top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

సింధుర రాజ బంధ విముక్తి - 3


'Sindhura Rajabandha Vimukthi - 3/3' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 11/10/2023

'సింధుర రాజ బంధ విముక్తి - 3/3' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి



{20} ప్రాభవంబునకు జెందన్నేడీరీతి తానే

ప్రభావంబొనర్చంగదిలెనో ప్రభువు యే

ప్రబల కార్యంబు మదినెంచెనో యే

ప్రాబల్యం బును దెల్పడింక పయనంబేమార్గమో


{21} అక్షరునంట నాదిలక్ష్మియు

నధోక్షజునంట పక్షీంద్రుడాతని

[పక్షము నంటి శంఖ చక్ర ధనుకౌమోదకీ

పక్షచరుల్ తక్షణ మేగిరి జగద్రక్షకు జేరన్.


{22} అంబరవీధి నుండరుగుదెంచెడి

పీతాంబర సంగాత శ్రీ పరివార సంగతి గాంచి

సంబరమరయన్ అమరుల్మొక్కిరి

అంబుజోధరుని సంభావన సేయన్.


{23} కరినొడసి బట్టిన మకరిన్ బరిమార్చన్

సరసిజనాభుడు విసిరెన్ చక్రము నక్రము దాకన్

గరువమణంగన్ గుందుచు గరినొదిలె మకరి

కరి పీడంబాయ గ్రహణము వీడిన గ్రహపతి భంగిన్ .


{24} కరికంటకుడు కరతేరన్

హరి పూరించె పాంచజన్యము నిక

పరితోషంబున అమరులు

పరిత్రాణిని గొల్చిరట పర్వంబనగన్.


{25} కడలి అల్లుడు వచ్చి

కడతేర్చ నిడుములు కదలె కొమ్ము

కాడరయ నలుపు దీర

సడల దుఃఖంబు దరిజేరె సరసి వీడి.


{26} తరుగదు యశమున్ ధనమున్

తరుగదారోగ్య భాగ్యము సహితం

పెరుగుట తరుగదు హరిగొల్చుట వలన

ఒరిగెడి పరిపూర్ణ పుణ్య ఫలమున్ కీర్తిన్ .


{27} కంటివాలొదిలి కరి

కంటకుని కడతేర్చిన విధంబునన్

తంటలంటిన దీనుల

వెంట నిల్చున్వెన్నుడు వేడన్ భక్తిన్.


{28} చెర యొదులగ చెవులూపుచు

కరమెత్తుచు హరి గొల్చెను

చిరుకనుల గురు జీవము

ఇరు పదములె ఉర్విన్ దాకన్.

=================================================================================

సమాప్తం.

========================================================================

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.



20 views0 comments

Comentários


bottom of page