top of page

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 10


'Premante Idena Part 10' - New Telugu Web Series Written By Penumaka Vasantha

'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 10' తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

జరిగిన కథ:


తన ఫ్రెండ్ పద్మ పెళ్ళిలో ఆనంద్ ని చూస్తుంది విరిజ. వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది. ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. విరిజకి సహాయం చేస్తుంటాడు.


తన మనసులో ఒక అమ్మాయి ఉన్నట్లు చెబుతాడు ఆనంద్. ఆనంద్ ప్రేమించేది తననే అని రాజీ ద్వారా తెలుసుకుంటుంది విరిజ. తన ఆర్ధిక పరిస్థితి ఆనంద్ కి వివరిస్తుంది విరిజ. తనకు అన్ని విధాలా సహకరిస్తానని చెబుతాడు ఆనంద్. జ్వరంతో ఉన్న ఆనంద్ ని హాస్పిటల్ కి తీసుకోని వెళ్తుంది విరిజ.


ఆనంద్ తన పేరెంట్స్ తో విరిజ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆనంద్, విరిజల వివాహం, హనీమూన్ ఆనందంగా జరుగుతాయి.


విరిజ వాళ్ళ అక్క ఆత్మహత్య చేసుకుంటుంది.

ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 10 (చివరి భాగం) చదవండి


నా పెళ్లి, కొత్త కాపురం, హడావిడిలో అక్కను పట్టించుకోలేదని దిగులు పడ్డాను. నాకు లీవ్ లేక అమ్మ, నాన్న, బామ్మని తీసుకుని, హైదరాబాద్ వచ్చాను. నాన్న వాళ్ళు ఒక పది రోజులుండి వెళ్ళారు. ఈ పది రోజులు పాపను నా దగ్గరే పడుకోబెట్టుకుని కబుర్లు చెపితే, అది మధ్యలో లేచి మమ్మీ అని ఏడిస్తే, నాకు ప్రాణం పోయింది. ఎంతమంది స్త్రీ లు ఇలా చనిపోతున్నారు.. వాళ్ల పిల్లలు అనాధలు గా మారుతున్నారు.. దీనికోసం నేను ఏదైనా చేద్దామనుకుని ఒక నిర్ణయానికి వచ్చా!

అమ్మానాన్నే, అక్క పిల్ల దివిజ ను పెంచుతున్నారు. దానికి ఐదవ సంవత్సరం రాగానే, నేను హైదరాబాద్ తీసుకొచ్చి, స్కూల్ లో జేర్చి, నా దగ్గర పెట్టుకుందా మనుకుంటున్నాను. దానికి ఆనంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతలో నేను కడుపుతో ఉన్నాను.


ఆనంద్, నన్ను కంటికి రెప్పలా చూసు కుంటున్నాడు. ఏడవ నెలలో నేను, అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను. దివిజను, నాల్గవ ఏడు రావటం తో, అక్కడ కాన్వెంట్ లో వేశారు. నేను దానిలో, అక్కను చూసుకుంటున్నాను.

రాజి కూడా, అదే టైం లో కడుపుతో ఉండటం వల్ల, డెలివరీ కి ఊరుకు వచ్చింది. ఇద్దరం ఒకేసారి డెలివరీకి రావటం చూసి నవ్వుకున్నాము. రాజీకి, నాకన్నా ముందే డెలివరయ్యి, పాపను కన్నది.


ఆనంద్, హైదరాబాద్ లోనే డెలివరీ పెట్టుకో అంటే, నేను మా ఊరు వెళతాను, ఇపుడు రాజీ కూడా అక్కడే ఉందని, వచ్చాను. పాపం, వారానికి ఒకసారి ఆనంద్ వచ్చి వెళ్తున్నాడు.


డెలివరీ డేట్ కు రెండురోజుల ముందు లీవ్ పెట్టీ ఆనంద్ వచ్చాడు. మా ఊరి పక్కనున్న టౌన్ లో డెలివరీ జరిగి, అబ్బాయి పుట్టాడు.

