top of page

ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 5


'Prema Entha Madhuram Episode 5' - New Telugu Web Series Written By

Mohana Krishna Tata

'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


సతీష్.. సుశీల సంసారం హ్యాపీ గా సాగుతుంది. సతీష్... అప్పుడప్పుడు దిగాలుగా ఉండడం గమనించిన సుశీల... కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది... ఒక డైరీ కనిపిస్తుంది. అందులో కొన్నిపేర్లు మాత్రమే రాసి ఉంటాయి. మర్నాడు కొన్ని ఫొటోలు దొరుకుతాయి. సుశీల తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళడానికి సతీష్ ను పెర్మిషన్ అడిగి వెళ్తుంది. కమల... సుశీలను తన ఫ్లాట్ కి తీసుకెళ్తుంది…


సుశీలకు రాణి అడ్రస్ దొరుకుతుంది.. మర్నాడు రాణి ను కలవడానికి వెళ్తుంది. రాణి స్టోరీ అడిగి తెలుసుకుంటుంది సుశీల... త్వరలో చేయబోయే పార్టీ గురించి చెప్పి... రాణి ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడనుంచి బయల్దేరుతుంది.


తన ఫ్రెండ్ కమల తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది సుశీల. తర్వాత రజని ఇంటికి వెళ్తుంది. ఆమె విషయాలు అడిగి తెలుసుకుంటుంది. తర్వాత లత ను కలుస్తుంది సుశీల. తన స్టోరీ చెప్పమని అడుగుతుంది సుశీల.


ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 5 చదవండి.



నేను ఫ్రెషర్ గా జాయిన్ అయ్యేసరికి సతీష్ మా సీనియర్. ర్యాగింగ్ చేస్తూ, నాకు పరిచయమయ్యాడు. చాలా మంచివాడు. బాగా చదువుతాడు అని కాలేజీ అంతా టాక్.


నాకూ.. అలాగే అనిపించింది. నేను సతీష్ ను చాలా ఇష్టపడ్డాను. కానీ. ఎప్పుడు తనకి చెప్పలేదు. చాలా సార్లు, సతీష్ కు ఏదో చెబుదామనుకునేదానిని..... కానీ.... నేను పొట్టిగా ఉండడం చేత.... ఆ ఫీలింగ్ నన్ను ఆపేసింది...


సతీష్ మనసులో ఏముందో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను... అప్పుడు అర్థమైంది నేను తనకి సరిపోను అని....


సతీష్ అందరికి చాలా హెల్ప్ చేసేవాడు.... నోట్స్ ఇవ్వడము, అన్నింటిలో చాలా గ్రేట్.

తనకి, అచ్చం మీలాంటి అమ్మాయి కావాలని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది... ఎవరో ఆ అదృష్ట వంతురాలు అనుకొని నేను తన గురించి ఇంక ఆలోచించలేదు...


తర్వాత నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చి, నేను వేరే ఊరు వెళ్ళిపోయాను... మళ్ళీ ఇప్పుడే, వింటున్నాను సతీష్ గురించి....


"లతగారు... మీకు సతీష్ అంటే చాలా ఇష్టం అని నాకు అర్ధమైంది. మీరు కూడా చాలా బాగుంటారు. అప్పట్లో మీరంటే కాలేజీ లో చాలా మంది లవ్ లెటర్స్ రాసారని విన్నాను. నిజమేనా?"


"అవునండి! నిజమే... ఒకసారి ఒక అబ్బాయి నాకు తాను రాసిన లవ్ లెటర్ తీసుకుని ఇచ్చాడు. నాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. వెంటనే సతీష్ దగ్గరకు వెళ్లి.. ఈ విషయం చెప్పాను... లవ్ లెటర్ చూపించాను... నాకు ఆ అబ్బాయంటే ఇష్టం లేదని కూడా చెప్పాను...


నేను చూసుకుంటానని... సతీష్ చెప్పాడు.

అలాగే... ఫ్రెషర్స్ పార్టీ రోజు నాడు సతీష్ ను అప్పుడు కూడా ప్రపోజ్ చేద్దామనే అనుకున్నాను... కానీ చెయ్యలేకపోయాను”.


“మిమల్ని కలవడం... మీతో మాట్లాడడం చాలా బాగుంది... మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదా?”


"లేదు సుశీల గారు.. నాకు ఇంతవరకు ఎవరూ నచ్చలేదు... "


"ఇప్పుడు సతీష్ నిన్ను చేసుకుంటానంటే... నీకు ఓకే నా?"


"అంత అదృష్టమా.. చెప్పండి?"


"ఐన సతీష్ కు ఆల్రెడీ పెళ్ళైపోయుంటుంది కదండీ.. ?"


