top of page
Original.png

ఒక అమ్మా నాన్న


ఒక అమ్మా నాన్న తెలుగు కథలో వృద్ధాప్యంలో అనాథాశ్రమంలో ఉంటున్న గోపాలయ్య, సుమిత్ర దంపతులు, పశ్చాత్తాపంతో వారిని కలవడానికి వచ్చిన కుమారుడు నారాయణ

Oka Amma Nanaa - Telugu Moral Story | Ch. C. S. Sarma 

ఒక అమ్మా నాన్న - తెలుగు నీతి కథ | సిహెచ్. సీఎస్. శర్మ

Published In manatelugukathalu.com On 20/10/2026


ఒక అమ్మా నాన్న కథ తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమను, పిల్లలు తమ పట్ల చూపాల్సిన బాధ్యతను హృదయానికి హత్తుకునేలా వివరిస్తుంది. సిహెచ్. సీఎస్. శర్మ రచించిన ఈ కుటుంబ కథ, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల మనోవేదనను తెలియజేస్తూ కుటుంబ బంధాల విలువను గుర్తుచేస్తుంది.


ఈ సృష్టిలో మానవుడు మహోన్నత జీవి. కోట్ల జీవరాసులు ఆ సర్వేశ్వరుని నిర్దేశకత్వంతో ఈ సృష్టిలో ఉద్భవించాయి. అందులో మానవుడు మహోన్నతుడు. ఆ సర్వేశ్వరుడు ఈ మానవునికి రెండు మహోన్నత గుణాలను ప్రసాదించాడు.


ఒకటి — ఆలోచనా శక్తి.

రెండు — విచక్షణా శక్తి.


తల్లి నవమాసాలు మోసి, నరకయాతన అనుభవించి, పునర్జన్మ ఎత్తి మనకు జన్మనిస్తుంది. మనలను తన ప్రాణసమానంగా భావిస్తుంది.


తండ్రి మనలను ఎత్తుకుని, కథలు, గాథలు, పాటలు చెబుతూ జోకొట్టి నిద్రపుచ్చుతాడు. మన చేతిని పట్టుకుని మనలను నడిపిస్తాడు.


మనకు ఆ ఇరువురు దేవతలు మంచి మాటలు వినిపిస్తారు. మంచి విషయాలు చెబుతారు. మన జీవితంలో వారు మనకు ఆది గురువులు.


యుక్తవయసుకు రాగానే యువతీయువకులు తల్లిదండ్రుల సాయంతో పెరిగి పెద్దవుతారు. కానీ చాలామంది తమ గతాన్ని, తమ భావి జీవితానికి ఎంతో ప్రధానపాత్ర వహించిన తమ తల్లిదండ్రులను గురించి విస్మరిస్తారు.


రెక్కలు వచ్చిన పిట్టలవలె తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోతారు. ప్రేమ పేరుతో ఒక సుందరాంగిని వలచి, ఆమె కులమతాలను లెక్కచేయకుండా ఆమెనే వివాహం చేసుకుని తల్లిదండ్రులకు దూరమవుతారు.


ప్రతి తల్లిదండ్రులు బిడ్డలు ఎదిగే కొద్దీ వాళ్ల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అంటే తమ పిల్లలు సభ్య సమాజంలో ఉత్తములుగా, సన్మార్గవర్తనులై పదిమందికి ఆదర్శం కావాలని ఆశిస్తారు.


కానీ యుక్తవయసులో ఉన్న యువతీయువకులు ఆ విషయాన్ని మరిచి, తమ ఇష్టానుసారంగా వర్తించి తల్లిదండ్రులకు ఎంతో ఆవేదన కలిగిస్తారు. వయసులో పలికే ప్రేమ అనే పదం అది ప్రేమ కాదు, వ్యామోహం! ఆ వ్యామోహం విషం లాంటిది.


మనసులోని మంచితనాన్ని మాయం చేసి, విషాన్ని నింపి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా దూరం చేస్తుంది. అలాంటి మార్గంలో నడిచినవాడే నారాయణ.


పేరు ఎంత మంచి పేరు, ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెట్టుకున్న ముద్దు పేరు.