ఆనంద్, చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. బాబును, తీసుకుని, మూడవనెల్లో, హైదరాబాద్, వెళ్ళాను. దివిజ ను, కూడా తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేశాను. అమ్మ, కొన్నాళ్ళు, ఉండి వెళ్ళింది. ఆనంద్, అమ్మగారు, వచ్చారు. నేను అఫీస్ కెళితే, బాబుని చూసుకునేవారు.


బాబుకు వన్ ఇయర్ వచ్చింది. డే కేర్ లో వేసాను. ఈలోగా, నాన్న, పొలానికి, మంచి బేరం వచ్చింది, అమ్ముతానమ్మా, అన్నారు.

అలాగే, మీ ఇష్టం నాన్న అన్నాను. తర్వాత, నాన్నతో, ఆ డబ్బు అక్కపేరు, మీద అనాధ, శరణాలయం, కడదామని చెపితే, నీ, ఇష్టం తల్లీ అన్నాడు.


ఆనంద్, తో చెపితే, అలాగే చేద్దాము, ఒక మంచి పనికోసం, ఆ డబ్బును ఉపయోగిస్తే, మంచిదన్నాడు.


మా ఊరి చివర, టౌన్ దగ్గరలో, అనాధ శరణాలయం నాన్న కట్టించటం మొదలెట్టాడు. నేను, ఆనంద్ నెలకోసారి వెళ్ళి చూసి వస్తున్నాము. ‘వసుధ’ మహిళ అనాధ శరణాలయం కట్టించాం.


‘ఇందులో భర్తలు వదిలేసిన మహిళలకు, అనాధ పిల్లలకూ, ఆశ్రయం, కల్పించబడును’, అన్న బోర్డ్ రాయించి పెట్టాము. మంత్రి గారి చేత ఓపెనింగ్, చేయించాను.


మా ఊరు దగ్గరలో ఉన్న జిల్లాకు ట్రాన్స్ఫర్, చేయించుకున్నాను. ముందు, నే వచ్చి, వుంటున్నాను. ఆనంద్, ఆ జిల్లా బ్యాంక్ కు ట్రాన్స్ఫర్ కు ట్రై చేస్తున్నాడు. బాబు, అవిష్ కు, ఐదుఏళ్లు వచ్చాయి. దివిజ, ఫిఫ్త్, క్లాస్ కు వచ్చింది. ఆనంద్, నేను, ఇక, పిల్లలు, వద్దనుకున్నాము.


మా ఊరి కి నేను గంట దూరంలోనే ఉంటా కాబట్టి, వారానికి, ఒకసారి శరణాలయానికి, వచ్చి, చూసుకుంటూ, ఉన్నాను. ఆవరణలో, అక్క, విగ్రహం, పెట్టాను. కాసేపు అక్కడ కూర్చుని, అక్క తో మాట్లాడుతాను. అక్క, నీ పాపను, గొప్పగా, చదివిస్తాను. నువ్వు లేని లోటు, తీరుస్తాక్క' అని మొర పెట్టుకున్నా.


బామ్మ పోయాక, నాన్న, అమ్మ, కూడా, ఈ శరణాలయంలోనే వుంటున్నారు. అక్కడి, పనులు, చూసుకోవటానికి.


ఇక్కడి ఆడపిల్లలకు, స్వయంఉపాధితో, అన్ని విద్యలు, నేర్పుతున్నాము. నాన్న చాలా సంతోషంతో "పొలం అమ్మిన, డబ్బులతో, శరణాలయం కట్టడం వల్ల ఎందరో! ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు విరజిమ్ము తున్నాయి విరి తల్లి" అన్నారు.


