top of page
Original_edited.jpg

నిరక్షరాస్యుడు

  • Writer: Pitta Govinda Rao
    Pitta Govinda Rao
  • Jul 8
  • 5 min read

#PittaGopi, #పిట్టగోపి, #Niraksharasyudu, #నిరక్షరాస్యుడు, #TeluguKathalu, #తెలుగుకథలు

ree

Niraksharasyudu - New Telugu Story Written By - Pitta Gopi

Published In manatelugukathalu.com On 08/07/2025

నిరక్షరాస్యుడు - తెలుగు కథ

రచన: పిట్ట గోపి


శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల దరిన అంబేద్కర్ యూనివర్సిటీ అనే కాలేజ్ ఉంది. ఇక్కడ దాదాపు అన్ని కోర్సులు విద్యార్థులు చదువుతున్నారు. 


ఈ వర్సిటీకి స్పెషల్ ఏంటంటే.. ఇక్కడ ఒకటో తరగతి నుండి పీజి వరకు వేర్వేరుగా పాఠశాలలు, కళాశాలలు మౌళిక సదుపాయాలు ఉన్నాయి. దూరపు విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా ఉందంటే ఆ వర్సిటికి ఉన్న స్పెషల్ ఇట్టే అర్దమవుతుంది. రోజు తెల్లవారి, మరియు సాయంత్రం వేళలో ఆ పరిసరా ప్రాంతం నిత్యం విద్యార్థులతో రద్దీగా, సందడిగా ఉంటుంది. వర్సిటి గేటు దాటాకా.. పార్కులు, పూదోటలు, ఆ అందాలు ప్రేమికులతో నిండి పర్యటక ప్రదేశాలను తలపిస్తుంది. 


ఇక రమ్య అనే నేను వర్సిటిలో లా కోర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాది వర్సిటికి పదిహేను కిలోమీటర్ల దూరంలో నర్సాపురం అనే ఒక చిన్న పట్టణం. అందుకే హాస్టల్ అంటే నచ్చక బస్ పాస్ వినియోగంతో యూనివర్సిటీకి వస్తుంటా. డిగ్రీ కూడా ఇదే వర్సిటిలో చదివాను. డిగ్రీ లాస్ట్ ఇయర్ కు వచ్చిన నేను ఏనాడూ ప్రేమ జోలికి పోలేదు. 


ఇక్కడ నాకు ఏ ఫీలింగ్స్ లేవని కాదు. నా తోటి స్నేహితులు, సీనియర్స్, మరియు జూనియర్స్ అందరు ప్రేమలో మునిగి తేలుతారు. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఆనందం కోసం ఒకరిని తెలియకుండా ఇంకొరికి మెయింటైన్ చేస్తుండటం నేను చూస్తుంటాను. 


మరికొందరు లవ్ ఫెయిల్ వలన నరకం అనుభవిస్తుండటం, వారికి నేను ఓదార్చటం కూడా చేస్తుండటం ఇవన్నీ నాలో ఒక రకమైన బాధని నింపాయి. నా ప్రేమ కూడా ఇలా ఫెయిల్యూర్ గా మారితే నేను తట్టుకోలేను. ఎందుకంటే ఈ ఫేక్ ప్రపంచంలో ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఇంత తెలిసిన నా మనసుకు బాగా చదువుకున్నోడు డబ్బు బాగా సంపాదించినవాడు కూడా నకిలీగాడే అని తెలియదు. ఆ ఆలోచన కూడా రాలేదు. 


ఈ విషయం నా పిచ్చి మనసుకు తెలియకే ఓ మంచి మనిషిని, అతని ప్రేమను నేను కోల్పోయాను. 


డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిన మాకు జూనియర్స్ వీడ్కోలు కార్యక్రమం గ్రాండ్ గా చేశారు. ఈ కార్యక్రమం కోసం టెంట్స్ వేయటానికి వచ్చిన ఓ యువకుడు నన్ను చూసి ఫాలో అయ్యాడు. చూడ్డానికి అటు ఇటు కాకుండా సాదారణంగా ఉంటాడు. ఈ విషయం నాతోటి స్నేహితులు చెబితే తెలిసింది. వచ్చిన నుండి కార్యక్రమం పూర్తి అయ్యే వరకు తన పని చేసుకుంటునే ఓ కంట కనిపెడుతు నన్ను చూస్తుండేవాడు. 