"నన్ను ఏమి అడగొద్దు... మీరు పార్టీ కు వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి... "


నేను ఇంక స్టార్ట్ అవుతానండి.... మీరు తప్పక రావాలి పార్టీ కి... మెసేజ్ చేస్తాను డీటెయిల్స్.. ”


"ఐ విల్ బి వెయిటింగ్" అని బై చెప్పింది లత


సుశీల బయటకు వచ్చేసింది... ఆటో లో లత మాటలు గుర్తు చేసుకుంటుంది.... తాను సతీష్ డైరీ చదివినప్పుడు కూడా... 'నా అందమైన లత' అని రాయడం చూసాను... అంటే సతీష్ కు లతంటే ఎక్కడో ఇష్టం ఉన్నదని అర్ధమవుతుంది.


సుశీల తర్వాత కలవాల్సింది లక్ష్మి.... లక్ష్మి తుని లో ఉంటుందని తెలుసుకుంది.... సుశీల తుని బస్సు ఎక్కింది...


లక్ష్మి ఇంటికి చేరుకున్నాక, అది ఒక పాట ఇల్లు లాగా ఉందనుకుంది సుశీల... తలుపు కొట్టిన తర్వాత...

"లక్ష్మి ఉన్నారండి?"


"పిలుస్తాను” అని అన్నారు…


"ఎవరండీ మీరు?” అంటూ వచ్చింది లక్షి.


"నేను సతీష్ ఫ్రెండ్"


"పీజీ లో సతీష్... ?”


"అవును లక్ష్మి గారు"


"ఎలా ఉన్నాడు సతీష్?"


"ఇందాకల వచ్చింది ఎవరో?" అని అడిగింది సుశీల.

"మా శ్రీవారు"


"మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందామాసుశీల గారు.. ”


ఇద్దరు... కాలనీ లో ఉన్న ఒక కాఫీ షాప్ కు వెళ్లారు…


"ఇప్పుడు చెప్పండి లక్ష్మి గారు... "


"అప్పట్లో సతీష్ చాలా కస్టపడి చదివేవాడు.... ఎప్ప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు.... కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో చాలా హెల్ప్ చేసేవాడు.... ఒకసారి ఫ్రెషర్స్ పార్టీ లో....


నేను చాలా దురదృష్టవంతురాలని.... సతీష్ లాంటి మనిషి కి ప్రపోజ్ చేయలేకపోయాను…” అని బాధ పడుతుంది లక్ష్మి...


“ఊరుకోండి లక్ష్మి... మీకు పెళ్ళైంది ఇప్పుడు... హ్యాపీ గా ఉండండి... తప్పకుండా పార్టీ కు రావాలి” అంటూ బై చెప్పి వెళ్లిపోయింది సుశీల..


ఇంక నా లిస్ట్ లో ఉన్న పేరు కళ్యాణి.... తనని కలవాలంటే సాఫ్ట్వేర్ కంపెనీ కు వెళ్ళాలి...

సాఫ్ట్వేర్ కంపెనీ లో డీటెయిల్స్ కోసం చాలా కష్టపడింది... సుశీల.


ఒక విషయం మర్చిపోయాను.. అయన కూడా ఇక్కడే పని చేసారు కదా!... ఛా.. గుర్తు రాలేదు.. కళ్యాణి డీటెయిల్స్ ఈజీ గా దొరికాయి. సుశీల చాలా హ్యాపీ...


ఇప్పటికే చాలా లేట్ అయ్యింది... కళ్యాణి ఇంటికి రేపు వెళ్తాను....


ఇప్పుడు కాస్త బీచ్ కు వెళ్ళి... కొంచం మనసు తేలిక చేసుకోవాలి...


ఒక్కదానినే వెళ్తే మజా ఏముంది?.... తన ఫ్రెండ్ స్నేహ అక్కడే ఉన్నట్టు గుర్తొచ్చింది...


ఒక ఫోన్ కొడతాను... స్నేహ ఏం చేస్తుందో?... ఫోన్ చేసింది...


ఫోన్ చెయ్యగానే.... సుశీల కోసమే ఎదురుచూస్తున్నటుగానే, బయల్దేరి వచ్చేసింది... స్నేహ.

"హాయ్ సుశీల! ఎలా ఉన్నవే?"


"ఇలా ఉన్నానే స్నేహ"


"నీ పెళ్ళి తర్వాత ఇప్పుడే కలవడం కదే!"


"మా ఇంటికి రావాలే నువ్వు... వచ్చి ఇంతసేపటికి... నేను గుర్తొచ్చానా తల్లి!" అంది స్నేహ.


"వదిలెయ్యవే! నన్ను"


"ముందు బీచ్ లో వాతావరణాన్ని ఎంజాయ్ చెయ్యవే... కొంచం నీ వాగుడు ఆపి.. "


"పదా! మురీ తిందాం.... కారంగా బజ్జి తిందాం... "


"ఏమిటే స్నేహ! ఏం చేస్తున్నావు? ఇంట్లో పెళ్ళి చేస్తానంటున్నారా? లేకపోతే.. నువ్వు లవ్ లో ఉన్నావా?"


