top of page

స్నేహానికి అర్ధం మారిపోతూంది!


'Snehaniki Artham Maripothundi' - New Telugu Story Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 10/10/2023

'స్నేహానికి అర్ధం మారిపోతూంది' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


విక్రం నాకు బుక్ ఎగ్జిబిషన్ లో పరిచయం అయ్యారు. ఆయన ముఖ్య మంత్రుల దగ్గిరా పనిచేశారు. పత్రికా విలేఖరి. కొన్ని బుక్స్ కూడా రాశారు. జర్నలిజం అంటే నాకు ఇష్టం, గౌరవం.

(ఇది ఒకప్పుడు )


నాకూ సాహిత్యం అంటే ఇష్టం. కథలు వ్యాసాలూ రాస్తూంటాను. అందువలన హైదరాబాద్ లో జరిగే ప్రతీ

బుక్ ఫెయిర్ కి వెళ్లడం పుస్తకాలు కొని తెచ్చుకోడం ౩౦ ఏళ్ళ అలవాటు.


అలా అక్కడ జరిగే పుస్తకావిష్కరణల్లో విక్రమ్ పరిచయం కలిగింది. నన్ను గురించి వివరాలు చెప్పేక, ‘నేను పనిచేసే పత్రికకు మీ రచనలు పంపండి…’ అని వారు చెప్పడం, నేను పంపడం వారు ప్రోత్సహించడం.. అలా కొనసాగుతూ 15 ఏళ్ళు గడిచాయి. అప్పుడప్పుడు మీటింగ్లో కలవడం, వారు మాఇంటికి రావడం, మేము వెళ్లడం జరిగేది. మా కుటుంబాల మధ్య కూడా పరిచయం పెరిగింది.


నా రచనలు అన్ని కలిపి బుక్ వేయిద్దాం అని ఆలోచన చేసినప్పుడు విక్రమ్ గారిని సమీక్ష రాయమని అడిగాను. ఆయన అలాగే అన్నారు. ప్రెస్ కాపీ వచ్చాక బుక్ ఇచ్చాను. తీసుకుని వెళ్లారు స్వయంగా కలిసి.

రోజులు గడిచిపోతున్నాయి.

వారాలు నెలలూ సుదీర్ఘంగా ! విక్రమ్ నుంచి ఎలాంటి మెస్సేజ్ లేదు. నేను ఎదురుచూసి ఫోన్ చేసెను.

తీరిక లేక చూడలేదు.... అని ఒకసారి, ఒక కథ చదివాను అని మరోసారి చెబుతూ వచ్చారు.

సంవత్సరం గడిచింది.


నేను అనుకున్నా, ‘నా సాహిత్యం వారికినచ్చలేదా /? ఎందుకు ఇంట ఆలస్యం చేస్తున్నారు? తీరిక

లేదు అంటే మొదట వీలుపడదు అని ఎందుకు చెప్పలేదు?’


“ మరో కారణంవుందా” అని స్పష్టంగా అడిగాను.


''ఆబ్బె అదేమీకాదు. బద్ధకం ఎక్కువైంది రిటైర్ అయ్యాక…” అన్నారు!


అది నిజం కాదని నాకు తెలుసు. పుస్తకాలు రాయడం ఎందరో రచయితల, సినీ రంగాల మీటింగుల్లో పాల్గొనడం, రోజూ టీవీలో చూసాను.


అర్ధం అయి పోయినది.... చివరికి.


‘విత్తంలేనిదే కలం కదలదు’ అని.'


అంతటి స్నేహం చూపించిన మనిషి అసలు నైజం ఇదా అని, అనుకున్నాను. మావారు మొదట కనిపెట్టేరు.

నేను ''అలా చీపుగా మాటాడకండి. ఆయన అలాటివారు కాదు. మచ్చలేని వ్యక్తిత్వం..... ఆయనమీద గౌరవంతో మనం 2 వేల రూపాయల బుక్స్ కొని స్నేహితులకు ఇచ్చాం'' అన్నాను.


