top of page

ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 2'Prema Entha Madhuram Episode 2' - New Telugu Web Series Written By Mohana Krishna Tata

'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


సతీష్.. సుశీల ఆన్లైన్ మాట్రిమోనీ ద్వారా ఒకరికి ఒకరు దగ్గరవుతారు.. చాటింగ్, ఫోన్స్ చేసుకోవడం చేత ఇరువురు.. బాగా అర్ధం చేసుకుంటారు. ఇంట్లో పెళ్ళి చూపులు అరెంజ్ చేస్తారు. పెళ్ళిచూపులలో ఇద్దరు.. ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు.. మొత్తానికి పెళ్ళి జరుగుతుంది. సంసారం హ్యాపీ గా సాగుతుంది. సతీష్.. అప్పుడప్పుడు దిగాలుగా ఉండడం గమనించిన సుశీల.. కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది..ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 2 చదవండి.సుశీల, భర్త ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత, ఎందుకో రూమ్ లోకి వెళ్ళి భర్త వర్కింగ్ టేబుల్ ఓపెన్ చేసింది.. ఒక డైరీ కనిపించింది. చూస్తే, పాత డైరీ లాగా ఉంది. ఓపెన్ చెయ్యాలా?.. వద్దా అని చాలా సేపు ఆలోచించింది..

ఓపెన్ చేస్తే.. మా ఆయనను నేను అనుమానించినట్టు ఉంటుందేమో? మళ్ళీ పర్వాలేదనుకుంది.. మా ఆయనకు నేను హెల్ప్ అవుతానేమో అనుకుంది సుశీల..


ఈలోపు కాలింగ్ బెల్ మోగింది..

ఎవరో? అనుకుంటూ తలుపు తీసింది.

"నువ్వా కాంతం!"

"ఇల్లు తుడిచి, తడిగుడ్డ పెట్టు.. నేను లోపల వంట చేసుకోవాలి"


"అమ్మగారు! ఒక విషయం ఆడాలి.. "


"ఏమిటో చెప్పు"


"నాకు రేపు పెళ్ళిచూపులు. కొంచం డబ్బులు కావాలి.. "


"పెళ్ళి కొడుకు ఎవరో"?


"మా బావ అమ్మగారు"


"అంటే నీకు ఇష్టమే అనమాట"


"నా బావకు కూడా నేనంటే చాలా ప్రేమ. మీది.. ఏమైనా పాత చీర ఉంటే ఇవ్వండి. మా బావ కు నేను బాగా.. అందంగా కనిపించాలి అనుకుంటున్నాను"


అది విన్న సుశీల, మనసులోనే నవ్వుకుంది.. తన పెళ్ళిచూపులు గుర్తొచ్చాయి..


"ఆగు.. ఇస్తాను.. అని ఒక మంచి చీర తెచ్చి ఇచ్చింది.. ఈ డబ్బులు కూడా ఉంచు..” అని చేతిలో పెట్టింది సుశీల.


అసలు విషయం మర్చిపోయాను.. ఆ డైరీ సంగతి.. వెళ్ళి చూడాలి..


డైరీ మెల్లగా ఓపెన్ చేసింది.. మొదటి పేజీలో.. 'ఓం' రాసుంది.. మా అయనకు చాలా భక్తి కదా మరి! అనుకుంది. తర్వాత పేజీలో.. కొన్ని పేర్లు.. ఉన్నాయి.. సుశీల కొంచం దగ్గరగా చూసింది..


డీటెయిల్స్ కోసం చాలా చూసింది.. కానీ ఎక్కడా దొరకలేదు..

ఈ లోపు కాలింగ్ బెల్ మోగింది.. గబగబా వెళ్ళి తలుపు తీసింది. చూస్తే.. పాలవాడు.


"నేను ఊరు వెళ్తున్నాను అమ్మగారు! రెండు రోజులు పాలు పొయ్యను. బయట నుంచి తెచ్చుకోండి’ అన్నాడు.


"ఒకటో తారీకు కాదమ్మా! డబ్బులు ఇస్తారేమోనని.. "


"ఎంతయిందో చెప్పు.. "


"లెక్క చూసి మీరే ఇచ్చేయండి అమ్మగారు.. "


పాలవాడికి డబ్బులు సెటిల్ చేసి, కిచెన్ లోకి వెళ్ళిపోయింది సుశీల..


ఇంటిపనుల్లో పడి ఆ డైరీ విషయం మళ్ళీ మర్చిపోయింది సుశీల. చూస్తూనే సాయంత్రం అయిపొయింది. అయ్యో! మావారు వచ్చే టైం ఆయుయిపోయిందే! రేపు మర్చిపోకుండా ఇల్లంతా వెతకాలి.


సాయంత్రం అయ్యింది.. సతీష్ ఇంటికి వచ్చాడు.

