'New Year Lo Vintha Swayamvaram' - New Telugu Story Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 01/01/2024
'న్యూ ఇయర్ లో వింత స్వయంవరం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"కావ్యా! ఇంకా నిద్ర లేవలేదా?.. మీ ఫ్రెండ్ పార్టీ కి వెళ్ళాలని అన్నావు కదా! ఏమిటే.. ఇంకా ఈ మొద్దు నిద్ర.. ?"
"కొంతసేపు ఉండు అమ్మా! పడుకుంటే, ఫ్రెష్ గా ఉంటుందని ఇలా పడుకున్నాను.. "
"మీ ఫ్రెండ్ క్రిస్మస్ నాడు పుట్టిందా.. ?"
"అవును అమ్మా!.. "
"నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావే... ?"
"అప్పుడే పెళ్ళా.. ? ఐనా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు?"
"మీ నాన్నే ఉండి ఉంటే.. ఈ పాటికి నీకు గట్టిగా బుద్ధి చెప్పి, ఎప్పుడో నీ పెళ్ళి చేసేవారు.. "
"టైం వచ్చినప్పుడు .. అదే జరుగుతుంది... అప్పుడే పెళ్ళి చేసుకుంటా.. " అంది కావ్య.
"ఇంతకీ.. పార్టీ ఎక్కడ కావ్య?"
"సాయంత్రం ఐదు కి .. బీచ్ దగ్గర పెద్ద హోటల్ లో.. "
"సరే, రెడీ అయి బయల్దేరు మరి!.. "
కావ్య లేచి, రెడీ అయి.. బయల్దేరింది. దారిలో బర్త్ డే గర్ల్.. మేఘన కు ఫోన్ చేసింది.
"హ్యాపీ బర్త్ డే మేఘన.. "
"థాంక్స్ కావ్యా!.. త్వరగా రావే.. ! నీకు ఒక సర్ప్రైజ్ ఉంది"
"టెన్ మినిట్స్ లో అక్కడ ఉంటానే... "
పెద్ద హోటల్ లో చాలా డబ్బు ఖర్చు పెట్టి, పార్టీ గ్రాండ్ గా ప్లాన్ చేసింది మేఘన.
పార్టీ కి వెళ్ళిన కావ్య.. కొంతసేపటికే, చిర్రు బుర్రు లాడుతూ ఇంటికి వచ్చేసింది..
"అదేంటే, అప్పుడే వచ్చేసావు? పార్టీ అంత తొందరగా అయిపోయిందా?" అడిగింది అమ్మ.
"లేదమ్మా.. మధ్యలో వచ్చేసాను.. "
"ఏం ఒంట్లో బాగోలేదా.. ?"
"లేదమ్మా! మనసే బాగోలేదు.. "
"ఏమైంది కావ్య.. ?"
"అమ్మా! పార్టీ లో మేఘన తన పెళ్ళి డేట్ అనౌన్స్ చేసింది. పార్టీ కి మేఘన తనకు కాబోయే మొగుడు ని కుడా ఇన్వైట్ చేసింది.. "
"అమ్మా! నా పెళ్ళి.. మేఘన పెళ్ళి కన్నా, ముందే జరగాలి.. అంటే న్యూ ఇయర్ లో గ్రాండ్ గా జరగాలి.. "
"ఇప్పటికి ఇప్పుడు పెళ్ళంటే ఎలాగే కావ్య?.. "
"పార్టీ లో జరిగింది నీకు చెబితే.. వెంటనే నా పెళ్ళి చేసెస్తావు అమ్మా.. !"
*****
పార్టీ కి నేను వెళ్ళిన తర్వాత.. అక్కడ కు మేఘన కు కాబోయే మొగుడు మురళీ వచ్చాడు. నన్ను ఆతనికి పరిచయం చేసింది మేఘన.
"హలో! అయితే మీరే నా మేఘన ఫ్రెండ్ అనమాట.. మీది చాలా మంచి పేరు.. "
"మేఘన! మీ ఫ్రెండ్ కావ్య కు పెళ్ళి అయ్యిందా?"
"లేదు మురళీ.. "
"ఎందుకో.. ?"
"అందరూ మన లాగ ఉంటారా చెప్పు మురళీ.. అది చిన్నప్పటినుంచి అన్నింట్లోను లేట్. అమ్మ కడుపు లోంచి లేట్ గా బయటకు వచ్చిందంట. తర్వాత స్కూల్ లో అడ్మిషన్ తీసుకున్న ఒక నెల తర్వాత జాయిన్ అయ్యింది. కాలేజీ లోనూ అంతే!.. రెండు నెలల తర్వాత క్లాసులకు వచ్చింది. ఇప్పుడు పెళ్ళి లేట్ అవడం లో ఆశ్చర్యం ఏముంది చెప్పు మురళీ.. పైగా అది నా కన్నా మూడు సంవత్సరాలు పెద్ద తెలుసా మురళీ.. ?"
