'Prema Entha Madhuram Episode 7' - New Telugu Web Series Written By
Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 16/10/2023
'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సతీష్-సుశీల ల సంసారం హ్యాపీ గా సాగుతూ ఉంటుంది. సతీష్.. అప్పుడప్పుడు దిగాలుగా ఉండడం గమనించిన సుశీల.. కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది..
ఒక డైరీ కనిపిస్తుంది. అందులో కొన్నిపేర్లు మాత్రమే రాసి ఉంటాయి. మర్నాడు కొన్ని ఫొటోలు దొరుకుతాయి. సుశీల తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళడానికి సతీష్ ను పెర్మిషన్ అడిగి వెళ్తుంది. కమల.. సుశీలను తన ఫ్లాట్ కి తీసుకెళ్తుంది..
సతీష్ స్నేహితురాళ్ళు రాణి, రజని, లత, లక్ష్మి, కళ్యాణి లను కలుస్తుంది. తర్వాత.. శైలజ కోసం బెంగళూరు బయల్దేరుతుంది సుశీల.
శైలజ చనిపోయినట్లు తెలుస్తుంది.
ఇంటికి తిరిగి వస్తుంది సుశీల.
ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 7 చదవండి.
సుశీల వంట ముగించుకుని.. రెండు అప్పడాలు వేయించింది..
"ఏమండి! రండి భోజనానికి.. కలసి భోజనం చేద్దాం! అలా చూడకండీ! ముందు.. ఈ భోజనం చెయ్యండి"
"వచ్చేసాను.. సూసీ. ఇప్పుడు చెప్పు సూసీ! ఏమిటో ఊరి కబుర్లు.. ?"
"ఏముంటాయండి.. నా ఫ్రెండ్ కమల ను కలిసాను.. అది కార్ కొన్నాది.. మంచి ఫ్లాట్ తీసుకుంది.. ఇద్దరమూ అలా షికారు చేసాము.. మరచానండి.. మీ గురించి అడిగింది.. "
"మొత్తం మీద ట్రిప్ ఎంజాయ్ చేసావు కదా!"
ఆ రాత్రి ఇద్దరు సరదాగా మనసు విప్పి మాట్లాడుకున్నారు..
మర్నాడు మార్నింగ్.. సతీష్ ఆఫీస్ కు వెళ్ళగానే.. సుశీల కు కళ్యాణి గురించి గుర్తుకు వచ్చింది..
ఫోన్ తీసి నెంబర్ కోసం సెర్చ్ చేసింది.. కళ్యాణి జపాన్ లో ఉంటుంది కదా.. వాట్సాప్ కాల్ చేస్తాను..
"హలో.. "
"హలో.. ఎవరండీ.. "
"నేను సుశీల అండి.. హైదరాబాద్ నుంచి.. మీరు కళ్యాణి కదా!.. "
"అవును.. "
"మీ నెంబర్.. మీ మదర్ ఇచ్చారు.. మీ ఇంటికి వెళ్ళాను మొన్న.. "
"ఓహ్! ఓకే!.. ఇంతకీ మీరు ఎవరు?.. నేను గుర్తు పట్టలేదు"
"నేను సుశీల.. సతీష్ ఫ్రెండ్.. "
"సతీష్.. అంటే?.. "
"మీరు ఇక్కడ కంపెనీ లో వర్క్ చేసినప్పుడు.. మీ కొలీగ్ సతీష్.. "
" 'ఎస్'.. సతీష్.. ఎలా ఉన్నారు?"
"బాగున్నారండి.. "
"చాలా రోజులైంది సతీష్ ను చూసి.. అప్పట్లో చాలా ఆక్టివ్.. మీకు నేను చెప్పక్కర్లేదు.. మీరు రోజు చూస్తూ ఉంటారు అనుకోండి.. "
"నిజమే నండి.. "
"కళ్యాణి గారు! సతీష్ బర్త్ డే రోజు ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేస్తున్నాను.. మీరు ఇండియా.. ఈ మధ్య ఏమైనా వస్తున్నారా?"