"ఏమండీ.. కాఫీ తెమ్మంటారా?"


"అలాగే సుశీ!"


సుశీల వంటింట్లో కి వెళ్ళి, పాల ప్యాకెట్ కట్ చేసి, పాలు వేడిచేసింది. సతీష్ కు ఎంతో ఇష్టమైన ఫిల్టర్ కాఫీ సిద్ధం చేసింది.


"ఇదిగోండి.. " అంటూ వేడి వేడి గా కాఫీ అందించింది సుశీల..


"నువ్వూ తెచ్చుకో సుశీల" సరదాగా ఆలా బాల్కనీ లో కుర్చీని సిప్ చేద్దాం" అన్నాడు సతీష్.

దానికి సుశీల ఒక స్మైల్ ఇచ్చి.. "అలాగే నండి, మీకోసం మళ్ళీ తాగుతాను"


"ఏమాటకామాటే చెప్పుకోవాలి సుశీల.. ఈ మొత్తం ఇండియా లోనే, నీ అంత బాగా కాఫీ ఎవరు పెట్టలేరేమో" అన్నాడు సతీష్

"మీరు మరీ పొగిడేస్తున్నారు.. మీరు కాఫీ ప్రియులు కాబట్టి.. మీకు ఎప్పుడూ నా కాఫీ బాగున్నట్టు అనిపిస్తుంది లెండి.. "


"ఆఫీస్ లో వర్క్ ఎలా ఉందండి? ఎక్కువగా ఉందా? మీ లో హుషారు తగ్గుతుంది" అంది సుశీల

"అదేం లేదు! ఎదో చిన్న ప్రాబ్లెమ్ ఆఫీస్ లో.. ప్రాజెక్ట్ క్రిటికల్ స్టేజి లో ఉంది అందుకే. "


"ఇంక ఫ్రెషప్ అయ్యి రండి.. డిన్నర్ చేద్దాము..”

సతీష్ స్నానం చేసి, లుంగీ కట్టుకుని హాల్ లో టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టాడు..


"సుశీ.. ఈ చీర లో చాలా అందంగా ఉన్నావు తెలుసా? నేనంటే ఇష్టమేనా? చెప్పు సుశీ?"


"మళ్ళీ మొదలెట్టారు.. ?"


"ఏమండీ.. మీరంటే, మీరు అనుకున్నదానికంటే వంద రెట్లు ఎక్కువ ఇష్టం నాకు శ్రీవారు.. రండి.. వేడివేడి గా వడించేస్తాను.. మీకు నచ్చిన వంకాయ కూర చేసానండి.. ఒక పట్టు పట్టండి.. "


ఇద్దరు సరదాగా.. కబుర్లు చెప్పుకుంటూ.. భోజనం చేస్తున్నారు..

తర్వాత టీవీ చూస్తున్నప్పుడు.. సుశీలకు ఎందుకో ఒక విషయం అడగాలనిపించింది..

"ఏమండీ.. ! ఏమండీ.. ! "


"చెప్పు సుశీ!"


"మనకి అమ్మాయి పుడితే ఏ పేరు పెడదామండీ"


"ఏమో, ఆలోచించలేదు" అన్నాడు సతీష్


"రాణి లేక రజని" ఎలా వుంటుందండి.. లేకపోతే లత..”


ఆ పేర్లు వినగానే, సతీష్ ముఖంలో కొంచం హుషారు తగ్గింది. గమనించిన సుశీల, ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలని అనుకుంది..


మర్నాడు, భర్త ఆఫీస్ కు వెళ్లిన తర్వాత..

వంటింట్లో వంట ముగించుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది సుశీల..


మొత్తం ఇంట్లో ఉన్న అన్ని చోట్ల వెతకడం స్టార్ట్ చేసింది.. బీరువా.. అటక.. అన్నీ..


ఎక్కడో.. సతీష్ చదివిన స్కూల్, కాలేజీ డీటెయిల్స్ దొరికాయి.. ఫొటోస్ తీసుకుని.. వెంటనే అక్కడే పెట్టేసింది..


మర్నాడు ఉదయం..


"ఏమండీ! మా ఫ్రెండ్ తన ఊరు రమ్మని, ఎప్పటినించో అడుగుతుంది. కొన్ని రోజులు వెళ్ళాలి అనుకుంటున్నా.. ఒక త్రీ డేస్ ఇంట్లో మేనేజ్ చేసుకోండి.. " అంది సుశీల.


"అలాగే వెళ్ళు సుశీల!.. నీకూ కొంచం రిలీఫ్ గా ఉంటుంది".. అన్నాడు సతీష్.

సుశీల మనసులో చాలా ఆనందపడింది. ఎక్కడ సతీష్ ఒప్పుకోరో నని మొదట భయపడింది.