కాలం గడిచాక మావారిమాటే నిజమని తెలిసి షాక్ అనిపించింది.


విక్రంగారు నా బుక్ మీద సమీక్ష రాసి ఉంటే యధాశక్తి దక్షిణ ఇచ్చేదాన్ని. అదీ గౌరవంతో!


ఇలా డబ్బుతోనే ఏపని ఐనా చేసేవారి స్థాయికి దిగజారి పోయారని తెలిసాక ఇక ఎవరితోనూ పరిచయాలు

కొత్తగా పెంచుకోరాదని గుణపాఠం తెలిసింది!


ఎందరో ప్రముఖ రైటర్స్ పెద్ద వారు నాకు తెలుసు. అయినా విక్రమ్ కి ప్రయారిటీ ఇచ్చాను.


నేను ఆర్ధికంగా ధనవంతురాలిని కాదు. మా పిల్లలు అమెరికాలో వున్నారు. అయితే వాళ్ళని ఒక్క డాలర్ అడగను. మనకు ఉంటే వాళ్లకు ఇస్తాం. లేదంటే ప్రేమను మాత్రమే పంచగలను. కన్న బిడ్డలుగా వాళ్లకి ఈ విషయం తెలుసు. అదృష్ట వశాత్తు నాకు తండ్రిగారి సాహిత్య వారసత్వం వచ్చింది..... రచనలు చేయడం.

ఎన్నో పత్రికలూ ప్రచురించాయి.


ఇప్పుడు బంధుత్వాలు.... స్నేహాలూ కలుషితం ఐపోవడం బాధ కలిగిస్తూంది. మనతో మాటాడాలి అంటే

దానికీ డబ్బు ఆశించే నీచబుద్ధి ఆవహించింది.

నా చిన్న నాటి స్నేహితురాలు జంషెడ్పూర్ లో ఇంగిలీషు మీడియం స్కూల్ నడిపింది. పాఠాలూ చెప్పింది.


భర్త టాటా స్టీల్ కంపెనీలో ఇంజినీర్ గా పనిచేశారు. కొడుకులు ఇద్దరూ అమెరికాలో మంచిగా స్థిరపడ్డారు.

పరమ భక్తురాలు. స్వామీజీలను పెంచి పోషించింది. రామకృష్ణ మఠంలో వాలంటరీగా పనిచేసేది.

ఒకరోజు నాకు యీ- మెయిల్ పంపింది. ''నువ్వు రాస్తున్న వ్యాసాలను నేను ఇంగిలీషులోకి ట్రాన్స్లేట్

చేస్తాను.... ఫిఫ్టీ ఫిఫ్టీ మనీ షేర్ చేసుకుందాం....” అంటూ.


''వయసులో నాకంటే ఆరేళ్ళు పెద్ద. చూడండి.... ఎలా ఆలోచిస్తోంది? ఆమాట నేను అడిగితె వేరుగా ఉంటుంది. అక్కడ పెద్దరికంలేదు. విచక్షణ లేదు.


ఆత్మాభిమానం అసలే లేదు. ఇలాటి వారిని స్నేహితులు అని ఎలా అనగలం! స్వార్ధపరులు అంటాం.


''పరిస్థితి బాగాలేదు.... ఆర్ధిక సహాయం చేద్దాం'' అని మనం అనుకోడం వేరు!


అన్నివుండి ఇంతగా దిగజారిపోతున్నారు. వీరూ వారూ అని లేదు. విచక్షణ లేకుండా డబ్బుకి గడ్డి తింటున్నారు.

''నిజమైన మంచి స్నేహితులు ఒక్కరు - ఇద్దరు మాత్రమే వుంటారు. దాన్ని పదిలంగా కాపాడుకునే వారే స్నేహితులు. '' స్వార్ధానికి మాత్రమే వాడుకునే వారిని దూరంగా పెట్టడం మంచిది.


ఇది నా అనుభవం. సమాజాన్ని బాగు చేయవలసిన వారే చెడగొడుతున్నారు!

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)30 views0 comments

Comments


bottom of page