"అవును, నాన్నా!, అక్కలాగా, ఏ స్త్రీ జీవితం, డబ్బుకోసం, బలికాకూడదు. ప్రతి, యువతి, తనకాళ్ళ మీద, తను నిలబడితే, ఆమెను, ఎవరూ!, ఏమి చేయలేరు. అక్కను, ఎన్నోసార్లు, డివోర్స్ ఇచ్చి, నీ కాళ్ల, మీద, నిలబడు, అంటే, విరి, ముందు, నీ, పెళ్లి, కానీ, తర్వాత చూద్దాము. నేను వచ్చి ఇంట్లో ఉంటే, మొదటి పిల్ల, మొగుడ్ని, వదిలేసిందనీ, నీకు, పెళ్లి కావటం, కష్టం. ఏమో!? ఈ లోపు, మా ఆయన లో మార్పు వస్తే, ఇంకా ఆనందమనేది. అలా ఆలోచించి, తన జీవితాన్ని, ఆ రాక్షసులకు అర్పించింది. దానికి ఆస్తి ఉంది కానీ, ఏమి లాభం, ప్రేమించే మనసులులేని కసాయి వాళ్లలో, ఇమడ లేక పోయింది. ఎట్టి పరిస్థితుల్లో మహిళ చనిపోకూడదు. మహిళకు, భరోసా ఇద్దాము. మన ప్రేమను పంచుదాం, ఈ చిన్ని కుసుమాలకు. మనము చేయూతనిద్దాము. వాళ్లకు, మనమే, తల్లితండ్రులమవుదాము. వీళ్లలో మన అక్కను చూసుకుందాం. "


"ఇక్కడున్న, రెండువందల మంది, ఆడపిల్లలు, మహిళలు, నా పిల్లలే. వాళ్ళు, టీనేజ్ లో సరైన నిర్ణయాలు, తీసుకోవటానికి, ఒక సైకాలజిస్ట్ ను కూడా, పెట్టమన్నావుగా.. రేపు వచ్చి ఒక లేడీ, జాయిన్ అవుతుందమ్మ అన్నాడు, నాన్న.


ఆడపిల్లలు, వాళ్ల భావాలు, పంచుకోవటానికి, ఒక లేడీ సైకాలజిస్ట్, అవసరమని, పెట్టాను, నాన్న. మనతో, పంచుకొలేనివి, ఈవిడతో పంచుకుంటారు. ఇంకా, నేను, ఆనంద్, ఫండ్స్ కోసం తిరుగుతున్నాం. దీన్ని ఇంకా పెద్దది చేయటానికి.


"అలాగే! విరి, ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, చూసుకుంటూ.. ఇవన్నీ! చేస్తున్నావు గాడ్ బ్లెస్ యు బంగారు" అన్నాడు, నాన్న.


ఇవే కాకుండా, భర్త నుండి, విడిపోయిన ఆడవాళ్లకు, ఉపాది చూపించటం, వాళ్ల భర్తలకు కూడా అవసరమైతే, కౌన్సెలింగ్, ఇచ్చి ఇద్దరి, జీవితాలు చక్కబరిచేందుకు, కృషి చేస్తుంది, ఈ వసుధ అనాధ శరణాలయం. అలా కొంతమంది, జీవితాల్ని, బాగుచేసింది కూడ.


ఇంత గొప్ప పనులు, చేస్తున్నందుకు, విరిజను, ప్రభుత్వం శాలువా కప్పి సత్కరించింది. కొన్ని ఫండ్స్ కూడా సంస్థకు ఎలాట్ చేసింది.

ఈ సన్మానానికి, నా ధన్యవాదములు.

