top of page

ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 10


'Prema Entha Madhuram Episode 10' - New Telugu Web Series Written By

Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 01/11/2023

'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


సతీష్.. సుశీల ల సంసారం హ్యాపీ గా సాగుతూ ఉంటుంది. సతీష్.. అప్పుడప్పుడు దిగాలుగా ఉండడం గమనించిన సుశీల, కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది.


సతీష్ టేబుల్ డ్రాలో ఒక డైరీ కనిపిస్తుంది సుశీలకి.. అందులో కొన్నిపేర్లు మాత్రమే రాసి ఉంటాయి. మర్నాడు మళ్ళీ వెతకగా కొన్ని ఫొటోలు దొరుకుతాయి. అతని గతం తెలుసుకోవాలనుకుంటుంది.


సతీష్ స్నేహితురాళ్ళు రాణి, రజని, లత, లక్ష్మి లను కలుస్తుంది. సతీష్ బర్త్ డే పార్టీకి రమ్మని అందరినీ కోరుతుంది. తర్వాత కళ్యాణి ఇంటికి వెళ్ళి ఆమె ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. సతీష్ కు ఫోన్ చేసి, ఇంటికి తిరిగి వస్తుంది సుశీల.


మర్నాడు కళ్యాణి కి ఫోన్ చేసి తన స్టొరీ తెలుసుకుంటుంది. పార్టీ కి రమ్మని చెబుతుంది.


సతీష్ బర్త్ డే సెలెబ్రేట్ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తారు సుశీల, కమల.

పార్టీకి వచ్చిన స్నేహితురాళ్లు గురించి ప్రస్తావిస్తాడు సతీష్.


ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 10 చదవండి.“నాకు తెలుసునండి.... మీ గురించి... మీరు... నాకు సంజాయిషీ చెప్పనవసరం లేదు”.


"సుశీల! నేను అంటే ఇష్టమేనా"?


"మళ్లీ మొదలెట్టారు!.... శ్రీవారు.. మీరంటే నాకు చాలా... చాలా ఇష్టం.... ఇదంతా చేసింది... మీ దిగులు పోగట్టడానికి... మీ మీద అనుమానము తో కాదు శ్రీవారు... "


“పద... ఇంటికి పద…”


అందరూ వెళ్ళిపోయారు...

కార్ స్టార్ట్ చేసి సతీష్ చల్లటి వెన్నెల లో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ చల్లటి గాలిలో... పక్కన తనని ఎంతగానో ప్రేమించే సుశీ... తల బుజం మీద వాల్చి నిద్రపోతుంటే, తనకోసం ఇంత చేసిన తన సూసీ ని చుస్తువేంటే.... ఎంతో ఆనందంతో.. తన మనసులో దిగులంతా... మర్చిపోయాడు సతీష్.


మర్నాడు... మార్నింగ్ సతీష్ కు ఫోన్ వచ్చింది...

"హలో"


"హలో! నేను కళ్యాణి"


"చెప్పు కళ్యాణి... ఏమిటి విషయాలు?... "


"నేను హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను... డాక్టర్ తెలిసిన వాళ్ళని... పిలవని చెప్పారు... నా కెవరు లేరు కదా!.. అందుకే నీకు ఫోన్ చేశాను.. సుశీల గారికి చెప్పు... ఇద్దరు వచ్చి డాక్టర్ తో మాట్లాడండి... "


"అలాగే!... నువ్వు కంగారు పడొద్దు"


"సూసీ! కళ్యాణి ఫోన్ చేసింది... హాస్పిటల్ లో ఉందంట.... మనం వెళ్ళాలి.. పద"


"వస్తున్నా.. పదండి... "


ఇద్దరు హాస్పిటల్ కు చేరుకున్నారు... డాక్టర్ కేబిన్ లోకి పిలిచారు....


"మీకు కళ్యాణి ఏమవుతారు... " అని డాక్టర్ అడిగారు.


"మా ఫ్రెండ్... చెప్పండి డాక్టర్"


"బ్లడ్ రిలేషన్ ఎవరు లేరా?"


