top of page

నిప్పు లేనిదే పొగ పుట్టదు

సామెత కథ


'Nippu Lenide Poga Puttadu' - New Telugu Story Written By Patrayudu kasi viswanadham

Published In manatelugukathalu.com On 07/06/2024

'నిప్పు లేనిదే పొగ పుట్టదు' తెలుగు కథ

రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం


పూర్వం సాంబయ్యపాలెం గ్రామంలో సాంబయ్య కుటుంబం నివసిస్తూ ఉండేది. సాంబయ్య కొడుకు పేరు సోముడు. సాంబయ్యకు రెండెకరాల పొలం, అవులు, గేదెలు ఉన్నాయి. సాంబయ్యకు వయసు పైబడటంతో వ్యవసాయ పనులు చేసే ఓపిక లేక బాధ్యతలన్నీ కొడుకు సోమునికి అప్పచెప్పాడు. కానీ కష్టానికి అలవాటు పడ్డ శరీరం కావడం వల్ల ఖాళీగా కూర్చోలేక అప్పుడప్పుడూ కళ్లానికి వెళ్ళి పశువులకు కుడితి పెట్టడం, మేత పెట్టడం లాంటి చిన్న చిన్న పనులు చేసి కొడుక్కి చేదోడు వాదోడుగా ఉండేవాడు. తొలకరి సమీపిస్తూ ఉండటంతో సాగుకు సిద్ధం చేయాలని కళ్ళానికి దగ్గరలో ఉన్న పొలంలో వ్యర్థంగా ఉన్న జొన్న కర్రలను తగులబెట్టాడు సాంబయ్య కొడుకు.


మర్నాడు కళ్ళానికి వెళ్ళిన సాంబయ్యకు పొలంలో ఒక చోట సన్నగా పొగ వస్తూ కనిపించింది. ఇంటికి వెళ్ళాక కొడుకుని పిలిచి

“నిన్న నువ్వు జొన్నకర్రలు తగులబెట్టిన చోటు నుంచి పొగ రావడం నేను చూశాను. నిప్పు లేనిదే పొగ రాదు. ఒక సారి వెళ్లి చూడు” అని కొడుకుకు చెప్పాడు సాంబయ్య. “నిన్న అనగా తగులబెట్టాను ఇంకా పొగ రావడమేమిటి, ఆరిపోయి ఉంటుంది.” అని తండ్రి మాటని కొట్టిపారేశాడు కొడుకు. 


నివురు గప్పిన నిప్పు అలా రాజుకుంటూ పొలం పక్కన ఉన్న కళ్ళానికి వ్యాపించింది. పెద్ద ఎత్తున మంటలు రేగడంతో దారంట పోయేవారు, చుట్టుపక్కల వారు చూసి అప్రమత్తమై పశువుల కొట్టంలోని పశువులను బయటకి వదిలి తలొక చెయ్యి వేసి మంటలను అర్పారు.


అప్పటికే గడ్డిమేటు సగం కాలిపోయింది. జరిగిన దానిని చూసి లబో దిబో మంది సాంబయ్య కుటుంబం. “తండ్రి చెప్పిన మాటలు నిజమే నని నిప్పులేనిదే పొగ రాదని” గ్రహించాడు సాంబయ్య కొడుకు. నాటినుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది. 


దొంగతనం, హత్య లేదా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రజలు కానీ పోలీసులు కానీ కొంతమందిని అనుమానిస్తారు. అలా అనుమానించే సందర్భంలో పూర్వాపరాలు కూడా బేరీజు వేస్తారు. జరగడానికి గల కారణాలు అన్వేషిస్తారు. అయితే ఈ అనుమానం వెనుక నిప్పులాంటి నిజం ఉంటుంది. కాబట్టే నిప్పు లేనిదే పొగ పుట్టదని అంటారు. ఇలాంటి వార్తలు

ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటాయి. ఆ నిప్పు లాంటి నిజం తప్పు చేసిన వారిని శిక్షించేలా చేస్తుంది. ఇదీ సామెత వెనుక ఉన్న కథ.

***


పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం

Patrayudu kasi viswanadham


విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., 

ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).

స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం 

విజయనగరం జిల్లా.

నివాసం : శృంగవరపుకోట (ఎస్‌.కోట)

వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.


ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు  రాయడం 


ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.


సేకరణలు:

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.


విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:

*******************************

1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.


2.మండలస్థాయిలో విద్యార్థులకు  *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.

3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.


బాల రచయితలుగా తీర్చిదిద్దడం

*******************************

బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.

నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో  10 కి పైగా ప్రచురించబడ్డాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సంకలనాలు :


1.గురజాడ శతవర్ధంతి

కవితా సంకలనం లో  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'         సంకలనం లో 

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల    సంరక్షణ',

4.'రక్త బంధం', 

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.

6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల           బంధం' సంకలనం లో 

7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో

9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో 

10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో 

11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో

12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో

13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.

🌷🌷🌷🌷🌷🌷🌷


బహుమతులు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.

3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


బిరుదులు

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర, 

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర, 

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల, 

4.శతశ్లోక కంఠీరవ, 

5.సూక్తిశ్రీ, 

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.

12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023



🌹🌹🌹🌹🌹🌹🌹

ముద్రించిన పుస్తకాలు :


1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),

2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).

3.*దేవునికో ఉత్తరం*  బాలల కధా సంపుటి

4.*అద్భుతం* బాలల కథా సంపుటి

5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.

6.తాతయ్య కల బాలల కథా సంపుటి.

అముద్రితాలు


1*మౌనమేలనోయి* కథల సంపుటి

2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి

3*నీకోసం* భావ కవితా సంపుటి.

4చెట్టు కథలు

5 పేదరాశి పెద్దమ్మ కథలు

6 మృగరాజు సందేశం కథల సంపుటి


ఇష్టాలు


పిల్లలతో గడపడం

బాలసాహిత్య పఠనం

బాలసాహిత్య రచన


ప్రచురణలు


ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల  పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120,  ప్రచురణ అయ్యాయి.

 

🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷




85 views0 comments

Comments


bottom of page