తొలిసారి ఒక అబ్బాయి నన్ను అంతలా చూడటం నేను చూశాను. అంతకుముందు నన్ను ఎందరో కాలేజీ అబ్బాయిలు, సీనియర్స్ ట్రై చేసిన వాళ్ళు నన్ను ఆకర్షించలేకపోయారు. వీడు మాత్రం మాట్లాడకుండానే నా మనసుకు ఆకర్షించాడు. కానీ.. అతడి వాలకం, చేసే పని బట్టి నాకు, నా ప్రేమకు, నా కుటుంభానికి సరైన వాడిగా అనిపించక అలా టైం పాస్ కి నేను కూడా అప్పుడప్పుడు చూడటం తప్ప అతడిని సరిగా పట్టించుకోలేదు. తనతో వచ్చిన మరో యువకుడు పిలిచిన పిలుపుతో అతడి పేరు రవి అని తెలిసింది. 


లా కోర్స్ మొదలయ్యాక రవి నన్ను మరింత ఫాలో అవటం మొదలెట్టాడు. 


ఒక్క సెలవు రోజు తప్ప తెల్లవారి, నా కోసం గేటు దగ్గరకు రావటం నేను బస్ దిగి నడుచుకుంటు వెళ్తే కాలేజ్ వరకు నన్ను ఫాలో అవ్వటం, నేను లోపలికి పోయాక రిటర్న్ అవటం మళ్ళీ సాయంత్రం రావటం నేను బస్ ఎక్కే వరకు నా వెంట రావటం ఇదే రవి దినచర్య. 


రాను రాను నా మనసు రవి అంటే కోపం వచ్చేలా తయారయ్యింది. అతడికి మరేం పని ఉండదా.. నా కోసం ఎప్పుడు అలా పోరంబోకులా తిరుగుతాడని నా వెంట రావొద్దని చెప్పలేవా అని నన్ను నా స్నేహితులు తిడుతుంటారు. చివరకు ఓ రోజు అతడితో మాట్లాడాను. అతడు ఆనందంతో పొంగిపోయాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నేను నిలవనివ్వలేదు. 


"నా వెంటపడితే బాగోద"ని చెప్పాను. 

అతడి వాలకాన్ని హేళన చేస్తు “నీలాంటి పోరంబోకు గాడికి నేను కావాలిరా..” అన్నాను. 


అంతే. ఆరోజు నుండి నా కోసం రావటం మానేశాడు. బస్ దిగినపుడు రవి ఫేస్ చూసే నేను ఆరోజు అతడు లేకపోయేసరికి డల్గా మారిపోయా. అతడిని ప్రేమించలేదని కాదు, తిట్టానని. 


రెండు రోజుల తర్వాత యూనివర్సిటీకి రెండు కిలోమీటర్ల దూరం నుండి నడుచుకుని వచ్చే పిల్లలకు నడి రోడ్డు మీదనే ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సైకిల్స్ పంపిణి చేస్తు కనపడ్డాడు. బస్ లో ఉండటంతో మొత్తం తతంగాన్ని చూడకపోయినా.. రవినే ఇచ్చాడని పిల్లలను అడిగి తెలుసుకున్నాను. కానీ.. నేను చూస్తానని ఇచ్చాడేమో అనుకుంది నా మనసు. 


గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పిల్లలు వరదల్లో, బురదల్లో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని దారి పొడవున రోడ్డు నిర్మించాడని, వంశదార నది దాటి వచ్చే విద్యార్థులు కోసం సొంత ఖర్చుతో స్పెషల్ బోట్లు వేయించాడని పత్రికల్లో చూసి షాక్ అయ్యాను. 


రవి గూర్చి తెలుసుకోవాలనిపించింది. తర్వాత తన అడ్రస్ గల్లంతయ్యింది. ఇంతలో మాకు సీనియర్స్ స్వాగత కార్యక్రమం పెట్టారు. ఈవెంట్ ఏర్పాట్లు కోసం రవి వస్తాడనుకున్నాను. రవితో ఉన్న యువకుడు వచ్చినా రవి రాలేదు. 

అతడి వద్దకు వెళ్ళి, "రవి రాలేదా" అని అడిగాను. 


"రాలేదు మేడం" అని ఎంతో గౌరవంగా చెప్పాడు. 


నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. తమాయించుకుని

"ఎందుకు రాలేదు తాను వర్క్ చేయడా.. ?” ప్రశ్నించాను. 


