర్ లోంచి బయటకు వచ్చిన డాక్టర్ సరళ..'సోమయ్య' అని పిలవడం తో..మళ్ళీ ప్రస్తుతం లోకి వచ్చాడు సోమయ్య..


"నీకు మనవడు పుట్టాడు..తల్లీ, బిడ్డ బాగున్నారు. కొంత సేపు పోయాక నువ్వు చూడచ్చు.."


"సోమయ్య..డాక్టర్ కు నమస్కారం పెట్టి..మనవడిని చూడడానికి లోపలికి వెళ్ళాడు..


"ఏమిటి డాక్టర్ సరళ! ఆపరేషన్ సక్సెస్ కదా.." అని అడిగాడు పెద్ద డాక్టర్.


"సక్సెస్ డాక్టర్ గారు..ఇంకా కొంత సేపు లేట్ చేస్తే..నార్మల్ డెలివరీ అయిపోయేది...ఎంత కంగారు పడ్డానో ఆ దేవుడికే తెలుసు. ఈ నెల నా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు..అసలే ఈ రోజు ఆఖరి రోజు.."


"అవును డాక్టర్..మీరు మీ టార్గెట్స్ ముందే కంప్లీట్ చేసుకుంటే మంచిది..లేకపోతే మీ శాలరీ మీద ఎఫెక్ట్ పడుతుంది.."


"సరే అని చెప్పి..తన టార్గెట్ కంప్లీట్ చేసినందుకు..లోపలికి వెళ్ళి చెక్కు తీసుకుంది సరళ..


*****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ




46 views0 comments
bottom of page