top of page
Original_edited.jpg

నిత్య సత్యాలు

  • Writer: Gadwala Somanna
    Gadwala Somanna
  • Nov 6
  • 1 min read

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NithyaSathyalu, #నిత్యసత్యాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 140

Nithya Sathyalu - Somanna Gari Kavithalu Part 140 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 06/11/2025

నిత్య సత్యాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 140 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


నిత్య సత్యాలు

-------------------------------------------

మితిమీరిన కోపము

అనారోగ్య కారకము

పెట్టాలోయ్! దూరము

లేక బ్రతుకు ఘోరము


అందరితో వైరము

కాదు కాదు క్షేమము

శ్రేష్టమైన స్నేహము

జీవితాన దీపము


దుష్టుల సహవాసము

చివరికి వనవాసము

మానుకుంటే మంచిది

తెలుసుకో వాస్తవము


శుద్ధమైన హృదయము

దైవానికి నిలయము

కల్గియుంటే గనుక

బ్రతుకుల్లో ఉదయము

ree









కోడిపుంజు సూచనలు

------------------------------

కలసిమెలసి ఉంటే

ఐకమత్యం వెంటే

బాగుపడును బ్రతుకులు

పెద్దల మాట వింటే


విడిచిపెట్టు కలతలు

శృతిమించిన కక్షలు

పోగొట్టును శాంతము

మనసున ఆనందము


సదనంలో పిల్లలు

గగనంలో చుక్కలు

ఉంటేనే కళకళ

బ్రతుకులో సుగుణములు


ఉత్తి ఉత్తి గొప్పలు

వాసన లేని పూవులు

కాదోయ్! క్షేమకరము

హెచ్చితే హానికరము

ree











కలం చెప్పిన సూక్తులు

--------------------------------------

అక్షరాల సాక్షిగా

అధిగమించు ఒత్తిళ్ళు

మనిషితనం మాలగా

తుడువాలోయ్! కన్నీళ్లు


అందరితో మంచిగా

బ్రతకాలోయ్! మనిషిగా

విజ్ఞానమే మెండుగా

ఉంటే నీకు అండగా


మనసును ఉంచు కుదురుగా

గెలుపు ఇక నీదేగా

మమతను పంచు విరివిగా

ఎద ఎదలో నీవేగా


సాయం చేసి వీక్షించు

విజ్ఞానాన్ని శోధించు

లోకమే దాసోహము

విజయాలే నీ సొంతము

ree








పంతులమ్మ పలుకులు

-----------------------------------------

మరీచికలో నీరును

మూర్ఖుల్లో మార్పును

ఆశించుట వ్యర్థము

అక్షరాల సత్యము


అవినీతిపరులలో,

దుర్మార్గుల మదిలో

అల్పగుణాలధికము

మంచితనం శూన్యము


అబద్దికుల నోటిలో

సత్యాలే నిలవవు

ఎడారి ప్రాంతంలో

పచ్చదనమే కరువు


వానలు కురిస్తేనే

పంటలు పండుతాయి

క్షమను చాటితేనే

చెలిమి పూలు పూస్తాయి

ree















నెలవంక నీతి గీతి

-------------------------------------------------

ఆపదలో ఆప్తుడు

నిజమైన స్నేహితుడు

అట్టి వాడు దొరికిన

బ్రతుకున శ్రీమంతుడు


మనసును గెలిచినోడు

ఇహమున మగధీరుడు

వాని కంటే ఘనుడు

అవనిలోన ఉండడు


అన్నింటికీ మూలము

మనసే ప్రధానము

జాగ్రత్త లేకుంటే

ఇల అతలాకుతలము


మనసుతో పోరాటము

ఉంటుంది నిరంతరము

జయిస్తే విజయమే

ఇక వీర స్వర్గమే

-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page