top of page

ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 6


'Prema Entha Madhuram Episode 6' - New Telugu Web Series Written By

Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 11/10/2023

'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


సతీష్-సుశీల ల సంసారం హ్యాపీ గా సాగుతూ ఉంటుంది. సతీష్.. అప్పుడప్పుడు దిగాలుగా ఉండడం గమనించిన సుశీల.. కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది..


ఒక డైరీ కనిపిస్తుంది. అందులో కొన్నిపేర్లు మాత్రమే రాసి ఉంటాయి. మర్నాడు కొన్ని ఫొటోలు దొరుకుతాయి. సుశీల తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళడానికి సతీష్ ను పెర్మిషన్ అడిగి వెళ్తుంది. కమల.. సుశీలను తన ఫ్లాట్ కి తీసుకెళ్తుంది..


సతీష్ స్నేహితురాళ్ళు రాణి, రజని, లత, లక్ష్మి, కళ్యాణి లను కలుస్తుంది. తర్వాత.. శైలజ కోసం బెంగళూరు బయల్దేరుతుంది సుశీల.

ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 6 చదవండి.


బెంగుళూరు చేరుకున్న తర్వాత.. శైలజ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది సుశీల.. చాలా వెతికిన తర్వాత.. అడ్రస్ దొరికింది..

అక్కడకు వెళ్ళి తలుపు కొట్టింది.. ఎవరో పెద్దావిడ తలుపు తీసింది

"ఎవరు కావాలి?" అని అడిగింది

"శైలజ కోసం వచ్చానండి"..

"మీరు ఎవరు? మీరు శైలజ తో టచ్ లో లేరనుకుంటాను"

"ఏమైంది?"

"శైలజ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది"

"ఎప్పుడు ఆంటీ? మీరు శైలజ కు ఏమవుతారు?"

"నేను శైలజ అమ్మ"

"కాలేజీ లో చదువుతున్నప్పుడే ఆత్మహత్య చేసుకుంది.. "

"ఎందుకు ఆంటీ?"

అప్పట్లో.. సరదాగా.. ఆడుతూ పడుతూ కాలేజీ కు వెళ్ళేది.. చదువులో వొత్తిడి తట్టుకో లేక ఆత్మహత్య చేసుకుంది.


"ఐ యాం సారీ" అని సుశీల చెప్పి.. అక్కడనుంచి వెళ్లిపోయింది.

అందుకే కాబోలు.. మా అయన శైలజ డీటెయిల్స్ హైలైట్ చేసినట్టునారు.


ఇంక కళ్యాణి కి కాల్ చెయ్యడం.. ఒక్కటే పెండింగ్ ఉంది. ఊరు వెళ్ళాకా.. కాల్ చేస్తాను కల్యాణికి.. అంటూ సతీష్ కు కాల్ చేసింది సుశీల..


"ఏమండి.. ఎలా ఉన్నారు?.. "

"సుశీల! వస్తున్నావా?"

"బయల్దేరుతున్నానండి.. "

"రేపు మార్నింగ్ మీ దగ్గర ఉంటాను.. "

ఫోన్ లోనే.. భర్త ముఖం లో ఆనందాన్ని చూసింది సుశీల.. శ్రీవారిని కలవబోతున్న ఆనందంలో.. తన పెళ్ళైన తొలి రోజులు.. గుర్తుకు వచ్చాయి సుశీల కు..


*********

"ఏమండి!.. మన పేరెంట్స్ అందరు కలసి.. మన కోసం హనీమూన్ టికెట్స్ తీసారు తెలుసా?"

"అవును సూసీ! విన్నాను"

"ఏమిటి చేద్దాం చెప్పు"

"వెళ్దాము!"

"మన టైం అంతా.. జర్నీ కే అయిపోతుంది మరి.. "

"పర్వాలేదు.. ఎంజాయ్ చేద్దాం"

"నాకు మీతో చాలా షికార్లు చెయ్యాలని ఉంది.. "

"చిన్నప్పటినుంచి.. మా ఇంట్లో నన్ను ఎక్కడకు తిప్పలేదు"

"ఎందుకు?"

"మా నాన్న కు ఎప్పుడు వ్యాపారం బిజీ.. ఎక్కడకు తిప్పేవారు కాదు. అమ్మని కూడా పెద్దగా ఎక్కడకు తిప్పలేదు. "

"మా ఊరిలో, వచ్చే సినిమాలకు అప్పుడప్పుడు డబ్బులిచ్చి.. నన్ను.. అమ్మను పంపించేవారు"

"మన దేశంలో ఉన్న అందాలూ.. ఎప్పుడు టీవీ లో చూడడం.. పుస్తకాలలో చదవడం తప్పితే.. ఎక్కువగా వెళ్ళలేదు. ముఖ్యంగా.. నాకు నార్త్ ఇండియా టూర్ తీసుకుని వెళ్ళండి"

"ఒకందుకు అది మంచిదే.. చలి గా ఉంటుంది అక్కడ.. ఈ హనీమూన్ కు.. అదే సరైన ప్లేస్ అండ్ టైం కూడా"

"అయితే ఒప్పుకుంటున్నారా?"

