top of page
Original_edited.jpg

నేటి మనిషి తత్వం

  • Writer: Chilakamarri Rajeswari
    Chilakamarri Rajeswari
  • Nov 6
  • 2 min read

#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #NetiManishiThatwam, #నేటిమనిషితత్వం,  #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

Neti Manishi Thatwam - New Telugu Poem Written By  - Chilakamarri Rajeswari

Published in manatelugukathalu.com on 06/11/2025 

నేటి మనిషి తత్వం - తెలుగు కవిత

రచన: చిలకమర్రి రాజేశ్వరి

    

            

మేము మానవులం, మహా మేధావులం

మా తెలివితో ఏమన్నా చేయగల సమర్థులం 


ప్లాస్టిక్ భూతాన్ని పారద్రోలలేము గానీ 

స్వచ్ఛమైన నీటిని కలుషితం చేస్తాం

హరితవనాలను కాపాడలేము గానీ

కాంక్రీటు భవంతులు అవలీలగా నిర్మిస్తాం 


సహజ వనరులను ఉపయోగించుకోలేం గానీ

కల్తీ సరకుల తయారీలో ఎంతో నేర్పరులం 

బ్రతికిఉన్న అమ్మ, నాన్నలను ప్రేమగా చూడలేంగానీ 

ఆధునిక సాంకేతికతతో లేనివారికి రూపం కల్పిస్తాం


జీవిత చరమాంకంలో ఏదీ మన వెంట రాదని తెలిసినా

ధన సంపాదన కోసం ఏ నీచానికైనా పాల్పడతాం

నియమనిబంధనలకైనా నీళ్లు ఒదులుతామేమో గానీ

అధికార దాహాన్ని,  అదుపులో పెట్టుకోలేం


కష్టపడి,నిజాయితీగా, డబ్బు సంపాదించేందుకు బద్ధకం గానీ 

సాఫ్ట్ వేర్  సాయంతో సైబరు నేరాలు సులభంగా చేసేస్తాం


తోటి మనుషులతోసాన్నిహిత్యం పెంచుకోం గానీ

మరమనుషులతో ఇష్టంగా కాలం గడిపేస్తాం

సాటి మనిషితో మాట్లాడటానికి సమయం ఉండదు గానీ

చరవాణితో నిత్యం సహవాసం చేస్తాం

ఆరోగ్యానికి హానికరమని  తెలిసినా

మందు, సిగరెట్ త్రాగడం లాంటివి మానం


మేము మానవులం, మహా మేధావులం

అని విర్రవీగుతూ కాలం గడిపేస్తాం


***


చిలకమర్రి రాజేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి

 

నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.


మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.


నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.


పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page