top of page

నేటి పెళ్లిళ్లు - సమస్యలు


'Neti Pellillu - Samasyalu' New Telugu Article


Written By A. Annapurna


(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
(వ్యాస పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


పరిచయస్తులు కొందరు ''మా అమ్మయికి లేదా అబ్బాయికి ఏదైనా మంచి పెళ్లి సంబంధం ఉంటే చెప్పండి... !” అంటూ వుంటారు.


'మంచి అంటే? బుద్ధి మంతుడు... బాగా చదువుకుని సంపాదన బాగున్నవాడు... అందగాడు కాకున్నా పర్వాలేదు అనుకునేలా ఉండేవాడు.... అని అబ్బాయిల గురించి.. అమ్మాయిలకూ దాదాపు ఇదే వర్తిస్తుంది అనుకోండి. బుద్ధి గురించి ఎలా చెప్పగలం? ఇంట ఒకలా ఉంటే బయట వేరే వూళ్ళో వుద్యోగం చేసే వారి గురించి ఏమి తెలుస్తుంది?


అన్ని చూసి అన్ని బాగుండి చేసే పెళ్లిళ్లే విఫలం అవుతున్నాయి. అదీకాకుండా కొన్ని ఫామిలీ'స్ లో పిల్లలకు ఫ్రీడమ్ మితిమీరి ఇస్తారు. తల్లి తండ్రులు ఇవ్వక పోయినా వాళ్ళే తీసుకుని సమస్యలు తెచ్చి పెడుతుంటారు. కొందరు మరీ చాదస్తంగా వుంటారు. సో మనకు అసలు పరిస్థితులు తెలియవు. ఇప్పుడు కొంత విదేశీ సంబంధాలు చూడటం తగ్గింది. వీసాలు ఉద్యోగాలు కూడా సరిగా లేక.


అమ్మాయిలున్నవారు అబ్బయిల తల్లి తండ్రులకంటే నాలుగు మెట్ల పైకే వుంటున్నారు. ఇది చాలా పెద్ద సమస్యగా వుంది. పెళ్ళికి అన్ని అంగీకరించి ఆతర్వాత పేచీ పడేవారు వున్నారు. మరి ముందు తెలిసే చేసుకున్నావుగా అంటే ' అదివేరు. ఇప్పుడేగా నువ్వింత తెలివి లేనివాడివి అని అర్ధం అయ్యింది' అంటున్నారు.


ఇక తల్లితండ్రులు అనేవాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది విదేశమే కాదు. స్వదేశంలో కూడా.


ఈ మధ్య మాకు తెలిసినవారు(అమెరికా ) కొన్ని రోజులు ఇండియాలో ఉండి అమ్మయికి పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. వాళ్ళది లవ్ మ్యారేజ్. కనుక రెండు కులాలు. అటూ ఇటూ మధ్యరకం కూడా చేయాలని ఆలోచన.


విచిత్రం..... కాలం మారింది. చిన్న పెద్దా కూడా చాల విషయాల్లో ఆధునికత పాటిస్తున్నారు..... కానీ పెళ్లి దగ్గిరకి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ - వీళ్ళు తక్కువ అనే బేధాలు మాత్రం వదలడంలేదు. చదువుంది, మంచి హొదావుంది... అమెరికన్ సిటిజన్స్ … అయినా సరే ఎదో వొంకతో రిజక్ట్ చేస్తున్నారు అబ్బాయి తల్లి తండ్రులు. చివరికి ఏమి జరుగుతుందో తెలియదు.


పెళ్లి జరిగి పదేళ్లు అయినా ఇద్దరి మధ్య ప్రేమ అభిమానం ఒక బాధ్యత లేని దంపతులు ఇద్దరు పిల్లలు కూడా ఉండి సరిపడక విడిపోయారు. తల్లి తండ్రులు ఒకటే బాధపడుతున్నారు. అయ్యో ఇలాంటి పెళ్లి చేశామే... అని. తప్పు ఎవరిదీ ? పెళ్లి చేసిన తల్లి తండ్రులు పై పై గుణాలు చూస్తారు చదువు అందంకుటుంబం. ఒక చోట జీవితం ప్రారంభించిన అమ్మాయి అబ్బాయి లకు అప్పుడు వస్తుంది అసలు సిసలుబుద్ధి.


పోట్లాటలు మొదలు అవుతాయి. కారణాలు మనకు చిన్నవి. సర్దుకు పోయేవే. కానీ వాళ్లకి భరించ లేనంత తీవ్ర మైనవి. నచ్చచెప్పాలని చూసినా నువ్వు ఇంటర్ ఫియర్ కావద్దు అంటారు. అమ్మయికి అసలు చెప్పలేం. ఆవిడకు చదువు వుద్యోగం అహంకారం పాలు ఎక్కువ. అబ్బాయికి చెబితే నన్ను బానిసలా చూస్తుంది… అంటాడు. ఆ తగవులు తీర్చలేము.


పైగా ''నువ్వు చేసిన నిర్వాకమే''అంటారు. (ప్రేమించి పెళ్లి చేసుకునే ధైర్యం లేక. ) అంటే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారు ఇద్దరూ బాగుంటే పిల్లల పెళ్లి సమస్య.

అందుకే ఈ రోజుల్లో త్వరగా పెళ్లి చేద్దాం అన్నా కుదరడం లేదు. పెళ్లి చేసుకున్నవారికి సరిపడటం లేదు.


పోనీ వాళ్ళే చేసుకుంటారు అని వూరుకుందాం అంటే మరో అనర్ధం ''డేటింగ్ - లివ్ టుగెదర్ ''. వీళ్ళ జీవితాలు తెగిన గాలిపటాలు అవుతాయి.


అమెరికాలో చదువుకునే పిల్లల పెళ్లి కూడా పెద్ద సమస్యే. అటు ఇండియా సంబంధం కుదరదు. ఇటు అమెరికాలో స్థిరపడిన కుటుంబాల వారు చదువుకే వెళ్లినవారిని అసలు ఇష్టపడరు. కల్చర్ తెలియదు అంటారు. బిహేవియర్ డిఫ్రెన్స్ అంటారు. రక రకాలుగా తక్కువ చేస్తారు. అది నిజం కూడా.


అక్కడఉన్నవారు ''మా పిల్లలను జాగ్రత్తగా పెంచాం ''అంటారు కానీ అది ఎవరితరమూ కాదు. ఎంతైనా పుట్టి పెరిగిన వాతావరణం అలవాట్లు ఆలోచనలు వేరు.

ఆధునికత అక్షరాస్యత అవకాశాలు పెరిగిన కొద్దీ అమ్మాయిలకైనా అబ్బయిలకైనా పెళ్లిళ్లు పెద్ద సమస్యగామారాయి. పరిష్కారం కూడా కాలమే చెప్పాలి.

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.43 views0 comments

댓글


bottom of page