"ఇంకో ఈవెంట్ ఉంది మేడం. అటువైపు వెళ్ళాడు. చాలా ఏళ్లుగా మేం ఒకే ఈవెంట్ కి కలిసి వర్క్ చేశాం. ఈరోజు ఈ ఒక్క ఈవెంట్ కి మాత్రం రానని మొండికేసి మరీ వెళ్ళాడు. ఏమైందో తెలియదు, రవి చాలా గొప్ప హృదయం కలవాడు. మా ఓనర్ సైతం అతడికి చేతులు ఎత్తి మరీ నమస్కరిస్తాడు. మా అందరి కంటే ఎక్కువ జీతం కూడా రవికే ఇస్తాడు. రవి అంటే మాకే కాదు బయట వారికి కూడా గౌరవం. అంతేనా.. ఏ ఈవెంట్ కి వెళ్ళినా.. ఆ ఈవెంట్ వాళ్ళు పర్సనల్గా రవిని సన్మానిస్తారు. గతంలో ఈ యూనివర్సిటీలో కూడా ఎన్నోసార్లు ఆ గౌరవం దక్కింది" అన్నాడు. 


ఆ మాటలు విన్నాక గుండె బరువెక్కింది. రవి అడ్రస్ తీసుకొని స్నేహితులతో వర్సిటి చాంబర్ లోకి వెళ్ళాను. అక్కడ యూనివర్సిటీ చైర్మన్ సహా చాలామంది ఫ్రొపెషర్స్ అతడికి సన్మానం చేసిన ఫొటోస్ చూశాను. 


అప్పటికి కానీ నాకు అర్ధం కాలేదు మంచోడు అంటే డబ్బు ఉన్నోడు కాదని గుణం ఉన్నోడని. 


చదువుకున్నోడికి సంస్కారం ఉంటుందో లేదో కానీ.. చదువుకోని వాడికి ఖచ్చితంగా సంస్కారం ఉంటుందని, డబ్బున్నోడు నీతి నిజాయితీగా ఉంటాడో ఉండడో కానీ.. కష్టపడే వాడు మాత్రం మంచి వ్యక్తిత్వమే ఫార్ములాగా బతుకుతాడని. చదువు లేకపోయినా.. సమాజం నుండి ఎలా గౌరవాన్ని తీసుకోవాలో.. సమాజానికి ఎలా గౌరవించాలో తెలిసిన గొప్ప వ్యక్తి రవి. 


రవిని కలిశాను. తిట్టినందుకు క్షమాపణ చెప్పాను. ఏడ్చాను కూడా.. ఆ ఏడుపులో ఎటువంటి నటన లేదు. ఒక గొప్ప మనిషి నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమను తీసుకోలేదు సరికాదా.. అవమానించాను. అతడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నానని అర్ధం అయ్యేలా చెప్పాను. 


కానీ.. నా ప్రేమను రవి సున్నితంగా తిరస్కరించాడు. వాలకాన్ని చూసి ఒక మనిషిని అవమానించేవాళ్ళని, తర్వాత డబ్బు, మరియు, గౌరవాన్ని చూసి ఇష్టపడేవాళ్ళని నా హృదయంలోకి దారివ్వనని. 


రవి చెప్పింది నిజమే. ప్రేమ పేద, ధనిక అంటు తేడ లేకుండా పుడుతుంది. మనుషులే వాటిని అనుగుణంగా ప్రేమను ఎంచుకుంటారు. అలాంటి వారికి నిజమైన ప్రేమ దక్కటానికి వీలులేదు. నేను, నా ప్రేమ డబ్బు కోసం చూడలేదు కానీ.. రవి వాలకాన్ని చూసింది. అందుకే నాకు కూడా నిజమైన ప్రేమ పొందేందుకు అర్హత లేకుండా పోయింది. 


నేను చదివన లా చదువు ఒక మనిషి ధనవంతుడో, గుణవంతుడో తెలసుకోలేకపోయింది, నకిలీ వాడో నిజమైన వాడో పసిగట్టలేకపోయింది. 


ఈ ప్రపంచం అంతా నకిలీ ప్రపంచం అని గుర్తించిన నా మనసు మంచోళ్ళు ఎవరో గుర్తించలేకపోయింది. నకిలీ ప్రపంచం అని నిందించిన నాకు చివరకు నకిలీ మనిషే జీవిత బాగస్వామిగా వచ్చాడు. మనిషినైతే ఉన్నాను కానీ రవి లాంటి వ్యక్తిని పొందే అవకాశాన్ని కోల్పోయి అనుభవిస్తున్న నేను మనసులో ఎప్పుడో చనిపోయాను. 


 **** **** **** **** **** 


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page