"అయితే.. మన పిల్లలు స్కూల్ కు వెళ్ళే టైం కైనా, తనకి పెళ్ళి అవుతుందంటావా మేఘనా?"
"డౌటే మురళీ.. "
కావ్య కోపంగా.. " ఇద్దరు కలిసి అందరి ముందు నన్ను అవమానిస్తారా? నీకు ముందు పెళ్ళైతే గొప్పా మేఘన.. ?"
"అవునే.. గొప్పే.. ఈ రోజుల్లో టైం కు పెళ్ళి జరగడం.. అందులోను మెచ్చిన వాడు దొరకడం చాలా కష్టం.. దానికి చాలా అదృష్టం ఉండాలి.. " అంది మేఘన.
"అయితే.. ఇదే నా ఛాలెంజ్.. మీ పెళ్ళి కన్నా.. నా పెళ్ళి ఒక్క రోజైనా ముందు జరుగుతుంది.. " గట్టిగా అంది కావ్య
*****
"అలా ఛాలెంజ్ చేసి.. పార్టీ మధ్యలోనే వచ్చేసాను అమ్మా!."
"నీకు మీ నాన్న రోషమే వచ్చింది కావ్య... మీ నాన్న కుడా ఇంతే!.. అప్పట్లో మా నాన్న తో ఛాలెంజ్ చేసి, గెలిచి.. నన్ను పెళ్ళి చేసుకున్నారు.. "
"కావ్య.. ! నీ కోసమే.. ఇంతకు ముందు నేను ఆల్రెడీ ముగ్గురిని సెలెక్ట్ చేసాను.. వారిలో ఎవరు నచ్చరో చెప్పు.. వెంటనే నీ పెళ్ళి చేసేస్తాను"
"ముందు నువ్వు వెళ్లి, అబ్బాయిని చూసి.. సెలెక్ట్ చెయ్యి అమ్మా! నీ కన్నా, నా గురించి ఎవరు బాగా ఆలోచిస్తారు చెప్పు.. ఆ తర్వాత నేను పెళ్ళి చేసుకుంటాను.. "
"అయితే నేను అబ్బాయిల డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని వస్తాను.. "
రెండు రోజులు తర్వాత ..
"కావ్యా! మొత్తం ఆ ముగ్గురు అబ్బాయిల డీటెయిల్స్ తెలుసుకున్నాను.. అందరూ బాగానే ఉన్నారు.. నాకు అందరూ నచ్చారు. మరి నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకుంటావో.. ?"
"నా మీద ఎవరికీ ఎక్కువ ప్రేమ ఉందో.. వారినే పెళ్ళి చేసుకుంటాను.. " చెప్పింది కావ్య.
"అది ఎలా డిసైడ్ చేస్తావు కావ్య.. ?"
"నా పుట్టిన రోజు, న్యూ ఇయర్ ఒకే రోజు కదా! నువ్వు ఈ ముగ్గురుకి విడిగా, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పు. వీరిలో ఎవరైతే.. నా కోసం ఎక్కువ మెసేజెస్, ఎక్కువ కాల్స్, ఎక్కువ లైక్ లు చేస్తారో.. ఫస్ట్ బర్త్డే విషెస్, ఫస్ట్ న్యూ ఇయర్ విషెస్ ఎవరు చెబుతారో.. ఎక్కువ గిఫ్ట్స్ ఎవరు ఇస్తారో, వాళ్ళతోనే నా పెళ్ళి. "
"అదేంటే కావ్య! .. ఈ వింత స్వయంవరం.. " అడిగింది తల్లి
"పూర్వం డెసిషన్ తీసుకోడానికి, బొమ్మ-బొరుసు వేసేవారు.. లేకపోతే చీటీలు తీసేవారు. ఇప్పుడు కొత్తగా ఇలాగ చేస్తున్నాను. పెద్ద పెద్ద రియాలిటీ షోస్ లో కుడా.. ఓటింగ్ ద్వారానే సెలెక్ట్ చేస్తున్నారు.. కదా!" అని చెప్పింది కావ్య.
"నీ జీవితం.. నీ ఇష్టం.. కావ్య!.. "
ముగ్గురులో.. ఒకొక్కరు కావ్య పై వాళ్ళకున్న ప్రేమను తెలియజేయడం మొదలుపెట్టారు.. కరెక్ట్ గా న్యూ ఇయర్ రోజు, కావ్య పుట్టిన రోజు నాడు.. కావ్య కు ఎక్కువగా రెస్పాన్స్ ఇచ్చిన అబ్బాయే కావ్యకు నచ్చాడు.
పుట్టినరోజు నాడు.. తాను చేసుకోబోయే అబ్బాయిని అనౌన్స్ చేసి.. తన పార్టీ కి స్పెషల్ గా ఇన్వైట్ చేసిన తన ఫ్రెండ్ మేఘన ముందే పెళ్ళి డేట్ అనౌన్స్ చేసింది కావ్య. తనకన్నా ముందు పెళ్ళి చేసుకుంటున్న కావ్య ను చూసి, మేఘన గర్వం పటాపంచలైంది..
*******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments