top of page
Original.png

ఓ ఇల్లాలి కథ

ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

ఒక చిన్న కుటుంబం… ఒక ఆశాజనక జీవితం… కానీ అనుమానాలు, హింస, మౌన బాధలతో చీకటిలోకి జారిపోతుంది. చివరకు ఒక మహిళ తీసుకున్న ధైర్య నిర్ణయం ఆమెకు కొత్త జీవితం ఎలా ఇచ్చిందో చెప్పే కథ ఇది.

O Illali Katha - Telugu Emotional Story | Anisa Tabassum Sk

Published in manatelugukathalu.com on 08/04/2026

ఓ ఇల్లాలి కథ - తెలుగు భావోద్వేగ కథ | అనిసా తబస్సుమ్ SK


పద్మ ఇంటి ముందు ముగ్గేసి ఇంట్లోకి వెళ్లబోతుంటే, గేటు ముందు ఏదో ట్రక్కు ఆగిన శబ్దం వచ్చింది. ఒక ట్రక్కు సామాన్లతో గేటు దగ్గర ఆగి ఉంది. అప్పుడు పద్మకు పక్క పోర్షనులోకి కొత్తగా వచ్చిన వాళ్లని గుర్తుకొచ్చింది. పద్మ ఇంట్లోకి వెళ్ళింది. కొత్త ఇంట్లో సామాన్లు సర్దుకుంటున్నప్పుడు పద్మ టీ తీసుకుని వెళ్లి కొత్తగా వచ్చిన వాళ్లతో పరిచయం చేసుకుంది.


పక్క వాటాలోకి దిగింది ఒక చిన్న కుటుంబం. ఆ ఇంటి ఇల్లాలు కీర్తి, ఆమె భర్త సురేష్, వీరిద్దరికి రెండేళ్ల బాబు.


కీర్తి హాస్పిటల్ లో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది. భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.

పద్మ, కీర్తి మంచి ఇరుగుపొరుగు వారు కావడానికి ఎక్కువ సమయమేమీ పట్టలేదు.

ఇద్దరూ ఎదురు పడినప్పుడు కబుర్లు చెప్పుకోవడం, ఇంటి విషయాలు పంచుకోవడం, కూరలు మార్చుకోవడాలు జరిగేవి.


ఒకరోజు పొద్దునే కీర్తి డ్యూటీకి వెళ్ళేటప్పుడు పనీర్ ప్యాకెట్ పద్మకిచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమని ఇచ్చింది. పద్మకు పనీర్ చూడగానే కొంచెం గమ్మత్తుగా అనిపించింది. ఆ కూర చేయడం పద్మకు రాదు. "ఈసారి పనీర్ కూర వండేటప్పుడు నాకు నేర్పించు కీర్తి" అని అడిగింది. "సరే సరే పద్మగారు" అంటూ నవ్వుతూ డ్యూటీకి వెళ్ళింది కీర్తి.


సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చాక పాలక్ పనీర్ కూర చేసి కొంచెం పద్మ వాళ్లకు ఇచ్చింది కీర్తి. ఉప్పు, కారం అన్నీ సరిగ్గా ఉండటంతో పనీర్ కూర చాలా రుచిగా అనిపించింది పద్మకు.


ఇదిలా ఉండగా సురేష్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు. కొన్ని రోజులకు తెలిసింది సురేష్ ఉద్యోగం పోయిందని. కీర్తి డ్యూటీకి వెళ్తే ఆమె వచ్చేదాకా అతడు ఇంట్లోనే ఉంటూ బాబుని చూసుకునేవాడు. ప్రతి రోజు తాగుడు అలవాటు చేసుకున్నాడు.


పద్మ, కీర్తి ఇళ్లు పక్కపక్కనే కావడంతో అప్పుడప్పుడు కీర్తి డ్యూటీ నుంచి వచ్చాక భర్త సురేష్ ఆమెతో గొడవ పడేవాడు. తాగిన మత్తులో కీర్తిని సిగరెట్లతో కాల్చేవాడు, ఒక్కోసారి కీర్తి ఎదురు తిరిగేది. పద్మ కుటుంబం గొడవ ఆపి సర్ది చెప్పాలి అనుకున్నా, భార్యాభర్తల విషయంలో కలుగజేసుకోకూడదని ఆగిపోయారు. ఒక్కోసారి పద్మ కీర్తి ముఖం చూస్తే దెబ్బలు కనిపించేవి, అయినా అలానే డ్యూటీకి వెళ్ళేది కీర్తి.


సురేష్‌కు తాగుడు ఒక్కటే కాకుండా కీర్తి మీద అనుమానం మొదలైంది. ఈ అనుమానాలతో కూడా ప్రతి రోజు గొడవ పడేవాడు, కొన్నిసార్లు కీర్తి పై చెయ్యి చేసుకునేవాడు. రోజురోజుకీ సురేష్ పనులతో ఆమె విసుగెత్తిపోయింది. వీళ్ళ గొడవలు ఇరుగు పొరుగు వాళ్లకు తెలుస్తున్నాయని సిగ్గుపడి పద్మతో కూడా మాట్లాడటం మానేసింది కీర్తి.


రోజురోజుకీ తనకు తాను దూరమవుతోంది. ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకు నవ్విన ఆమె... ఇప్పుడు నవ్వడం కూడా మర్చిపోయింది. అద్దంలో తన ముఖం చూసుకుంటే... కళ్ల కింద నల్లటి మచ్చలు వచ్చాయి, జీవం లేని కళ్లుగా మారిపోయాయి. సురేష్ ఆమెతో గొడవ పడటం ఇదేమీ కొత్త కాదు. బాబు పుట్టకముందు కూడా ఇలానే గొడవలు అయితే పెద్దలు సర్దిచెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇలా మారాడు సురేష్. బాబు భవిష్యత్తు గురించి ఆలోచించి ఓపికతో, సహనంతో భర్త ఎన్ని హింసలు పెట్టినా భరిస్తోంది కీర్తి.


ఎన్ని రోజులు, నెలలు గడిచినా సురేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. అతనికి ఉద్యోగం రాలేదు, తాగుడు మానలేదు. కనీసం ఉద్యోగం వెతికే ప్రయత్నం కూడా చేయకుండా తాగుతూ... కీర్తి సంపాదనతో బ్రతుకుతున్నానన్న కోపం, ద్వేషం పెంచుకుని ఆమె మీద కఠువుగా ప్రవర్తిస్తున్నాడు. కీర్తి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ఒక కారణం వెతికి మరీ గొడవపడి ఆమెను కొట్టేవాడు.


ఒక రోజు రాత్రి... సమయం 1:00 అవుతోంది. కీర్తి ఇంట్లో నుంచి సురేష్ గొంతు గట్టిగట్టిగా వినిపిస్తోంది. కీర్తి ఒక్కసారిగా గట్టిగా అరిచింది. పద్మ దంపతులకు పూర్తిగా మెలకువ వచ్చి ఏం జరుగుతుందో అని కంగారు పడ్డారు. మధ్యలో వెళ్లి మాట్లాడదాం అనుకుంటే, అసలే తాగేసి ఉన్నాడు, ఏమంటే ఎలా స్పందిస్తాడో అని ఆలోచించి ఆగిపోయారు.


తెల్లవారేసరికి పద్మ ముగ్గు వేయడానికి బయటికి వస్తే, సురేష్ కంగారు కంగారుగా బయటికి వెళ్తూ కనిపించాడు. కీర్తి ఇంటి వైపు చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. ఆ సమయానికి కీర్తి డ్యూటీకి వెళ్లిందని అనుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ వెళ్లిపోయింది.


నాలుగైదు రోజులు గడిచినా కీర్తి కానీ సురేష్ కానీ ఎవరూ రాలేదు. ఒక నెల తర్వాత కీర్తి తన తల్లిదండ్రులతో కలిసి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది.


ఆ రోజు రాత్రి సురేష్ బాగా తాగి కీర్తిని సిగరెట్లతో కాలుస్తూ, ఆ మద్యం మత్తులో ఆవేశంతో వంటగదిలో ఉన్న కత్తి తీసుకుని ఆమెను చంపబోయాడు. కీర్తి భయంతో గట్టిగా కేక పెట్టింది. ఆ అరుపులకు బాబు నిద్రలేచి ఏడవడంతో బాబును పడుకోబెడుతూ ఆ మత్తులో అతను కూడా పడుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి భయపడిపోయిన కీర్తి, పరుగెత్తుకుంటూ డాబా పైకి వెళ్లి ట్యాంకుల వెనుక దాక్కుని తన తల్లిదండ్రులకు, తమ్ముడికి ఫోన్ చేసి సంగతి చెప్పి రమ్మని కోరింది. 


ఇంకా అతనితో ఉంటే చంపేస్తాడని భయపడింది. రాత్రి మూడింటికి కీర్తి తమ్ముడు రాగానే పిల్లాడ్ని, కావాల్సిన వస్తువులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న సురేష్ కీర్తి పుట్టింటి దగ్గర, హాస్పిటల్ దగ్గర గొడవ చేశాడు. సురేష్‌తో ఎప్పటికైనా ఇబ్బందే అని ఆలోచించి అతని మీద కేసు పెట్టి విడాకులు తీసుకుంది. 


తన గతంలోని చేదు అనుభవాలను మర్చిపోయి… కీర్తి తన కొడుకుతో సంతోషంగా ఉంటూ, అతని ఆలనా పాలనా చూసుకుంటూ, కొత్త ఆశలతో తన కొత్త జీవితానికి నాంది పలికింది.


పద్మ దంపతులు ఇప్పటికీ కీర్తి విషయంలో పశ్చాత్తాపం చెందుతారు. ఒక ఆడపిల్ల కష్టంలో ఉందని తెలిసి కూడా సురేష్‌కి భయపడి వెళ్లి కాపాడలేకపోయినందుకు, ఆమెకు అండగా నిలబడలేక పోయినందుకు ఆ దంపతులు తమ తప్పు తెలుసుకుని నేటికీ బాధపడుతూనే ఉన్నారు.


కథ సమాప్తం


-*అనిసా తబస్సుమ్ Sk(Anisa Tabassum SK)


అనిసా తబస్సుమ్ SK  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కథ సమాప్తం


అనిసా తబస్సుమ్ SK


3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Good story telling anisa garu👏. Need more stories like this to get awareness among people.

Like
Shaik Anu
Shaik Anu
Apr 13
Replying to

Thank you, it means a lot😊😊

Like

Shaik Anu
Shaik Anu
Apr 08
Rated 5 out of 5 stars.

❤🤞

Like
bottom of page