top of page

ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 8


'Prema Entha Madhuram Episode 8' - New Telugu Web Series Written By

Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 21/10/2023

'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


సతీష్.. సుశీల ల సంసారం హ్యాపీ గా సాగుతూ ఉంటుంది. సతీష్.. అప్పుడప్పుడు దిగాలుగా ఉండడం గమనించిన సుశీల, కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది.


సతీష్ టేబుల్ డ్రాలో ఒక డైరీ కనిపిస్తుంది సుశీలకి.. అందులో కొన్నిపేర్లు మాత్రమే రాసి ఉంటాయి. మర్నాడు మళ్ళీ వెతకగా కొన్ని ఫొటోలు దొరుకుతాయి. అతని గతం తెలుసుకోవాలనుకుంటుంది.


తన స్నేహితురాలిని కలవాలనే నెపంతో ఇంటినుండి బయలుదేరుతుంది.


సతీష్ స్నేహితురాళ్ళు రాణి, రజని, లత, లక్ష్మి లను కలుస్తుంది. సతీష్ బర్త్ డే పార్టీకి రమ్మని అందరినీ కోరుతుంది. తర్వాత కళ్యాణి ఇంటికి వెళ్ళి ఆమె ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. సతీష్ కు ఫోన్ చేసి, ఇంటికి తిరిగి వస్తుంది సుశీల.

మర్నాడు కళ్యాణి కి ఫోన్ చేసి తన స్టొరీ తెలుసుకుంటుంది. పార్టీ కి రమ్మని చెబుతుంది.


ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 8 చదవండి.

ఫోన్ పెట్టేసిన తర్వాత.. సుశీల కళ్యాణి గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది..


ఈలోపు కాలింగ్ బెల్ మోగింది..

"ఎవరబ్బా ఈ టైం లో?" అనుకుంటూనే.. తలుపు తీసింది సుశీల..


"అమ్మా! నువ్వా.. ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు.. "


"మా అమ్మాయి దగ్గరకు రావడానికి.. నాకు పర్మిషన్ కావాలా?"


"ఉండు కాఫీ తెస్తాను.. ఈలోపు ఫ్రెష్ అయ్యి రావే!"


"అల్లుడుగారు ఆఫీస్ కు వెళ్ళారా?"


"అవును.. "


"వొంట్లో ఎలా ఉందే?.. ఏమైనా విశేషం ఉందా?"


"అప్పుడే ఏమిటే అమ్మ! ఇంకా టైం ఉంది లే"


"ఇప్పుడు కాలం పిల్లలు ఏమిటో!.. చాలా టైం తీసుకుంటారు.. పనిమనిషి వొస్తుందా?"


"ఇందాకలే వచ్చి వెళ్ళింది.. "


"ఇదిగో కాఫీ "


"ఏమిటే ఊరిలో విషయాలు అమ్మ!"


"ఏముంటాయి.. అని మాములే.. మీ నాన్నగారు ఎప్పుడు బిజీ కదా.. ఆ పొలం పనులు.. రమ్మంటే రాలేదు.. "


"ఉండు.. నేను కాల్ చేస్తాను.. ” అని ఫోన్ అందుకుంది సుశీల.


"హలో! నాన్నా! ఎలా ఉన్నారు?.. అమ్మ ను పంపించారు.. మీరు ఎందుకు రాలేదు.. రావొచ్చుగా"


"కుదరలేదు తల్లి.. మళ్ళిసారి వస్తాను లే.. నువ్వు.. అల్లుడు కులాసా కదా!"


"కులాసా.. గాని.. మీ ఆరోగ్యం జాగ్రత్త!"


"నీ చెల్లి కి మంచి సంబంధం వచ్చిందే!.. అమ్మ నీతో చెబుతుంది లే!.. ఉంటాను.. "


"అమ్మా! చెల్లి కి మంచి సంబంధం వచ్చిందంటా!.. అవును.. మంచి వార్త చెప్పావుగా"


"అబ్బాయి అదేదో సాఫ్ట్వేర్ కంపెనీ లో చేస్తాడంట.. మీ అయన ను కొంచం కనుక్కోమని చెప్పవే!.. "


"చెబుతాను లే!"


"అనుకున్నట్టు సంబంధం కుదిరితే.. వచ్చే నెలలోనే పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాము.. సుశీల"


"అలాగే అమ్మ! ఈసారి మా వారిని పెళ్ళికి ఎక్కువ రోజులు సెలవు పెట్టమని చెబుతాను"


"మీ అయన మాట ఎలా ఉన్నా.. నువ్వు మాత్రం అన్నీ దగ్గరుండి చూసుకోవాలి.. ఉన్నది మీ ఇద్దరే కదా! మాకు.. "


"అలాగే అమ్మ! నువ్వు ఇంతలాగా చెప్పాలా.. "


ఇద్దరు భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకున్నారు..

"రేపు ఉదయం బయల్దేరతానే.. నేను.. "


"అప్పుడేనా.. అమ్మ"


"మళ్ళీ వస్తాను లేవే.. "


సాయంత్రం సతీష్ ఇంటికి వచ్చాడు..

"అత్తయ్యగారు నమస్కారం! ఎలా ఉన్నారు?"


"బానే ఉన్నాను.. "


"ఏమండి! మా చెల్లి కి మంచి సంబంధం వచ్చిందంట.. ఇదిగో అబ్బాయి డీటెయిల్స్.. కొంచం అబ్బాయి గురించి తెలుసుకోండి.. "


అనగానే..

“కాఫీ తీసుకు రా సూసీ.. "


"చిటికలో తెస్తానండి.. "


సతీష్ కాఫీ తాగుతూ.. అబ్బాయి ఫోటో చూసాడు.. “ఈ అబ్బాయి నాకు తెలుసు.. మంచి వాడు. కష్టపడి పని చేస్తాడు. మొన్న.. మా ఆఫీస్ లో మీటింగ్ కు వచ్చాడు.. వాళ్ళ కంపెనీ లో ఏదో విషయం మాట్లాడడానికి.. వాళ్ళ కంపెనీ మా కంపెనీ కి క్లయింట్ ఒకరే!"


"అవునా అండి.. సంబంధం కాయం చెయ్యమంటారా?"


"మిగిలినవి.. మీరు చూసుకోండి.. "అన్నాడు సతీష్.


మర్నాడు ఉదయం.. అత్తగారిని ఊరు బస్సు ఎక్కించాడు సతీష్..


కొన్ని రోజుల తర్వాత.. “చెల్లి కి పెళ్లి చూపులు.. నువ్వు రావాలి అని అమ్మ కబురు చేసింది.. నేను బయల్దేరు తున్నాను.. మా చెల్లి పెళ్లిచూపులు కదా!.. మీరు జాగ్రత్త"


"వెళ్ళు సూసీ!.. పెళ్ళి కి వస్తాను లే"


పెళ్ళిచూపులు.. తాంబూలాలు.. అన్ని అయ్యాయి.. పెళ్లి పత్రికలు అచ్చయ్యాయి.. పెళ్ళి కి సుశీల.. సతీష్ ఊరు వెళ్లారు.. పెళ్ళి గ్రాండ్ గా జరిగింది..


"ఏమండి! అందరి కళ్ళు మీ మీదే నండి.. దిష్టి తీస్తానండి.. అసలే.. అమ్మాయిల చూపంతా.. మీ మీదే.. "


"చాలా అలసట గా ఉంది.. జర్నీ కదా.. రేపు మాట్లాడదామండి.. "


మర్నాడు బ్రష్ చేస్తున్నప్పుడు.. సుశీల కు.. ఎదో గుర్తొచ్చింది..


అవును కదా! మా ఆయన పుట్టిన రోజు దగ్గరకు వచ్చేసింది.. అసలు విషయం మర్చిపోయాను.. పార్టీ చెయ్యాలి కదా!.. నేనొక్కత్తినే చెయ్యలేను.. ఒక ఐడియా! కమల ను హెల్ప్ అడుగుతాను..