"లేరండి... ఉన్న మదర్ కూడా ఈమధ్య కాలం చేసారు.. మాకు చెప్పండి!.. పర్వాలేదు... "


"కళ్యాణి గారి కి కాన్సర్ ఉంది... ఈ విషయం ఆవిడకు ముందు నుంచి తెలుసు... అడ్వాన్స్డ్ స్టేజి.... 2 నెలలు కన్నా ఎక్కువ బతకరు!... చెప్పాలి... నా ధర్మం కాబట్టి చెబుతున్నాను... ఉన్నన్నీ రోజులు ఆవిడని హ్యాపీ గా ఉంచడానికి ట్రై చెయ్యండి... "


డాక్టర్ కేబిన్ లోంచి బయటకు వచ్చిన సతీష్.. సుశీల... కళ్యాణి దగ్గరకు వచ్చారు..


"సతీష్! డాక్టర్ ఏమిటి చెప్పారు?"


"నీకు తెలిసిన విషయమే చెప్పారు"


"చెప్పేసారా?... "


"నాకేమైనా అయితే... నా పాప ను మీరే చూసుకోవాలి సుశీల... "


"అలాగే! నువ్వు రెస్ట్ తీసుకో... మేము వెళ్తాము.... పాప ను జాగ్రత్త గా చూసుకో.... అన్నాడు సతీష్"కొన్ని రోజుల తర్వాత.... సుశీల నోట్లోంచి బ్లడ్ వచ్చింది... వెంటనే తుడిచేసుకుంది.... ఎవరికీ తెలియకుండా..

సుశీల చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. డాక్టర్.. అన్నీ... టెస్ట్స్ చేసి... కాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజి లో ఉంది అని చెబుతారు...

"నాకు తెలుసు డాక్టర్" అని చెబుతుంది... సుశీల.

"మీ ఆయనకు తెలుసా... "అడిగాడు డాక్టర్.


"నో డాక్టర్... తెలియదు"


"మీ అయన ను ఒకసారి కాల్ చేయమని చెప్పండి... నేను చెబుతాను"


"అలాగే డాక్టర్!"


ఒక రోజు సుశీల... సతీష్ కు తన గురించి చెబుదామని అనుకుంటుంది..

"ఏమండి! మీకు ఒక విషయం చెప్పాలి... "


"చెప్పు సూసీ!"


"నేను అప్పుడు మా ఫ్రెండ్ కమల దగ్గరకు వెళ్ళాను కదా... అక్కడనుంచి... కొంత మంది స్నేహితులని కలవడానికి వెళ్ళాను... అప్పుడే నేను రాణి, రజని, లత, ను కలిసాను. తర్వాత ఫోన్ లో కళ్యాణి తో మాట్లాడాను... "


"నువ్వు చేసిన పని కి.. నేను ఎప్పుడో మెచ్చుకున్నాను కదా!"


"అది కదండీ!"


"మరి ఏమిటి?"


"అప్పుడు.. నేను తిరుగుతున్నప్పుడు.... నోట్లోంచి బ్లడ్ పడిందండి... "


"ఏమైంది సుశీల? వేడి చేసిందా?"


"లేదండి.. డాక్టర్ కు చూపించాను.... కాన్సర్ అని చెప్పారు"


"జోక్ లు వెయ్యకు సుశీల. తమాషాకి కూడా అలాంటివి మాట్లాడకు.... నువ్వు లేని... నేను లేను అని నీకు తెలియదా?"


ఎలా చెప్పను ఈయనకు.. నమ్మట్లేదు..


"ఏమండి! నేను వెళ్లిన డాక్టర్ మిమల్ని కాల్ చెయ్యమన్నారు... ఇదిగోండి నెంబర్"


"హలో డాక్టర్! నేను సుశీల హస్బెండ్ మాట్లాడుతున్నాను.. మా ఆవిడా మీ దగ్గరకు చెక్ అప్ కు వచ్చిందంట... అంతా నార్మల్ కదా సార్... "


"నేను చెప్పేది కొంచం నిదానంగా వినండి... మీ ఆవిడకు కాన్సర్ ఉంది... ఐ యాం సారీ"


"అది విన్న సతీష్ కు ఆల్మోస్ట్ హార్ట్ఎటాక్ వచ్చినంత పని అయ్యింది... స్పృహ తప్పి పడిపోయాడు..


