top of page
Original.png

నిర్ణయం



Nirnam - Telugu Love Story | Yamini Rajasekhar

నిర్ణయంతెలుగు ప్రేమ కథ

Published In manatelugukathalu.com On 25/04/2026 

రచన: యామిని రాజశేఖర్


ప్రేమలో తీసుకున్న ప్రతి నిర్ణయం జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది.

భయం, నమ్మకం, సంతృప్తి మధ్య జరిగే భావోద్వేగ ప్రయాణం ఈ కథ.

మనసును తాకే నిజమైన ప్రేమకు అర్థం చెప్పే కథ ఇది.


“అమర్! నీకు ఏమనిపిస్తుంది?” అని అడుగుతుంది అలేఖ్య. 


"దేని గురించి అడుగుతున్నావు?" అని అడగటంతో, "ఒక్కొక్కసారి మనిషికి అన్నీ ఉన్నా కూడా, దేని గురించో ఆలోచిస్తూ, ఇంకా ఏదో కావాలని పరుగులు తీస్తూ ఉంటారు. ఎందుకని?" అంటుంది అలేఖ్య.


“చూడు అలేఖ్య, సంపదలోనే జీవనం అనుకుంటే జీవితానికి అర్థం లేదు. సంపద కావాలి, బతకడానికి. కానీ, అంతకు మించినదేంటో తెలుసా? సంతృప్తి. కలిసి మెలిసి జీవనం సాగించేవాడు, మనసుకి సరిపడినంత ఆనందం, తోడుగా నిలిచిన వ్యక్తి, 'నేను ఉన్నాను' అని ఏ సమయంలోనైనా నీడగా, భరోసాతో వెన్నంటే నిలవడం. ఇవి ఏమీ లేకుండా ఎంత సంపాదించినా వ్యర్థమే” అని అంటాడు అమర్.


అలా అమర్, అలేఖ్య ఒక ఉద్యానవనంలో కూర్చుని వచ్చి పోయే వారిని చూస్తూ... "ఏమో, ఒక్కొక్కసారి నీవన్నట్టు ఆలోచిస్తే నిజమే కానీ, ఎందుకు ఇంతమందిని చూస్తుంటే ‘వీళ్ళు కూడా ఇలానే ఉన్నారా, లేకపోతే ఇంకా బాగున్నారా? నాకు ఎప్పుడూ కూడా లేనిపోని ఆలోచనలతో భయం అనేది నన్ను చుట్టుముడుతుంది. మన జీవనం అలా ఉండకూడదు’ అని అనుక్షణం అనుకుంటూ ఉంటాను” అని అంటుంది.


"ఇప్పుడు నేను చెప్పింది అదే అలేఖ్యా! చూడు, నీవేంటో నీకు తెలుసు. నేనేంటో నాకు తెలుసు. మనం ఎలా బతకాలో, ఎలా జీవనం సాగించాలో అనుకునే కదా ఇల్లు విడిచి వచ్చేసాము? ఇది ఇల్లు విడిచి రాకముందే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇలా అనుకుంటే భయంతోనే జీవనం గడిచిపోతుంది. అలా కాక, ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తే మన ప్రేమకి కూడా ఒక అర్థం ఉంటుంది" అని అనటంతో అలేఖ్య కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.


"ఇంతలా నన్ను అర్థం చేసుకున్నావు. నాకెందుకు లోపల భయం? నీకు ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం ఉంది. ఎప్పుడైనా నన్ను నీవు వదిలేస్తావా, అమర్?" అని అడుగుతుంది.


 "ఎందుకు అలా? లేదు, ఎప్పుడైనా కూడా చూడు, నీ మనసుకి అనిపించిందేగా నువ్వు చేశావు? మరి ఇప్పుడెందుకు లేనిపోనివి సృష్టించుకుని నీవు బాధపడుతూ నాకు తెలియని బాధని నువ్వే కల్పిస్తున్నావు."


