top of page

నేను వున్నాను


'Nenu Unnanu' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గోపాల్ ఒక ప్రైవేట్ కంపినీలో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు, అతని భార్య రాధ ఒక పేరున్న పెద్ద ట్రైనింగ్ కాలేజీ లో ఉద్యోగం. యిద్దరు పిల్లలు తో హాయిగా జీవితం గడుపుతున్నాడు.


ప్రైవేట్ ఆఫీస్ అవటం వలన, ఇంటికి రావటం లేట్ ఆవుతోవుంటుంది. ఒకరోజున యధాప్రకారం పనిముగించుకుని స్కూటర్ మీద వస్తున్న గోపాల్ కి ఎందుకో బాగా చలిగాను, కొద్దిగా వణుకు మొదలవడం గ్రహించి, ఎలాగో ఇంటికి చేరి, భార్య తో నాకెందుకో చలిగా వుంది, పడుకుంటాను, మీరు తినేయండి అన్నాడు. అదేమిటి మండు వేసవి కాలం చలి ఏమిటి అంటూ వచ్చి భర్త నుదుటి మీద చెయ్యి వేసి చూసింది రాధ. కొద్దిగా నులివెచ్చగా వుంది, వేడి హార్లిక్స్ యిస్తాను త్రాగి పడుకోండి, తెల్లారికి తగ్గుతుంది అంటూ వంట గదిలోనుంచి హార్లిక్స్ కలుపుకొచ్చి భర్త కి యిచ్చింది. అయితే త్రాగిన అయిదు నిమిషాలలో వామిటింగ్ చేసుకున్నాడు గోపాల్. రాత్రి గడిచి తెల్లవారింది. గోపాల్ వొళ్ళు అంతా నొప్పులు, విపరీతంగా చలి లేవ లేక భార్య తో చెప్పాడు, నేను కూడా మీ ఆఫీస్ క్లినిక్ లో చూపించుకుంటాను. క్యాబ్ లో వెళ్దాం అని అతికష్టం మీద లేచి పేస్ వాష్ చేసుకుని, భార్య తో బయలుదేరాడు.


డాక్టర్ గారు బీపీ, chest exam చేసి, ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఈలోపుగా, ఈ టాబ్లెట్స్ వాడితే చలి తగ్గుతుంది అన్నాడు. టెస్ట్ కి బ్లడ్ యిచ్చి, ఆఫీస్ కి ఫోన్ చేసి విషయం చెప్పి, రెండు మూడు రోజులు లీవ్ తీసుకుంటానని చెప్పి ఇంటికి చేరుకుని టాబ్లెట్ వేసుకుని ఏమి తినకుండానే పడుకున్నాడు.


బ్లడ్ రిపోర్ట్ లో టైఫాయిడ్ అని వచ్చింది. 10 రోజులు మందులు వాడాలిట. చచ్చాం రా నాయనా యిప్పుడు ఎలాగా, ఆఫీస్ లో చేతినిండా అర్జెంటు పని వుంది, అసలే ప్రైవేట్, పదిరోజులు సెలవు ఇస్తాడా అనుకుంటూ వాళ్లకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దానికి డైరెక్టర్ ఫైనాన్స్, టైఫాయిడ్ అయితే యిప్పుడే ఎక్కడ తగ్గుతుంది, టెండర్లు పంపించే వర్క్ నీకు తప్పా ఎవరికి తెలియదు ఎలా అని గొణుగుతూ, సరే అవసరం అయితే ఫోన్ లో మాట్లాడుతాము అని ఫోన్ పెట్టేసాడు విసుగ్గా.


రోజు రోజుకి పరిస్థితి దిగజారుతోంది తప్పా ఆరోగ్యం బాగుపడటం లేదు. అన్న హితవు లేదు, చివరికి పోపు వాసన వచ్చినా వామిటింగ్ వచ్చేస్తోంది. పిల్లలు తండ్రి పరిస్థితి అర్ధం కాక బిక్కు బిక్కు మంటూ చూస్తున్నారు. నెల రోజులు గడిచాయి, 80కేజీల మనిషి కాస్తా 60 కేజీలకి వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని తన ఆఫీస్ డాక్టర్ యిది ఏదో పెద్ద ప్రాబ్లెమ్ లాగా వుంది ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని స్టార్ హాస్పిటల్ లో డాక్టర్ సుధాకర్, పల్మనాలజిస్ట్ ని కలవండి వెంటనే. కంగారు పడక ధైర్యం గా వుండండి అని కేసు తన నుండి వదుల్చుకున్నాడు. ఆయన చెప్పినట్లు గానే గోపాల్ ఒక్కడే భార్య కి కూడా చెప్పకుండా స్టార్ హాస్పిటల్ లో డాక్టర్ సుధాకర్ ని కలిసాడు.