"నీకోసం ఏమైనా చేస్తాను సుశీల.. "

"అయితే బ్యాగ్ సర్దేస్తానండి.. "

"అలాగే"

"ఒక షరతు.. మరి.. నేను ఎలా చెబితే.. అలా చెయ్యాలి ఈ టూర్ లో.. అప్పుడే మనం బాగా ఎంజాయ్ చేస్తాము"

"అలాగే శ్రీవారు"

"ఇంకేమి కోరికలున్నాయో చెప్పేసెయ్"

"చాలా ఉన్నాయి.. ఒక్కకటి చెబుతాను.. "

"ఫస్ట్ విమానం ఎక్కాలి.. "

"ఓకే.. రేపు ఢిల్లీ కి విమానం టికెట్స్ బుక్ చేస్తాను"

"ఒక పెద్ద హోటల్ లో ఉండాలి"

"డన్.. తాజ్ లాంటి పెద్ద హోటల్ బుక్ చేస్తాను"

"మిగిలినవి అక్కడ హోటల్ రూమ్ లో చేబుతాను.. "

"అలాగే శ్రీమతి గారు"


సతీష్.. సుశీల విమానాశ్రయం చేరుకున్నారు.

"ఏమండి! నాకు విమానం ఎక్కాలంటే భయంగా ఉండండి!"

"మరి ఎక్కలన్నావు? మరేమీ పర్వాలేదు.. నన్ను గట్టిగా పట్టుకో.. సరిపోతుంది.. "

"సుశీల.. సతీష్ ఆకాశం లోకి దూసుకుని వెళ్లారు"


ఢిల్లీలో దిగారు. దిగంగానే.. సుశీల అడిగినట్టే.. తాజ్ హోటల్ లో రూమ్ బుక్ చేసాడు సతీష్.. సుశీల ఆనందానికి అవధులు లేవు. తర్వాత మంచి కాఫీ ఒకటి ఆర్డర్ చేసింది సుశీల.

"తాజ్ లో కాఫీ ఎలా ఉంది సుశీల?"

"చాలా బాగుందండి.. పద అలా షికారు చేసివద్దాం"

"ఏమండి!.. ఇంపార్టెంట్ విషయం మర్చిపోయారు.. షాపింగ్.. పదండి.. "

"అలాగే పదా!"

రోజంతా.. షాపింగ్ చేసింది సుశీల..

"ఇవన్నీ ఇంటికి ఎలా మోసుకేల్తాం చెప్పు?"..

"పర్వాలేదు లెండి! విమానంలోనే కదా"

ఆ రోజు బాగా తిరగడం చేత.. రూమ్ కు వచ్చిన తర్వాత.. సతీష్ కు హై ఫీవర్ వచ్చింది..

"ఏమండి! వొళ్ళు కాలిపోతోంది.. డాక్టర్ కు ఫోన్ చేస్తాను"

"హలో రిసెప్షన్.. మా వారికి జ్వరంగా ఉంది.. వెంటనే డాక్టర్ ను పంపించండి"

"ఈ రోజు డాక్టర్స్ లేరు.. కావాలంటే టాబ్లెట్స్ ఉన్నాయి.. పంపిస్తాను.. "

"అలాగే.. పంపించండి"

సతీష్ కు ఒంటి మీద తెలివి లేదు. సుశీల కంగారు పడుతుంది. ఎప్పుడో పాత సినిమా లో చూసింది.. తల పై తడి గుడ్డ వెయ్యడం.. వెంటనే అలా చేసింది.. ఈలోపు రిసెప్షన్ వారు పంపించిన టాబ్లెట్స్ కూడా వేసింది. సతీష్ ను రాత్రంతా.. కనిపెడుతూ ఉంది సుశీల.


మర్నాడు ఫీవర్ కొంచం తగ్గింది.. కానీ అప్పుడప్పుడు.. వాంతులు అవడం.. సుశీల నిజంగానే.. కార్యేషు దాసి అనిపించుకుంది..

డాక్టర్ వచ్చి చూస్తున్నారు..

"మీరు చాలా మంచి పని చేసారు.. రాత్రంతా మీరు సేవ చెయ్యడం చేత.. ఫీవర్ కంట్రోల్ అయ్యింది.. మీరు వేసిన టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తూ.. ఈ టాబ్లెట్ కూడా వెయ్యండి.. " అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయారు


మూడు రోజులకు సతీష్ పూర్తిగా కోలుకున్నాడు..

తర్వాత వాళ్ళ టూర్ కంటిన్యూ చేసారు.. ఎంజాయ్ చేసారు ఇద్దరూ..

*********


మర్నాడు మార్నింగ్.. హైదరాబాద్ చేరుకుంది సుశీల. బస్టేషన్ కు కారు లో వచ్చాడు సతీష్.

"చాలా రోజులైంది సుశీల నిన్ను చూసి'' అని వాటేసుకున్నాడు సతీష్

"ఇంటికి పదండి ముందు.. వదిలితే ఇక్కడే సంసారం చేసేటట్టు ఉన్నారే?" చిలిపిగా అంది సుశీల

"చిలిపి సుశీల.. అని బుగ్గను గిల్లాడు సతీష్"

ఇద్దరు ఇంటికి చేరుకున్నారు..

"మీకోసం మంచి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను ఉండండి.. పాపం ఇన్నాళ్లు హోటల్ ఫుడ్ తిని.. ఎలా తయారయ్యారో చూడండి.. "

"వంట ఏం చెయ్యమంటారు?"

"టమాటో పప్పు, వంకాయ కూర, ఉల్లి సాంబార్ చెయ్యి సుశీల"

"అలాగే.. బుద్ధిగా కూర్చోండి.. చేసి వడ్డిస్తాను.. "


=====================================================================

ఇంకా వుంది..

=====================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ



61 views0 comments
bottom of page