సో! ప్రేమ అనేది మానవులకు మాత్రమే కాదు ఈ సృష్టి లోని సమస్త జీవ రాశుల్లో ఉన్నదన్నది ఎంతో నిజం. ప్రేమించటం లేదని, అమ్మాయిల మీద ఆసిడ్ లు పోయటం చేయకండి. నిజమైన ప్రేమ, ఎదుటి వారి సుఖాన్ని, కోరుతుంది. ఈ మధ్య పేపర్లో, చిన్నపిల్లల దగ్గరనుండి, వృద్ధులను కూడా వదలని కామాంధుల్ను చూస్తున్నాము. మరి ముఖ్యంగా చిన్నారి ఆడపిల్లలను చిదిమి వేయటం ఎంత ఘోరం. ఇలాంటి వాటికి పాల్పడిన వారిని ప్రభుత్వం, నడిరోడ్డు మీద, వురి తీయాలి. స్కూల్ లో కరాటే పాఠాలు, తప్పనిసరిగా ఉండేట్లు చేయాలి. తల్లిని, చెల్లిని, నిజాయితీగా ప్రేమించిన వారు, ఇతర స్త్రీలను, గౌరవిస్తారు. ముందు, మహిళలం మనమే, కంకణం, కట్టుకుని, సమాజంలోని ఈ దుర్మార్గపు, పురుషులను, ఏరి పారేద్దాము. ముందు, మీరు, మీ కాళ్ళ పై నిలబడండి. ప్రేమ లేకపోతే, జీవితం లేదని, చనిపోకండి. మీకు ఏ ఆపద వచ్చినా, మా సంస్థకు, కాల్ చేయండి. ఇవన్నీ! చేయటానికి, నాకు బాక్ బోన్ లా నిలిచినా! నా భర్త, ఆనంద్ కు సభాముఖంగా ధన్యవాదములు, తెలుపుకుంటున్నాను" అంది విరిజ.

తర్వాత, ఆనంద్ ను, విరిజ తండ్రి, రామరావు, గారిని, సత్కరించింది, ప్రభుత్వం.

తర్వాత ఆనంద్, మాట్లాడుతూ, ఎక్కడ స్త్రీ గౌరవించ బడుతుందో, అక్కడ, స్వర్గం, ఉంటుంది. స్త్రీ లేనిదే, మనం లేము. వాళ్లకున్న సహనం, మన మగ వాళ్లకు లేదు. వాళ్ళని, మన ఈగో లతో హర్ట్ చేయకండి. కొంచం, ప్రేమ చూపిస్తే చాలు, వాళ్ల గుండెల్లో పెట్టుకుని, మనల్ని ప్రేమిస్తారు. ఒక ఝాన్సీరాణీ, రుద్రమదేవి, ఇలాంటి వాళ్ళు దేశాన్ని కూడా ప్రేమించి, వాళ్ల ప్రాణాలు కోల్పోయారు. కట్నాలు, ఆస్తులంటు, ఆడవాళ్ళని వేదించకండి. వాళ్ళని కొంచం ప్రేమించండి చాలు!" చప్పట్ల మధ్య, ముగించాడు.


నిజమైన ప్రేమ, శాంతినీ కోరుకుంటుంది. పగ ద్వేషాన్ని కాదు, అది ఏ, ప్రేమైనా సరే! అందుకే, శాంతి కాముకుల్లారా, మీ దగ్గర్లో, ఎవరైనా! ప్రేమకై, ఆత్మహత్యకు పాల్పడితే, వాళ్లకు, చేయూత నివ్వండి. మేమున్నామనే, స్వచ్ఛమైన, తల్లి ప్రేమను పంచండి. అపుడు వాళ్లకు, నిజమైన ప్రేమంటే.. ఇదే! అనే భావన మనం కలుగ చేసిననాడు, ఒక ప్రేమైక భారతావనిని చూడవచ్చు.


========================================================================

సమాప్తం.


ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు రచయిత్రి పెనుమాక వసంత గారి తరఫున, మనతెలుగుకథలు.కామ్ తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.31 views2 comments

2 Comments


@madhavisrirangam7523 • 7 hours ago

Hats off Vasanta garu. Chala chakkani message echaru ee taram Ada Pillalliki. Mariyu ento bhavodvekam to chadivaru. Well done

Like

@tulasidevisanka7094 • 1 day ago

సూపర్ సూపర్

Like
bottom of page