top of page

పల్లె - పట్నం


'Palle Patnam - New Telugu Song Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 01/11/2023

'పల్లె - పట్నం' తెలుగు పాట

రచన : సుదర్శన రావు పోచంపల్లి


పట్నాము పోదాము పదవే గంగమ్మ

పల్లినొదిలి పోదాము కదలవే గంగమ్మ

దుక్కిదున్నీ దుమ్ము దులుపుకుంటూ వస్తె

బుక్కెడూ గటుకైన గుక్కెడూ గంజైన

దక్కనీ బతుకాయె దారిద్రం మనదాయె


పట్నాము పోదాము పదవే గంగమ్మ

పల్లెనొదిలి పోదాము కదులవే గంగమ్మ


పట్నాము మాటొద్దు పల్లెనొదిలి పోవద్దు

ఇల్లు విడిచి నేను రాను ఇంకేడా బతుకలేను

పట్నంలో పనిజేస్తె పరువు మనది నిలువబోదు

పట్నాము మాటొద్దు పల్లెనొదిలి పోవద్దు


పట్నాము పోతె మనము గంగమ్మ

బస్సులో దిరుగొచ్చు బాజార్లు జూడొచ్చు

గొట్టాపు నీళ్ళతోడ గొంతు తడుపుకోవచ్చు

కూలినాలి జేసుకుంటు కొంత సొమ్ము గూడబెట్టొచ్చు


పట్నాము పోదాము పదవే గంగమ్మ

పల్లెనొదిలి పోదాము కదులవే గంగమ్మ


పల్లెనొదిలి మనము బోతె

ఇల్లు మనది కూలిపోవు పొలము బీడు బారిపోవు

తిప్పలెన్నొ బడి జూసి తిరిగి వస్తె మనను జూసి

అప్పులోడు నమ్మబోడు ఉన్న నీళ్ళు ఉప్పులౌను

కోడి పాడి కొరకు రావు కాడి ఎడ్లు కదులలేవు

పట్నాము మాటొద్దు పల్లెనొదిలి పోవద్దు


పట్నాము పోదాము పదవే గంగమ్మ పల్లెనొదిలి పోదాము కదులవే గంగమ్మ


పట్నాము మాటొద్దు పల్లెనొదిలి పోవద్దు

ఉన్న ఊరె స్వర్గమయ్య కన్నవాడె దేవుడయ్య

మన ఊరె రాజ్యమయ్య మన రైతులులె రాజులయ్య

పట్నాము మాటొద్దు పల్లె నొదిలి పోవద్దు


పట్నాము పోదాము పదవే గంగమ్మ

పల్లెనొదిలి పోదాము కదులవే గంగమ్మ


రోజు రోజు పస్తులుండి రోసుకుంటు బతుకలేము

అప్పులైన దొరకవాయె తిప్పలింక దప్పవాయె

పట్నాము పోదాము పదవే గంగమ్మ

పల్లెనొదిలి పోదాము కదులవే గంగమ్మ


పట్నాము మాటొద్దు పల్లెనొదిలి పోవద్దు

రోజుగారు యోజనాలు రోజు రోజు పెరుగుచుండె

కూడు గూడు గుడ్డ మనకు దక్కజూసి సర్కరోళ్ళు

ఊరు వాడ వెతుక్కుంటు ఉపకారం జేస్తుండిరి


బడులొచ్చె బేంకులొచ్చె అడుగకుండ అప్పులొచ్చె

పంచాయితీలొచ్చి ప్రభుత్వం మనదాయె

కే సీ ఆరు పున్నెమని కూలి నాలి దొరుకుచుండె

కడుపు కాస్త నిండు చుండె కష్టాలు దీరుచుండె

మంచి మనసు బెంచుకుంటె మన ఊరె మంచిదయ్య


పట్నాము మాటొద్దు పల్లెనొదిలి పోవద్దు

కాళ్ళకాడి సిరినొదిలి కానలేము బదుకేడ-----

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


33 views0 comments
bottom of page