ఆయన chest X ray ని ఒకసారి చూసి, ఈ XRay చూసి మీ డాక్టర్ ఏమ్మన్నారు అన్నాడు. ఆయన XRay గురించి ఏమి అనలేదు సార్, టైఫాయిడ్ అని మందుల యిచ్చారు, తగ్గకపోతే యింకో మందులు, యీవిధంగా జరుగుతోంది అన్నాడు గోపాల్ డాక్టర్ తో.

Xray లో కుడి lung కనిపించడం లేదు. కంప్లీట్ గా ఫ్లూయిడ్ తో నిండి పోయింది. రేపు ఉదయం వస్తే ఫ్లూయిడ్ తీసి టెస్ట్ కి పంపుతాను, ఎక్కువ బయపడక్కరలేదు, ఇటువంటివి నేను చాలా తగ్గించాను అన్నాడు డాక్టర్.


అప్పటికే మెదడు ఆలోచించటం మానేసి పదిరోజులు అవుతోంది. అందుకనే పెద్ద కంగారు పడకుండా ఇంటికి చేరుకుని, సాయంత్రం ఇంటికి వచ్చిన భార్య కి అంతా చెప్పి, రేపు నేను ఒక్కడిని వెళ్ళగలను, నువ్వు ఆఫీస్ మానద్దు అన్నాడు. నా ఆఫీస్ గురించి ఆలోచించకండి, రేపు నేను తీసుకువెళతాను హాస్పిటల్ కి అని, బయట నుంచుని, గోపాల్ అన్నగారికి, తమ్ముడికి జరుగుతున్నది చెప్పేసింది.


దాంతో తెల్లారి, వీళ్ళు హాస్పిటల్ కి వెళ్లే సరికి, గోపాల్ అన్నదమ్ములు అక్కడకి వచ్చి వున్నారు. బక్క చిక్కిన తమ్ముడు ని చూసి తట్టుకోలేక కోపం తో, మరదలు ని చివాట్లు పెట్టాడు యింత జరుగుతోవుంటే మాకెందుకు చెప్పలేదని. మీ తమ్ముడు మా అన్నయ్య కి చెప్పద్దు కంగారు పడతారని, నా నోరు నొక్కేశారు మీ తమ్ముడు అంది బావగారితో


వంటికి గవును తొడిగి ఆపరేషన్ రూమ్ లో గోపాల్ ని కూర్చోపెట్టింది నర్స్. అప్పుడు కూడా ఏ మాత్రం భయం లేకుండా కూర్చున్న భర్త ని చూసి, ఏమిటి ఈ మనిషి ముళ్ళు గుచ్చుకుంటే భయపడే వారు యింత ధైర్యం ఎలా వచ్చింది అనుకుంది.


డాక్టర్ గారు వచ్చి అక్కడ వున్న వీళ్ళని చూసి “బలే వారే.. ఎందుకు యింత మంది వచ్చారు. ఫ్లూయిడ్ తీయటానికి అయిదు నిముషాలు చాలు, ఏం కంగారు పడకండి” అంటూ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి, సూన్యం లోకి చూస్తున్న గోపాల్ తో ఏం బయపడక్కరలేదు, నెప్పిలేకుండా తీస్తాను అని, ఏదో మందు వీపుకి పూసి, ఇంజెక్షన్ సిరంజీ తో గుచ్చి, కొంత ఫ్లూయిడ్ బయటకు తీసాడు. అప్పటి వరకు సరదాగా మాట్లాడు తున్న డాక్టర్ గారు సైలెంట్ గా వుండిపోవటం తో, గోపాల్ అడిగాడు, ఫ్లూయిడ్ తీశారా డాక్టర్ అని. ఆ తీశాను. బయాప్సి కి పంపుతాను, రిపోర్ట్ రావటానికి 15రోజులు పడుతుంది, 15 రోజులు తరువాత రండి అన్నాడు ఎటోచూస్తో.


అసలు ఆకలి లేదు, ఏదైనా ఆకలి పుట్టటానికి మందు ఇస్తారా, పత్యం ఏమైనా ఉందా అని అడిగిన గోపాల్ తో "ఏది కావాలంటే అది తినండి "అని వెళ్ళిపోయాడు డాక్టర్.