మర్నాడు సుశీల తన ఫ్రెండ్ కు కాల్ చేసింది..


"ఏమిటే ఇలా కాల్ చేసావు! పొరపాటుగా నా నెంబర్ కు చేసేవేమో చుసుకోవే.. "


"చాలు నీ వెటకారం"


"సర్లే.. చెప్పు సుశీల"


"మీ ఊరు రావడానికి మా వారు పర్మిషన్ ఇచ్చారు.. "


"గ్రేట్! అయితే మీ దర్శనం ఎప్పుడో" అంది కమల.


"ఇప్పుడే బయల్దేరుతున్నాను. రాత్రికి నీ దగ్గర ఉంటాను” అంది సుశీల.


"రావే తొందరగా.. చాలా మాట్లాడాలి నీతో"


సుశీల, బస్సు టిక్కెట్టు తీసుకొని.. బయల్దేరింది.. రాజమండ్రి బస్సు కోసం చూస్తోంది.. రానే వచ్చింది లగ్జరీ బస్సు.. ఎక్కి విండో సీట్ దగ్గర కూర్చుంది.. బస్సు మెల్లగా స్టార్ట్ అయింది..


సుశీల.. కమల మంచి ఫ్రెండ్స్. సుశీల జాబ్ చేస్తున్నపుడు పరిచయం కమల. ఇద్దరూ ఒకే హాస్టల్ లో ఉండేవారు. ఒకే రూమ్మేట్స్ కూడా. ఒకరికి ఒకరు అన్ని విషయాలలో సహాయం చేసుకునేవాళ్లు.


చల్లటి గాలి కి.. సుశీల నిద్రలోకి జారుకుంది..

ఒక అందమైన కల. అందులో.. సుశీల తన భర్త తో డ్యూయెట్ పాడుతూ డాన్స్ చేస్తున్నట్టు.. అప్పుడు వాళ్ళ షష్టిపూర్తి జరుగుతుంది..


తెలివొచ్చేసరికి బస్సు రాజమండ్రి చేరుకుంది. బ్యాగ్ తీసుకుని, బయటకు వచ్చింది. కొంచం ఫ్రెష్ అయ్యి, మంచి కాఫీ తాగుతూ.. ఫ్రెండ్ కు కాల్ చేసింది..

"కమల! బస్సు దిగానే.. వస్తున్నావా? లేకపోతే క్యాబ్ లో వచ్చెయ్యనా?"


"వస్తున్నాను.. అక్కడే ఉండు".. అంది కమల.


ఈలోపు, షాప్ వాడితో ఏవో డీటెయిల్స్ అడిగి తెల్సుకుంటున్నది సుశీల..

కమల రానే వచ్చింది.


"ఏమిటే కమల! కొత్త కార్?"


"అవునే! "


"కొత్త కార్ తీసుకున్నావు! పార్టీ ఏదీ?"

"నువ్వు వచ్చావు కదా!.. ఇంక అన్నీ పార్టీ లే.. ముందు కార్ ఎక్కువే"


ఇద్దరు కార్ లో కమల ఫ్లాట్ కు చేరుకున్నారు. అదొక అపార్ట్మెంట్.. చాలా రిచ్ గా ఉంది. లిఫ్ట్ లో మెల్లగా 3 ఫ్లోర్ కు చేరుకున్నారు. ఫ్లాట్ తాళం ఓపెన్ చేసింది కమల.


"కమల! ఇది ఓన్ ఫ్లాట్?" అడిగింది సుశీల


"అవునే సుశీల! "


"ఒక్కర్తివే ఎలా ఉంటావే?"


"అలవాటైపోయింది.. ఏం చేయమంటావు?"


"ఫ్లాట్ తీసుకున్నావు.. కార్ తీసుకున్నావు.. చెప్పలేదేమి.. ?"


"పెళ్ళి కూడా చెప్పకుండా చేసుకున్నావా! ఏమిటి?"


"లేదే ఇంకా" అంది కమల


"ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సిందే కమల!"


"అలాగే తల్లి.. లోపలికి పదా!.. పిజ్జా ఆర్డర్ చెయ్యనా?" కమల ఫోన్ తీసి పిజ్జా ఆర్డర్ చేసింది.


"ఈలోపు ఫ్రెష్ అవ్వు.. పిజ్జా 30 మినిట్స్ లో వచ్చేస్తుంది.. "


"ఏమిటే ఈ సడన్ దండయాత్ర నా మీదకు"


"ఏమి లేదే" అంది సుశీల.

"ఏదో ఉందే! లేకపోతే, ప్రేమించే భర్త వదిలి.. ఒక్క రోజు కూడా ఉండలేని నువ్వు.. ఇలా రావడమా?

=====================================================================

ఇంకా వుంది..

=====================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ97 views0 comments

Comentários


bottom of page