"వస్తానండి.. మా మదర్ ను తీసుకుని వెళ్ళడానికి.. నెక్స్ట్ మంత్"
"మీ గురించి నాకు తెలుసు కోవాలని ఉంది.. "
"సరే.. చెబుతాను.. వీడియో కాల్ లోకి రండి.. మిమల్ని చూడాలని ఉంది" అంది కళ్యాణి..
"అలాగే కళ్యాణి.. "
సుశీల వీడియో కాల్ కనెక్ట్ అయ్యింది.. బయట టెర్రస్ మీదకు వచ్చి.. జాగ్రత్త పడింది.. ఇంట్లో ఎక్కడైనా సతీష్ వస్తువులు.. ఏమైనా కనిపిస్తాయేమోనని..
"మీరు చాలా అందంగా ఉన్నారండి కళ్యాణి గారు.. "
"థాంక్స్ అండి.. మీరు మాత్రం ఏమీ తక్కువ కాదండి.. సుశీల గారు.. అందం చీర కడితే ఎలా ఉంటారో.. అలా ఉన్నారు"
"మరీ పొగుడుతున్నారు మీరు.. " అని సిగ్గుపడుతూ.. అంది సుశీల
"నేను కంపెనీ లో జాయిన్ అయిన తోలి రోజులనుండి.. నాకు ప్రాజెక్ట్ దొరకడం కష్టమైంది.. అందుకే బెంచ్ మీద చాలా రోజులు ఉండాల్సి వచ్చింది..
రోజూ చాలా టెన్షన్ గా ఉండేది.. ఎక్కడ నాకు పింక్ స్లిప్ ఇస్తారో అని!.. రొజూ రాత్రి నిద్ర పట్టేది కాదు.. ఒక పక్క ఇంట్లో.. పెళ్ళి చేస్తామని గోల.. ఈ టెన్షన్ లోనే సతీష్ పరిచయమయ్యారు.. అక్కడ..
అయన అప్పుడే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి.. బెంచ్ మీదకు వచ్చారు.. ఒక రోజు ప్రాజెక్ట్ అసైన్ రూమ్ లో కలిసాము.. అప్పుడే పరిచయం నాకు సతీష్.
అప్పుడు హాయ్ చెప్పను.. తాను తిరిగి హాయ్ చెప్పాడు..
"ఎందుకండీ అలా ఉన్నారు.. " అని అడిగాడు సతీష్.
"ఏమి లేదు.. నా స్కిల్ కి తగ్గట్టు ప్రాజెక్ట్ దొరకట్లేదండి.. ఇప్పటికే చాలా రోజులు బయట ఉన్నాను.. భయంగా ఉంది.. రేపు మీటింగ్ అంట.. ఇంకా భయంగా ఉంది.. "
"ఎందుకండీ భయం.. ధైర్యంగా వెళ్ళండి.. "అన్నాడు సతీష్.
"మర్నాడు ఉదయం రూమ్ లోకి పిలిచారు.. అప్పటికే ముందు వెళ్లి బయటకు వచ్చే వారి ముఖాలు మాడిపోయి.. జీవితం మీద విరక్తి గా బయటకు వచ్చారు.. లోపల బాగా బ్యాండ్ అయినట్టుందని అనుకున్నాను.. నాలో భయం ఇంకా పెరిగింది.. "
అప్పుడే.. సతీష్ నాకు బాగా ధైర్యం చెప్పి లోపలికి వెళ్ళమని చెప్పారు.. లోపలికి వెళ్ళాను..
చాలా సేపు తర్వాత బయటకు వచ్చాను.. ముఖం లో ఆ కళ లేదు.. ముఖం లో నవ్వు ఆల్మోస్ట్ జీరో అయిపోయింది.. కొంచం ఏడుపు ముఖం పెట్టాను.
"ఏమైందండీ కళ్యాణి గారు?"
"లోపల నన్ను బాగా తిట్టారు.. వారం లోపల ప్రాజెక్ట్ లో జాయిన్ అవకపోతే, పింక్ స్లిప్ కాయం అని అన్నారు..” అని ఆపుకోలేక ఏడ్చేసాను.