"హలో.. కమల"


"హలో.. సుశీల"


"ఏమిటి ఉదయాన్నే కాల్ చేసావు.. ?"


"నీకు తెలిసిన స్టొరీ.. పార్టీ గురించి.. నీ హెల్ప్ కావాలి.. నీ గిఫ్ట్ ఓపెన్ చేసానే.. థాంక్స్"


"ఎందుకు థాంక్స్?.. ఆ డబ్బులు.. నీకు చాలా హెల్ప్ అవుతాయి.. "


"నువ్వు రావే.. డబ్బులు ఇవ్వడం కాదు.. "


"ఈ వీకెండ్.. అక్కడ ఉంటేనే.. మీ ఆయనకు అనుమానం వస్తుందేమో.. నా ఫ్రెండ్ హాస్టల్ లో దిగుతాను.. "


"వచ్చాక కాల్ చెయ్యవే!"


వీకెండ్ సుశీల కార్ తీసుకుని కమల ను కలవడానికి వెళ్ళింది.. ఇద్దరు ఒక పార్క్ లో కలిశారు..


"ఇప్పుడు చెప్పవే! ఏం చెయ్యాలి?" అడిగింది కమల.


"నీ అంత ఫాస్ట్ కాదే నేను.. నాకు కొంచం సలహా ఇవ్వవే!.. మా ఆయనకు ఏమని చెప్పాలి?.. ఎక్కడ చెయ్యాలి ఫంక్షన్.."


"అదా! మొత్తం ఎంత మంది వస్తారు.. "


"ఒక 50 వేసుకో.. "


"అయితే ఒక హోటల్ లో సూట్ రూమ్ బుక్ చేద్దాం.. డబ్బులు ఇచ్చాను కదా! ఇంకేమి ఆలోచించకు.. "


"మా అయన కోసం చేస్తున్నాను.. కావాలంటే.. నా నగలు ఇచ్చేస్తాను.. "


"సెంటిమెంట్ ఎక్కువైందేమో మరి"


"ఏం చేయమంటావు.. ఇప్పటివరకు సెంటిమెంట్ డైలాగ్స్ లేవు కదా!"


"ముయ్యవే!.. నేను చూసుకుంటాను.. "


"అందరికీ ఇన్విటేషన్ పంపు.. మీ ఆయనకు మాత్రం పుట్టిన రోజు సెలబ్రేషన్ అని చెప్పు.. "


"అలాగే మేడం.. కమల"


కమల.. హోటల్ సూట్ రూమ్ బుక్ చేసింది.. సుశీల అందరికి ఇన్విటేషన్ వాట్సాప్ చేసింది.. అంతా అనుకున్నట్టుగానే రెడీ అయ్యింది..


"జపాన్ నుంచి కళ్యాణి.. ఓకే అందా?"


" 'ఎస్'.. తాను ఇండియా లోనే ఉంది.. నో ప్రాబ్లెమ్.. రాణి, రజని, లత, లక్ష్మి అందరూ ఓకే అన్నారు"


అనుకున్న రోజు రానే వచ్చింది..

"హ్యాపీ బర్త్ డే శ్రీవారు" అని నుదుటి పై ముద్దు పెట్టింది సుశీల.


"మీకో పార్టీ ప్లాన్ చేసానండి!.. మనం సరదాగా.. హోటల్ కు వెళదాం.. అక్కడ నాతో మీరు స్పెండ్ చెయ్యాలి రోజంతా.. " అంది సుశీల.. “ఈరోజు ఆఫీస్ లీవ్ పెట్టారు కదా?"


"పెట్టాను సూసీ! నీకోసం"


"హలో సుశీల గారు! నేను రాణి.. కొంచం లొకేషన్ పంపిస్తారా.. నేను హైదరాబాద్ దిగాను.. "


"వెల్కమ్ రాణి గారు"


అలా ఫోన్స్ వస్తూనే వున్నాయి.. “వెల్కమ్ హైదరాబాద్” అని అందర్నీ ఆహ్వానించింది సుశీల.


=====================================================================

ఇంకా వుంది..

=====================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ

69 views0 comments

Comments


bottom of page