"పెళ్ళైన తర్వాత రొమాంటిక్ కామెడీ ఎక్కువే చేస్తున్నావే సుశీల"?


"ఇప్పుడు చెప్పవే!... నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది?" అడిగింది స్నేహ.


"బానే ఉందే!... మా వారికీ నేనంటే ప్రాణం తెలుసా?"


రాత్రి వరకు బీచ్ లో ఎంజాయ్ చేసిన తర్వాత... ఇద్దరు స్నేహ ఇంటికి చేరుకున్నారు....


"నువ్వు చాలా అదృష్టవంతురాలివే!.... మంచి రొమాంటిక్ భర్త దొరికాడు... "


"నువ్వూ పెళ్ళి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చెయ్యవే!" అంది సుశీల.


"టైం రావాలె!"


"రేపు ఉదయం నేను బయదేరతానే.... ”


అలాగే నైట్ పార్టీ కు వెల్దామా?"


"నువ్వు వెళ్ళు... నేను పడుకోవాలి... మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి స్నేహ"


"సరే"


రాత్రంతా... సుశీల చాలా ఆలోచించింది... గెట్ టుగెదర్ ఎలా ప్లాన్ చెయ్యాలని... ఒక ఐడియా వచ్చింది.... వెంటనే ఫోన్ లో ఏదో సెర్చ్ చేసింది...


మర్నాడు మార్నింగ్.... కళ్యాణి దగ్గరకు... స్టార్ట్ అయింది... సుశీల.


ఇంటికి చేరుకున్నాకా.... కళ్యాణి గురించి అడిగింది....


వాళ్ళ అమ్మగారు... తన కూతురు... అల్లుడు జపాన్ వెళ్లారని చెప్పింది....


కళ్యాణి పెళ్ళయి చాలా సంవత్సరాలవుతుంది.... అల్లుడు జపాన్ లో ఒక కంపెనీ లో చేస్తాడు అని చెప్పింది...


ఈ మధ్యే అమ్మాయి, మనవరాలు వెళ్లారు జపాన్....


"ఆంటీ! కళ్యాణి ఫోన్ నెంబర్ ఇస్తారా? నేను తన ఫ్రెండ్"


"ఇస్తాను లే అమ్మ! నువ్వు చూస్తే చాలా లక్షణంగా ఉన్నావు!... నిన్ను ఎలా అనుమానిస్తాను చెప్పు?" అంటూ సుశీలను తెగ పొగిడేసి.... కళ్యాణి నెంబర్ ఇచ్చింది.. ఆంటీ.


సుశీల కళ్యాణి వాళ్ళింటి నుంచి వస్తున్నప్పుడు...


"అయ్యో! డైరీ లో మా అయన ఒక పేరు బోల్డ్ లో రాసారు... ఆ అమ్మాయిని కలవడం మర్చిపోయాను... ఆమె పేరు.... శైలజ"


శైలజ అడ్రస్ కూడా... అయన అందులో రాసారు... తన హ్యాండ్ బుక్ తీసి చూసింది...


అయితే... నేను ఇప్పుడు బెంగుళూరు వెళ్ళాలి... నేనేమో... వొంటరిగా విమానంలో ప్రయాణం చెయ్యలేను..... ట్రైన్ జర్నీ అయితే లాంగ్ జర్నీ... అనుకుంటూ రైల్వే స్టేషన్ కు వెళ్లి బెంగుళూరు ట్రైన్ కు రిజర్వేషన్ చేసుకుంది..


అనుకున్న ప్రకారం బెంగుళూరు ట్రైన్ ఎక్కింది సుశీల. అసలే అది డే జర్నీ... దానికే అందులోనే టికెట్స్ దొరికాయి మరి... ఎలా టైం పాస్ చెయ్యాలా! అని ఆలోచిస్తుంది..

'శ్రీవారు కు కాల్ చేద్దాం' అనుకుంది.


"హలో! "


"ఏమండి! ఎలా ఉన్నారు?"


"సూసీ! ఈ టైం లో ఫోన్ చేసావు ?"


"ట్రైన్ లో ఉన్నాను... మీతో కొంతసేపు మాట్లాడదామని ఫోన్ చేశాను"


"ఏమిటో చెప్పు"


"పనిమనిషి వస్తోందా?"


"వస్తోంది"


"బట్టలు ఎవరు ఉతుకుతున్నారండి ?"


"నేనే ఉతుకుతున్నాను.. "


"వాషింగ్ మెషిన్ ఏమైంది?"


"పాడయింది. ఒక్కడినే కదా... ఉతికేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఉతకకు సూసీ! ఆఫీస్ లో ఇంపార్టెంట్ పని లో ఉన్నాను"


"అలాగే శ్రీవారు"


ఫోన్ పెట్టేసిన తరవాత... అలాగా నిద్ర పట్టేసింది సుశీల కు


=====================================================================

ఇంకా వుంది..

=====================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ

44 views0 comments
bottom of page