పాలపిట్ట పలుకులు
- Gadwala Somanna

- Nov 3
- 2 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PalapittaPalukulu, #పాలపిట్టపలుకులు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #పెందోటసాహితీపురస్కారం

సోమన్న గారి కవితలు పార్ట్ 138
Palapitta Palukulu- Somanna Gari Kavithalu Part 138 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 02/11/2025
పాలపిట్ట పలుకులు - సోమన్న గారి కవితలు పార్ట్ 138 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
పాలపిట్ట పలుకులు
-------------------------------------------
అంతరంగాన సత్యము
పెదవుల మీద నిత్యము
ఉండనివ్వు ఓ మనసా
అది కదా ఆణిముత్యము
పెదవిని దాటిన మాటలు
చేయి జారిన బంధాలు
ఎప్పటికీ తిరిగిరావు
మునుపటిలా ఉండనేరవు
అత్యధికమైన ఆశలు
అశాంతికి వేయు బాటలు
ప్రశాంతత కావాలంటే
ఉంటే మేలు హద్దులు
గురువుల బోధలు శ్రేష్టము
జీవితాల్లో క్షేమము
పచ్చగా ఉండును భవిత
అడుగడుగునా నవ్యత

గర్వకారణం
------------------------------
చేయి చేయి కలిస్తే చప్పట్లు
మనసు మనసు కలిపితే ముచ్చట్లు
కష్టపడి పనిచేస్తే దూరమగు
బ్రతుకుల్లో ఆర్ధిక ఇక్కట్లు
విజ్ఞాన జ్యోతి వెలిగిస్తే
తొలగును అజ్ఞానపు చీకట్లు
ఎదుర్కో వచ్చు సాహసిస్తే
జీవిత సాగరాన ఆటుపోట్లు
జీవితమన్నది అమూల్యమైనది
ఏది ఇచ్చినా సమముకానిది
కాకూడదోయ్! అతలాకుతలము
చేసుకోవాలి సద్వినియోగము
మాటయిస్తే కట్టుబడి ఉండాలి
అడ్డంకులు వచ్చినా నిలబడాలి
అదే కదా స్ఫూర్తికి నిదర్శనము
జీవితాల్లో గర్వకారణము

ఖగం చెప్పిన సూక్తులు
------------------------------------
పొరుగు వారి మేలు చూసి
ఓర్వలేని వానితో
చేయవద్దు సహవాసము
ప్రేమ లేని మనిషితో
బుద్ధిహీనుల జోలికి
ఏమాత్రం పోవద్దు
వదరుబోతుల నోటికి
మిత్రమా! బలి కావద్దు
అపహాసకుల సమీపాన
ఎనలేని అవమానాలు
కదిలిపో దూరంగా
ఉంటావు క్షేమంగా
లేనిపోని వాటితో
పనికిమాలిన పనులతో
గౌరవం తగ్గుతుంది
అవహేళన మిగులుతుంది

పావురం పాఠాలు
-----------------------------------------
మనసులోని మత్సరము
తొలగితే సంబరము
జీవితమే అవుతుంది
కొంగ్రొత్త వత్సరము
నీచమే లోభత్వము
శ్రేష్టమే దాదృత్వము
సంస్కారము మకుటము
కల్గియున్న గౌరవము
అల్పబుద్ధులు మదిలో
త్రుంచాలి ఆదిలో
అప్పుడే సాధ్యమగును
లేనిచో కష్టమగును
కృతఙ్ఞత వీడితే
బ్రతుకగును అధోగతే
అవగాహన లేమితో

గర్వకారణం
-------------------------------------------------
చేయి చేయి కలిస్తే చప్పట్లు
మనసు మనసు కలిపితే ముచ్చట్లు
కష్టపడి పనిచేస్తే దూరమగు
బ్రతుకుల్లో ఆర్ధిక ఇక్కట్లు
విజ్ఞాన జ్యోతి వెలిగిస్తే
తొలగును అజ్ఞానపు చీకట్లు
ఎదుర్కో వచ్చు సాహసిస్తే
జీవిత సాగరాన ఆటుపోట్లు
జీవితమన్నది అమూల్యమైనది
ఏది ఇచ్చినా సమముకానిది
కాకూడదోయ్! అతలాకుతలము
చేసుకోవాలి సద్వినియోగము
మాటయిస్తే కట్టుబడి ఉండాలి
అడ్డంకులు వచ్చినా నిలబడాలి
అదే కదా స్ఫూర్తికి నిదర్శనము
జీవితాల్లో గర్వకారణము
పెందోట సాహితీ పురస్కారానికి గద్వాల సోమన్న ఎంపిక

నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ సాహిత్యవేత్త, బాలబంధు శ్రీ గద్వాల సోమన్న పెందోట సాహితీ పురస్కారానికి (2025)ఎంపికైనట్లు శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఈ సంస్థ వారు నిర్వహించిన బాలసాహిత్య సంపుటాల పోటీలలో సోమన్న విరచిత "తారాజువ్వలు" పుస్తకం బాలసాహితీ పురస్కారానికి ఎంపిక చేసి 16,నవంబర్ -2025న నగదు తో పాటు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.వీరు అనతి కాల వ్యవధిలో 84 పుస్తకాలు వ్రాసి ముద్రించడం విశేషం, గమనార్హం.అవార్డు గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు మరియు విద్యార్థులు అభినందించారు.
-గద్వాల సోమన్న







Comments