top of page

పాక్ పెద్దలకు పిలుపు

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #PakPeddalakuPilupu, #పెద్దలకుపిలుపు,  #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Pak Peddalaku Pilupu - New Telugu Poem Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 09/05/2025 

పాక్ పెద్దలకు  పిలుపు - తెలుగు కవిత

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు


ప్రియ  పాకిస్థాన్  దేశ పెద్దలారా!    

గత చరిత్రకు ప్రత్యక్ష సాక్షులారా!

స్వాతంత్రోద్యమ స్పూర్తినెరిగిన విజ్ణులార!

ఈశ్వర్ అల్లా తేరే నాం సబ్ కో సన్మతి దే భగవాన్! 

మహాత్మ గాంధీజీ ఆశయం మర్చిపోయారా! 

ఒకే జాతిగా ఆంగ్లేయులని తరిమిన  మనం 

రాజకీయుల, ఉగ్రవాదుల పన్నాగాలకు  

అమాయకంగా, నిస్సహాయంగా బలి అవుతున్నాం!

ఏడు పదుల వయస్సులో,  యవ్వ నులై  నడుం కట్టండి 

మన ఐక్యత కోసం నిండు ప్రాణాలర్పించిన బాపూజీ 

అహింసా పరమోధర్మ సూక్తిని, శాంతి మంత్రాన్ని 

ఉజ్జ్వల భవిష్యత్తుని కోరే యువతకు చాటి చెప్పండి

రక్తపిపాసులైన మిలిటరీ యోధులను 

మహోద్యమంతో కట్టడి చేయండి.

అమ్మల కడుపుకోతకు తావు లేదని చెప్పండి

సౌహార్ద్రం, సౌభ్రాతృత్వం  పునాదులుగా 

రెండు దేశాల పురోగతికి బాటలు వెయ్యండి.  


***


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

4 Comments


ప్రతి ఒక్కరికి దేశభక్తి, సంఘటిత స్ఫూర్తి, ఉత్సాహం కలిగించే మాటలు. జై భారత్.

Like

History is to be remembered to establish peace all around not to promote terrorism. Kudos to the poet who could touch upon the finer emotions and memories of togetherness of the senior citizens of Pakistan 🙏

Like

ఈ కవిత ఒక శాంతి సందేశం.చరిత్రకు సాక్షులైన వారిని ఉద్దేశిస్తూ, ఈ కవిత ఆత్మపరిశీలన కోరుతోంది. గాంధీ గారి ఆశయాలను స్మరించమని, అహింసా మార్గాన్ని పట్టమని, ఉగ్రవాదానికి బలి కావడం ఎలా అన్యాయం అనేది బాగా చెప్పారు.


మానవత్వానికి వ్యతిరేకంగా యుద్ధాలు అనివార్యం అయినప్పుడు, కన్నతల్లుల కన్నీరు కడుపుకోతలు తప్పవు.

బాధగా అనిపించినా, ఈనాటి శాంతి జండా, రక్తం, చావు, కన్నీరు తరువాత పుట్టే వెలుగు.

జై హింద్🫡

Like

పాక్ పెద్దలకు పిలుపు..చాలా సమయోచిత కవిత..యుద్ధం వలన కలిగే దుష్పరిణామాలను వివరించారు..

Like
bottom of page