అన్నయ్య కారులో ఇంటికి చేరుకున్నారు. . యింకో డాక్టర్ దగ్గర చూపిస్తే మంచిది అంటారా అని అడిగిన రాధతో గోపాల్ అన్నయ్య రిపోర్ట్ లేనిదే ఎవరు మాత్రం ఏమి చెప్పగలరు. యింకా చిక్కిపోకుండా ఆరారా ఏమైనా యిస్తో వుండు అని చెప్పి వెళ్ళిపోయాడు.


ఆకలి మందు పనిచేయలేదు కదా, కొత్తగా దగ్గు మొదలైంది. 10 రోజులు దాటినతరువాత, రిపోర్ట్ వచ్చింది వచ్చి తీసుకోమని ఫోన్ రావటం తో మొగుడు పెళ్ళాం యిద్దరూ హాస్పిటల్ కి వెళ్లారు. మీరలా కూర్చోండి, రిపోర్ట్ నేను తీసుకు వస్తానంటున్న భార్య ని, అక్కర్లేదు, నేనే తెస్తాను, నాకు భయం లేదు అంటూ వెళ్లి రిపోర్ట్ తీసుకుని చూసాడు రిపోర్ట్ లో "బయాప్సీ నెగటివ్ , un specified బాక్టీరియా సీన్ "అని వుంది. అమ్మయ్య అనుకుని భార్య కి చెప్పి డాక్టర్ గారి రూంకి వెళ్లారు.


వీరిని చూడగానే రిపోర్ట్ వచ్చిందా, ఏది అని గోపాల్ చేతిలోని రిపోర్ట్ లాకున్నంత వేగంగా తీసుకుని రిపోర్ట్ చదివి , డాక్టర్ సుధాకర్ ఒక్కసారి గా లేచినుంచుని గోపాల్ కి షేక్ హ్యాండ్ యిస్తూ "మీకు మందులు లేని జబ్బు వచ్చింది అనుకున్నాను, ఎందుకంటె ఫ్లూయిడ్ కలర్ బ్లడ్ లాగా ఉంటే అది 99.9%కాన్సర్ జబ్బు అవుతుంది. లక్కీ గా మీరు ఆ పాయింట్ వన్ percent లో తప్పించుకున్నారు, యింకా ఏమి భయం లేదు తగ్గిపోతుంది, అయితే తెలియని బాక్టీరియా వుంది అని చూపిస్తోంది, తెలియని బాక్టీరియా కి ఒకటే మందు, టీబీ కి యిచ్చేది. ఒక ఆరు నెలల కోర్స్. ముందు ఒక వారం హాస్పిటల్ లో వుండండి, మందులు పనిచేయడం మొదలుపెట్టినతరువాత డిశ్చార్జ్ చేస్తానని, చెప్పి రూమ్ allot చేసి అడ్మిట్ చేసుకున్నాడు.


మందులు దారి మందులది, రోగం దారి రోగం ది లాగా, పది రొజులన్నది, రెండు నెలలు అయిపొయింది. జ్వరం, దగ్గు, వామిటింగ్స్ తగ్గటం లేదు. రోజూ పగలు రాధ, రాత్రి బావమరిది వుంటున్నారు గోపాల్ తో పాటు హాస్పిటల్ లో.

డాక్టర్ కి కూడా అయోమయం అయిపొయింది, ఏమిటి యితని జబ్బు, ఎంత పవర్ మందులు కూడా పనిచేయడం లేదు. ఒక వేళా బయాప్సీ రిపోర్ట్ తప్పు వచ్చిందా, ఇతనికి క్యాన్సర్ అయ్యివుంటుందా అని ఆలోచిస్తో, గోపాల్ తో అన్నాడు మీరు యింకో పది కిలోలు తగ్గిపోయారు. ఏమి తినకపోతే ఎలాగ, టీ కూడా త్రాగటం లేదంటున్నారు. ఎందుకైనా మంచిది ఈ రోజు ఆగి రేపు మళ్ళీ ఫ్లూయిడ్ తీసి ఇంకోసారి టెస్ట్ కి పంపుతాను, రిపోర్ట్ ఏమివస్తుందో చూద్దాం అని బుజం తట్టి వెళ్లి పోయాడు. చీకటి పడుతోవుండటం తో భార్యని ఇంటికి వెళ్ళమని చెప్పి పడుకున్నాడు. 8 గంటలకు బావమరిది వచ్చి, ఎలా వున్నారని అడిగి, కింద పక్క వేసుకుని కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు.


