నిశ్చయం

'Nischayam' - New Telugu Story Written By Kolla Pushpa
Published In manatelugukathalu.com On 11/10/2023
'నిశ్చయం' తెలుగు కథ
రచన: కొల్లా పుష్ప
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"పూలమ్మ పూలు జాజులు, కనకంబరాలు, మల్లెలు, చామంతులు" అంటూ అరుచుకుంటూ తిరుగుతుంది వీధుల వెంట మంగమ్మ .
ఒక దగ్గరే కూర్చుని అమ్మితే పూలు ఆలస్యంగా అమ్ముడై, పాడైపోతాయని ఇలా వీధుల్లో తిరుగుతూ అమ్ముతుంది.
'15 ఏళ్ల క్రితం వరకు భర్త నీడనే బతికింది మంగమ్మ కానీ భర్త ఓ ప్రమాదంలో చనిపోవడంతో సరదాగా వేసిన పూల మొక్కలు ఇప్పుడు జీవనాధారం అయ్యాయి.
రెండు రోజుల నుంచి జ్వరం పూలు అమ్మ లేకపోయింది.
జ్వరంలో ఉన్నప్పుడు ఇరుగుపొరుగు అనే మాటలు గుర్తొచ్చాయి.
'ఆ కాళీ జాగా అమ్మకం చెయ్యి బోలెడు డబ్బులు వస్తాయి, ఇల్లిల్లు తిరిగి పూలు అమ్మకుండా ఒక దగ్గరే కూర్చుని ఏదైనా వ్యాపారం చేసుకోకూడదా?' అనే మాటలు ఆలోచింపచేసాయి.
జ్వరం రావడం వల్ల రెండు రోజుల నుంచి పూలు కొయ్యక పూలు అన్ని వాడిపోయాయి.
ఆరోజు కూడా పూలు కోసి అమ్మకపోతే రోజు గడిచేదెలా? అందుకని పూలన్నీ కోసి అమ్మకానికి తెచ్చింది. రోజు పూలుకొనే సీతమ్మ ఇల్లు ఉన్న వీధిలోకి నడిచింది.
ఎప్పుడైనా "నీరసంగా ఉందమ్మా" అంటే ఇంత టిఫినెట్టి, కాపీ ఇచ్చేది మా తల్లి బంగారు తల్లి.
ముఖం నిండా పసుపుతో తల నిండా పూలతో దేవతలా ఉంటుంది, దయగా చూస్తుంది, అందుకనే ముందుగా ఆ వీధిలోకి వచ్చింది మంగమ్మ.
ఇంటి ముందున్న జనం చూసి" ఓలమ్మ ఏ టైపోనాది" అనుకుంటూ వెళ్ళింది.
చూడగానే నిర్గాంత పోయింది సీతమ్మ చనిపోయింది, పిల్లలు ఏడుస్తున్నారు. అక్కడ ఉన్న అందరూ "ఆవిడకు పూలంటే ఇష్టం కదా రోజు పూలు తెచ్చే ఆవిడ తేకపోయే సరికి ఆవిడే రోడ్డు మీదకు వెళ్ళింది వస్తుండగా లారీ గుద్దింది" అని అందరూ అనుకుంటున్నారు.
'అయ్యో నా వల్లనే ఆయమ్మ చనిపోనాది' అనుకుంది మంగమ్మ.
ఆ సంఘటనతో మంగమ్మలో ఒక ఆలోచన దృఢంగా కలిగింది. 'తనకు జీవనాధారం కలిగిస్తున్న ఆ స్థలాన్ని ఎప్పటికీ అమ్మకూడదు.
తన జీవం ఉన్నవాళ్లు ఈ పూలని అమ్ముతూ అందరికీ సాయపడాలని' అనుకుంది నిశ్చయంగా.
***
కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప
https://www.manatelugukathalu.com/profile/pushpa/profile