పెద్దయ్యాక నారాయణ కాలేజీ రోజుల్లో తనతో చదివే అరుణ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.


"నిన్నే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పి ఆ పిల్ల మనసులో ఎన్నో ఆశలు కలిగిస్తాడు.

ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆ పిల్ల వేరే కులం.


ఈ కారణంగా కొడుకు నిర్ణయాన్ని విన్న తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారు. వారు చక్కని హైందవ సంప్రదాయాలతో, సనాతన ధర్మాలను పాటిస్తూ తమ జీవిత కాలాన్ని గడిపినవారు. కొడుకు ధోరణి వారికి నచ్చలేదు.


నారాయణకు తల్లిదండ్రుల అభిప్రాయం గిట్టలేదు. చివరికి ఆ పిల్లను నారాయణ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి దూరంగా వెళ్లిపోయాడు.


ఒక్కగానొక్క కొడుకు నారాయణ తన యవ్వన దశలో తల్లిదండ్రులను ఆ రీతిగా నిర్లక్ష్యం చేస్తాడని ఆ పిచ్చి తల్లిదండ్రులు ఊహించలేదు. కుమిలిపోయారు. అవమానం పాలయ్యారు. ఆరోగ్యం చెడిపోయింది. తీరని, ఆరని మనోవేదన.


ఆ ఇరువురు తల్లిదండ్రులు ఇలా అనుకున్నారు: "తప్పు మన వాడిది కాదు. ఆ విధాతది. ఆ రీతిగా వాడి మనస్తత్వాన్ని చిత్రించింది ఆ దేవదేవుడే కదా! ఇందులో మన పూర్వజన్మ సుకృతం కూడా ఉంది. కాబట్టే వాడికి అలాంటి బుద్ధి కలిగింది.


వాడి తప్పును ఎంచి మనం వాడికి అన్యాయం చేస్తే, వచ్చే జన్మలో కూడా మన గతి ఇంకా ఎంత అధోగతిగా మారుతుందో! కనుక మనకు ఉన్న ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు వాడి పేరున రాసి, లాయర్ ద్వారా ఆ డాక్యుమెంట్‌ను వాడికి అందజేద్దాం.


మనం తప్ప ఎవరూ లేరు కదా, కనుక అనాథాశ్రమంలో పదిమంది మనవంటి వారితో కలిసి, దైవాన్ని ధ్యానిస్తూ, పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ శేష జీవితాన్ని గడపడమే ధర్మం" అని భర్త గోపాలయ్య భార్య సుమిత్రను అడిగాడు.


సుమిత్ర భర్త మాటకు తన అంగీకారాన్ని తెలిపింది.

గోపాలయ్య అనుకున్నది చేశాడు. పత్రాలన్నీ కొడుకు పేరున రాసి పంపించేశాడు. భార్యతో కలిసి అనాథాశ్రమానికి వెళ్లిపోయాడు.


ఆ పత్రాలను చూసి నారాయణ ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ అనాథాశ్రమానికి వచ్చాడు. తల్లిదండ్రులను కలిశాడు. వారిని తనతో రమ్మని పిలిచాడు.


అందుకు జవాబుగా ఆ తల్లిదండ్రులు ఇలా అన్నారు:

"నాన్నా, మా జీవితం చివరి పర్వంలో ఉంది. నీకు మేము భారం కాదలచుకోలేదు. మాకు మా తోటివారితో ఇక్కడ హాయిగా ఉంది. నీవు నీ భార్య, పిల్లలతో హాయిగా నీ జీవితాన్ని ముందుకు సాగించు. మనది రుణానుబంధం.


మా గురించి నీవు దిగులుపడకు. నీ జీవితాన్ని నీవు జాగ్రత్తగా చూసుకో.


ఒక్క మాట... మా బ్రతుకులాగా నీ బ్రతుకు బావిలో కాకుండా, నీ పిల్లలను నీవు సక్రమంగా సంరక్షించుకో. తల్లిదండ్రులుగా మేము నీకు మా చివరి దశలో ఇచ్చే సలహా ఇదేరా నాయనా..." అని నవ్వుతూ చెప్పారు ఆ వృద్ధ దంపతులు.


*** సమాప్తం ***


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page