"ఎవరైనా.. చూస్తే.. బాగొదండి!.. ఉరుకోండి.. ముఖం కడుక్కుని కాంటీన్ కు రండి.. " అని చెప్పి వెళ్ళిపోయాడు సతీష్
నేను ముఖం వాష్ చేసుకుని కాంటీన్ కు వెళ్లాను.. అప్పటికే సతీష్ అక్కడ కూర్చున్నాడు..
"రండి కళ్యాణి.. సారీ.. 'గారు' అనలేక పోతున్నాను.. ఏమి అనుకోవద్దు"
"పర్వాలేదు.. మీరు పిలవొచ్చు.. "
"మీరు ప్రాజెక్ట్ కోసం సీరియస్ గా ట్రై చెయ్యండి.. నాకు ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుంది తొందరలో.. నేను నా ప్రాజెక్ట్ లోకి మిమల్ని తీసుకుంటాను.. మీ ప్రొఫైల్ నాకు మెయిల్ చెయ్యండి.. "
"థాంక్స్ సతీష్ గారు.. "
"కాల్ మీ సతీష్.. "
ఇలా రోజు నాకు ధైర్యాన్ని చెప్పేవారు సతీష్..
మా ఇంట్లో చూసిన అబ్బాయి గురించి అభిప్రాయం కూడా అడిగాను సతీష్ ను.. అప్పట్లో సతీష్ అంటే కూడా ఇష్టం ఏర్పడింది నాకు.. కానీ సతీష్ అభిరుచులు వేరే అని తన మాటల్లో తెలిసింది.. ఒక ఫ్రెండ్ గానైనా.. ఉండే ఛాన్స్ దొరికినందుకు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను..
సతీష్ కు ప్రాజెక్ట్ వచ్చింది.. అయన ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ లో ఉన్నారు.. అప్పటికి నాకు ఇంకా ప్రాజెక్ట్ రాలేదు.. సతీష్ నాకు ఫోన్ చేసి.. తన కేబిన్ కు రమ్మన్నారు..
కేబిన్ కు వెళ్లిన నాకు.. సతీష్.. "ఎలా ఉన్నారు కళ్యాణి? స్మైల్.. నో ఫియర్” అనేవాడు.
"నా టీం లో ఒక రోల్ ఉంది.. దానికి మిమల్ని తీసుకుంటున్నాను.. ఓకే నా?"
"నా అదృష్టమండి.. మీ తో వర్క్ చెయ్యడం " అన్నాను.
"ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాను.. ఈలోపు ఇంట్లో పెళ్లి సంబంధాలు స్పీడ్ అప్ చేసారు.. మొత్తం మీద పెళ్లి ఫిక్స్ చేసారు.. సతీష్ నా పెళ్లికి వచ్చారు.. తర్వాత మా ఆయనకు జపాన్ లో ఆఫర్ వచ్చింది.. నేను ఇక్కడకు వచ్చేసాను.. "
"సతీష్ హెల్ప్ వల్లనే, నేను ఇక్కడ కూడా మంచి జాబ్ లో ఉన్నది.. సతీష్ ను అడిగానని చెప్పండి..”
"అలాగే" అంది సుశీల
“మీరు పార్టీ కు ఖచ్చితంగా రావాలి.. కళ్యాణి.. నేను ఇన్విటేషన్ పంపిస్తాను..”
"సరే సుశీల గారు"
"మీ పాప ఎలా ఉంది?"
".. బాగుందండి.. "
"ఏంటి పేరు?"
"శ్రావ్య"
"చక్కటి పేరు.. మీ పాపని కూడా తీసుకుని రండి.. "
"మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉండండి.. టచ్ లో ఉండండి.. బై" అంది కళ్యాణి..
ఫోన్ పెట్టేసిన తర్వాత.. సుశీల.. కళ్యాణి గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది..
=====================================================================
ఇంకా వుంది..
=====================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments