'Sindhura Rajabandha Vimukthi - 2/3' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 10/10/2023
'సింధుర రాజ బంధ విముక్తి - 2/3' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
{11} కేశవ కేశి సూదన బాపవె
క్లేశము నాది ఈ సంకాశ బల మకర
పాశమునుండి నాశిల్లెడు ననున్
కౌశల మొందన్ కనికరంబిడిన్ వడిన్.
{12} వేల వేల వేదండ కోటి నాథుండనై యుండ
కాలమహిమ న్నెవ్వారు నాకండ లేకుండి రకట
కలభంబునైతి నాకీ కలవరంబేల
నలమేని దొరయె నాకింక నభయ మొసగు
{13} శిశుకము నోట జిక్క నా
వశముంబాసే వేసారితిన్ నిక
కౌశల మంతరించె ననందిక్కు
కేశవు డొక్కడె నే కౌశల మొందన్.
{14} కష్టము నోపనైతి నింక క
నిష్టుని రీతి నైతినో విష్టర శ్రవుడ నీ
దృష్టిని జార్చు మింక నీ కరి
జేష్టుని గావుము కటాక్ష వీక్షణా
15} చిక్కితి వారి చరంబునకున్ నిక మిక్కిలి
జిక్కితి మేను యణంగన్ జిక్కితిన్ ధృతిన్
జొక్కితి సత్తువెరుంగ జాల ననుంగావన్
తక్కొన వేడెదనో తత్పర పరాత్పరా
{16} ఓశరణాగత వత్సల ఓశతానంద
ఓపురాణ పురుష ఓ పుండరీకాక్ష
ఓ పరాత్పర ఓ కరుణారస సింధు
ఓ విరాట్ స్వరూప రావవే కావవే నన్ను సమ్రక్షింపవే
{17} శ్రీ లక్ష్మి ప్రాగల్బ్యమునన్ శ్రీపతి కామేశ్వరీ సహిత
లీలా వినోదమరయన్ వైకుంఠ పురంబులో
ప్రపుల్ల మల్లికా కుసుమ సుపరిమళ
మనోల్లాస విలాస విరాజ మానుడై వెలంగన్
{18} ఆవేదన జెందెడి వేదన వేదనంబున
నివేదన జేయన్విని నిర్వేదన నాప
నా వేదండకోటి నాథుంజేరన్ విభుండు
తావేది యనక దానొక్కడేతెంచెన్ వడిన్
{19} చక్రాయుధమున్ ధరించక చెప్పకన్ సిరికిన్
నక్రగ్రాహమున్ బరిమార్చ కతిన్ గావన్
త్రివిక్రముండెడలె జీరకన్ ఖగపతిన్ అన్యులన్
చే జిక్కన్ వీడక చెలి చెలాంచలము చెచ్చెరంజనన్
=================================================================================
ఇంకా ఉంది..
========================================================================
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
תגובות