గోపాల్ కి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. మళ్ళీ బయాప్సీ అంటున్నాడు డాక్టర్, మూడు నెలలు అయినా ఎక్కడ జబ్బు అక్కడే వుంది. శారీరం కృంగిపోయింది. తనకి ఏమైనా అయితే, తన పది ఏళ్ళ లోపు పిల్లలు ఏమైపోతారు. యిద్దరూ జీతం తో పరవాలేదు అన్నట్టుగా గడుస్తున్నా సంసారం తన భార్య ఒక్క జీతం తో గడపగలదా? మా కుటుంబానికి వచ్చిన "యింతటి దుఃఖం ని తీర్చేవారెవరు" " ఏమిటి దారి అనుకుంటూ బావమరిది సైడ్ కి తిరిగి చూస్తే అతను అప్పుడే ప్రశాంతం గా నిద్రపోతున్నాడు. అతని పక్కన పుస్తకం పైన "ప్రశాంతినిలయం " అని "WHY FEAR, I AM HERE "అంటూ సత్యసాయి బాబా రెండు చేతులతో దీవిస్తున్న ఫోటో కనిపించింది.

ఒక్కసారి గా గోపాల్ ఒళ్ళు జలదిరించింది. ఎన్నో ఏళ్ళ నుండి పుట్టపర్తి స్వామి పుట్టినరోజు కి తప్పకుండా వెళ్తోవుండే నేను, ఈ కష్టకాలం లో ఆయనని ఒక్కసారి గా కూడా గుర్తుచేసుకోలేదు, ఎందుకు నాకు అంత మరుపు వచ్చింది స్వామి "ఈ బాధ ని పడలేక పోతున్నాను, మళ్ళీ బయాప్సీ, రిపోర్ట్స్, ఈ టెన్షన్ నా వల్ల కాదు, తగ్గించితే అన్నీ బాధలు తెల్లారే సరికి తగ్గించు, లేదా నన్ను తీసుకుని వెళ్ళిపో "అని కళ్ల నీళ్ల తో కోరుకుని పక్కకు తిరిగి పడుకున్నాడు..


తెల్లవారు జామున ఎవరో ఒక బిందిడు నీళ్లు తీసునివచ్చి తన మీద గుమ్మరించినట్లనిపించి, ఉలిక్కి పడిలేచిన గోపాలంకి దుప్పటి, తలగడా తో సహా తడిసి, వొళ్ళంతా చెమటలు పట్టివుండటం చూసి, కంగారు గా బావమరిది ని లేపి నర్స్ ని పిలవమన్నాడు. నైట్ నర్సు పరుగెత్తుకుని వచ్చి, బీపీ, టెంపరేచర్ చూసి, sub normal

కి వచ్చింది గుడ్, అంటూ వొళ్ళంతా తుడిచి, ఫ్యాన్ పెద్దది చేసి వెళ్ళిపోయింది.

ఉదయం 8గంటలకు గోపాల్ చిన్న బావమరిది, తన అన్నగారికి బ్రేక్ ఫాస్ట్ యిచ్చి, అతను వచ్చి బావ గారి దగ్గర కూర్చున్నాడు. పెద్ద బావమరిది కర్టెన్ వెనుకకు వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేద్దామని పొట్లం విప్పుతూ వుంటే గోపాల్ కి మసాల దోశ వాసన గుప్పున కొట్టి, యిదిగో నాకు కూడా ఒక ముక్క పెట్టు అన్నాడు.


90రోజులనుంచి తిండి విషయం ఎత్తితే వామిటింగ్ చేసుకునే బావగారేనా దోశ తింటానంటున్నారని ఆశ్చర్యం తో బావమరిది దోశ ప్లేట్ బావగారికి యిచ్చి చూస్తున్నాడు. దోశ మొత్తం అయిదు నిమిషాల్లో తినేసి, కొద్దిగా కాఫీ కూడా తెప్పించావోయ్ అన్నాడు గోపాల్.


డాక్టర్ గారు వచ్చి ఫీవర్ sub నార్మల్ వుంది, దోశ సయించింది, గుడ్ యిహ తగ్గిపోతుంది అని వెళ్ళిపోయాడు.

అలాగే 10 రోజుల లో పూర్తి ఆరోగ్యం తో డిచ్చార్జీ అవటం, డాక్టర్ చెప్పినట్లు గా మందుల కోర్స్ వాడటం, మళ్ళీ 75కేజీ లకు బరువు పెరగటం జరిగిపోయాయి.

ఒక ఆదివారం భార్య చేసిన వేడి వేడి పకోడీలు నములుతూ, గోడ మీద వున్న సాయిబాబా ఫోటోని చూసి మనసుతో నమస్కారం చేసాడు గోపాలం.


శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






40 views0 comments
bottom of page