"సుశీల... నీళ్లు చల్లి... లేపింది... "


"నేను విన్నది కలా?నిజామా?"


"నిజమేనండి.. "


"నిన్ను నేను బతికించుకుంటాను.... ఫారిన్ తీసుకుని వెళ్లి... "


"ఆ ఛాన్స్ లేదండి.... లాస్ట్ స్టేజి.. ”


"సూసీ! ప్లీజ్ నను విడచి వెళ్ళకు... నేను ఉండలేను.. ” అని చిన్న పిల్లోడిలాగా ఏడుస్తున్నాడు…


సూసీ.. సతీష్ ను వాటేసుకుని.... “అయ్యో శ్రీవారు! మన చేతిలో ఏముంది చెప్పండి.... ఉన్న రోజులు నేను మీతో హ్యాపీ గా ఉండాలని అనుకుంటున్నాను....

నేను వెళ్ళిపోయినా.... మీ కోసమే పైన వెయిట్ చేస్తుంటాను.... ఎన్ని సంవత్సరాలైనా.... ”

అలా ఏడ్చి... సతీష్ కు నిద్ర పట్టేసింది సుశీల వొడిలో.... ఆ రోజు ఇంకేమి మాట్లాడలేదు సుశీల...


కొన్ని రోజుల తర్వాత.... సతీష్ స్తిమిత పడ్డాకా...

"మీకు ఇంకొక మాట చెప్పాలండి.... నేను ట్రిప్ లో అందర్నీ కలిసింది.... పార్టీ కోసమే అయినా.... ట్రిప్ మధ్యలో నాకు ఈ జబ్బు గురించి తెలిసాక... ఒక ఆలోచన వచ్చింది... నేను కలిసిన... మీ అందరి ఫ్రెండ్స్ ను గమనించాను... మీ మీద ఉన్న ప్రేమ గాని... అభిమానం గాని... వాళ్ళ ప్రవర్తన... అన్ని గమనించాను…


అందరితో మాట్లాడిన తర్వాత.... నాకు ఒకటి అనిపించింది... లత కు మీరంటే చాలా ప్రేమ... కానీ మీతో చెప్పలేదు... ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు...


నేను పోయిన తర్వాత... మీరు లత ను పెళ్లి చేసుకోవాలండి... నాకు మాటివ్వండి... "


"ఇప్పుడెందుకు సూసీ.. అదంతా!"


"నాకు మాట ఇస్తారా లేదా?"


"చూద్దాం లే"


"నువ్వు లేక నేను ఉండలేని సూసీ... నీ ప్లేస్ ఎవరు తీసుకోలేరు......... "


సతీష్... సుశీల ను బతికించుకోడానికి... అన్ని ప్రయత్నాలు చేసాడు... కాస్టలీ ట్రీట్మెంట్ చేయించాడు...

సుశీల ఉన్న రోజులు సతీష్ తో హ్యాపీ గా ఉంది... ఒక రోజు.... అనంతలోకాలకు వెళ్లిపోయింది....


కళ్యాణి కూడా సుశీల కు తోడుగా వెళ్లిపోయింది...

సతీష్ ఒంటరి వాడైపోయాడు..... నిద్రా... ఆహారాలు మాని.... అలాగ చీకటి గదిలో ఉండిపోయాడు...


సతీష్ ను పలకరించడానికి ఫ్రెండ్స్ అంతా వచ్చారు.... అందరూ బాధపడ్డారు...

సతీష్... సుశీల ఆఖరి కోరిక గురించి అందరికీ చెప్పాడు...


లత సతీష్ ను పెళ్ళి చేసుకుంది.


కళ్యాణి కూతుర్ని... సతీష్ తన సొంత కూతురు లాగ చూసుకున్నాడు.


=====================================================================

ఇంకా వుంది..


=====================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ

58 views0 comments

コメント


bottom of page