"నీవు ఉన్నావు అనే ధైర్యమే కదా నేను ఓ అడుగు ముందుకు వేశాను? ప్రేమలో ఇలాంటివన్నీ సహజమే. కానీ, ప్రేమ అనేది ఎప్పుడూ ఓడిపోదు. ప్రేమ ఇద్దరినీ గెలిపిస్తుందని నా భావన. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను" అని అమర్ అలేఖ్యతో అంటాడు.


"మరి?" అని అంటుంది. 


"ఇంకేమీ చెప్పొద్దు. పద, అలా సరదాగా ఎటైనా వెళ్లి నీకు ఇష్టమైన ఆహారం - అదే, ఎప్పుడూ అంటావు కదా, ఆ చిన్న చిన్న పూరీలు దానిలో కాస్త తీయదనాన్ని కలుపుకొని తింటే బాగుంటుందని. అలాగే మన జీవనం కూడా ఎప్పుడూ తీయదనంతో కొనసాగాలి. ఇక ఎప్పుడూ కూడా నీవు బాధపడొద్దు. నీకు నేనున్నాను. మన ఇద్దరం కలిసి కొత్త జీవనాన్ని ప్రారంభిద్దాం. మన ప్రేమ ఈ రోజుది కాదు, మూడేళ్ల నుంచి కలుసుకుంటున్నాం. కాకపోతే తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో తెలియదు గానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఇలా బయటకు వచ్చేసాం. ఒక రోజుకి వాళ్ళు అర్థం చేసుకుంటారు, అప్పుడు అంతా బాగుంటుంది. అప్పటి దాకా కాస్త ఓపిక పట్టు. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను" అని అమర్ అనడంతో… ఏమి మాట్లాడాలో తెలియక ఒక్కసారిగా కుటుంబాన్ని అంతా గుర్తు చేసుకుంటుంది. 


తాను పెరిగిన ఇల్లు, పనివాళ్ళు, అంత పెద్ద హోదా - అన్నీ కాదని, కట్టుబట్టలతో అమరే సర్వస్వమని వచ్చేసా.


 "అమర్ మాటని కాదనకుండా జీవనాన్ని కొనసాగిస్తా. ఎప్పటికైనా నా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు వచ్చిన నాడు, ఇక మన జీనవంలో ఇంతకు మించిన ఆనందం ఉంటుంది" అని అమర్ వెనక చేయి పట్టుకొని నడుస్తూ అమర్ కళ్ళల్లోకి చూస్తుంది అలేఖ్య.


నీతి: ప్రేమ, ప్రేమగా ప్రేమని ప్రేమించడం తెలుపుతుంది.


***


యామిని రాజశేఖర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు యామిని కోళ్ళూరు ....చదువు ఎం.ఏ ...ఎంఫిల్...

నా చదువు మొత్తం తెలుగు మాధ్యమంలో లోనే జరిగింది....

నా అక్షరమే నాలో నింపేను ఉత్సాహంనా అక్షరమే  ఆయుధం నా రచనలకు స్ఫూర్తి దాయకం....

గత నాలుగు సంవత్సరాలుగానేను సాహితీ సమూహాల్లో కవితలు,,, వ్యాసాలు....,కథలు,,,రాయటం.... సమీక్షలు చేయటం....పలు సన్మానాలు,,,,ప్రశంసా పత్రాలు అందుకొన్నాను ‌.....  కొన్ని సదస్సులో....  ఐదవ తెలుగు ప్రపంచ సదస్సులో ...అంతర్జాల సదస్సులో పాల్గొన్న,,,  నిత్య విద్యార్థిని..... ఇంకా భాష గురించి నేర్వాల్సింది చాలా వుంది.......నేను ఇలా ఈ స్థానంలో వున్నానంటేనాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి,,,, గురువులు...రక్తసంబంధీకులు,,,మావారు,,,,, పిల్లలు.... సాన్నిహిత్యాలు వీరి వెన్నుదన్నే కారణం....

ఎందరో కవులు కవయిత్రులు నుంచి కూడాఎంతో తెలుసుకోవాలి....

ఇంకా బాగా రాయాలి......నా లక్ష్యం ఆశయం నేను చేరుకోవాలి....

ప్రస్తుతానికి ఇదే నా గురించి....ధన్యవాదాలు

యామిని కోళ్ళూరు ✍️




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page