'Prema Entha Madhuram Episode 9' - New Telugu Web Series Written By
Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 26/10/2023
'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సతీష్.. సుశీల ల సంసారం హ్యాపీ గా సాగుతూ ఉంటుంది. సతీష్.. అప్పుడప్పుడు దిగాలుగా ఉండడం గమనించిన సుశీల, కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది.
సతీష్ టేబుల్ డ్రాలో ఒక డైరీ కనిపిస్తుంది సుశీలకి.. అందులో కొన్నిపేర్లు మాత్రమే రాసి ఉంటాయి. మర్నాడు మళ్ళీ వెతకగా కొన్ని ఫొటోలు దొరుకుతాయి. అతని గతం తెలుసుకోవాలనుకుంటుంది.
తన స్నేహితురాలిని కలవాలనే నెపంతో ఇంటినుండి బయలుదేరుతుంది.
సతీష్ స్నేహితురాళ్ళు రాణి, రజని, లత, లక్ష్మి లను కలుస్తుంది. సతీష్ బర్త్ డే పార్టీకి రమ్మని అందరినీ కోరుతుంది. తర్వాత కళ్యాణి ఇంటికి వెళ్ళి ఆమె ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. సతీష్ కు ఫోన్ చేసి, ఇంటికి తిరిగి వస్తుంది సుశీల.
మర్నాడు కళ్యాణి కి ఫోన్ చేసి తన స్టొరీ తెలుసుకుంటుంది. పార్టీ కి రమ్మని చెబుతుంది.
సుశీల చెల్లెలి పెళ్లి జరుగుతుంది.
సతీష్ బర్త్ డే సెలెబ్రేట్ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తారు సుశీల, కమల.
ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 9 చదవండి.
సుశీల, సతీష్ కార్ లో హోటల్ కు చేరుకున్నారు..
అక్కడ ఏర్పాట్లు చూస్తోంది కమల.. లంచ్ కు అన్ని వెరైటీస్ ఆర్డర్ చేసారు..
కేక్ కటింగ్ గ్రాండ్ గా ప్లాన్ చేసారు.. సతీష్ హోటల్ లోకి ఎంటర్ అవగానే, చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు..
అప్పుడే ఎంటర్ అయ్యింది రాణి..
"హాయ్ సతీష్!"
"ఎవరు?"
"రాణి అండి.. మీ పదవ తరగతి ఫ్రెండ్.. "
"నేను ఎప్పుడు చూడలేదు.. హాయ్ రాణి.. ఎలా ఉన్నారు?"
"సతీష్ ఎలా ఉన్నావ్?"
"నేను ఊహించినట్టుగానే ఉన్నావు.. చాలా హ్యాపీ.. "
"ఇదేంటి సుశీల.. నా పార్టీ కి రాణి రావడం ఏమిటి?"
"ఇంకా చూడండి.. వెయిట్ చెయ్యండి"
"సతీష్! చాలా రోజులైంది నిన్ను చూసి.. నేను రాణి.. అప్పట్లో నువ్వు బాయ్స్ లో స్కూల్ ఫస్ట్ కదా.. నేను గర్ల్స్ లో స్కూల్ ఫస్ట్.. నిన్ను ఎప్పుడు కలవలేదు.. మీ ఫ్రెండ్స్ నీ గురించి చెప్పేవారు.. నా గురించి నీకు తెలియదు.. "
"రాణి పేరు నాకు తెలుసు.. నువ్వు ఫస్ట్ కదా!.. కానీ నువ్వు అన్నట్టు నేను నిన్ను ఎప్పుడు చూడలేదు.. చాలా థాంక్స్ నా పార్టీ కి వచ్చినందుకు.. "
"ఇదంతా.. చేసింది.. సుశీల గారు.. ఆమెకే చెప్పాలి థాంక్స్.."
"సుశీల నా వైఫ్ కదా!.. నా గురించి సర్వం తెలుసు.. "
"నాకు తెలియదు.. ఇంతవరకు.. కంగ్రాట్స్ సతీష్.. నీకు సరైన జీవిత భాగస్వామి దొరికింది.. తన ప్లేస్ లో ఇంకెవరు కరెక్ట్ కాదు. "
"చాలా బాగా చెప్పావు రాణి"
"నీకు పెళ్లయిందా?"
"అయ్యింది.. మా వారు రాలేదు.. అయన పేరు కూడా సతీష్.. "
"సంతోషం రాణి"
ఈలోపు ఒక క్యాబ్ వచ్చి ఆగింది.. ఎవరా? అని సుశీల ముందుకు వెళ్ళి చూసింది..
క్యాబ్ దిగింది.. రజని.. తన పాపతో వచ్చింది..
"హాయ్ రజని.. రండి" అని ఆహ్వానించింది.. సుశీల.
"హాయ్ సతీష్!” అని పలకరించింది రజని.
"హాయ్ రజని.. ఎలా ఉన్నావు"
"నేను గుర్తున్నానా సతీష్"
"ఎందుకు లేవు.. ఆ కాలేజీ రోజులు.. "
"అవును.. నువ్వు చేసిన హెల్ప్.. నేను ఈ రోజు హ్యాపీ గా ఉన్నాను"
అందరు.. ఇలా.. సరదాగా మాట్లాకుంటూ ఉన్నప్పుడు.. కార్ లో లత వచ్చింది..
"వెల్కమ్ లతా!" అంటూ సుశీల వెళ్లి లోపలికి తీసుకు వచ్చింది..
"హే లతా! నువ్వా ఇక్కడ?” అన్నాడు సతీష్.
"సుశీల గారు పిలిస్తే, నేను రానా నీ కోసం.. నీ పుట్టిన రోజు కదా మరి?"
"ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నిన్ను.."
తర్వాత లక్ష్మి.. వచ్చింది..
లక్ష్మి ని చూసి సతీష్ ఆప్యాయంగా పలకరించాడు
"సతీష్! ఇంకా ఎవరి కోసం చూస్తున్నారు " అడిగింది సుశీల.
"ఇంకెవరైనా వస్తారేమో నని.. కేక్ కట్ చేసేయ్యనా?"
"ఇంకా ఒక గెస్ట్ ఉన్నారు.. NRI గెస్ట్.. వెయిట్ చేద్దామ్..
(NRI అంటే, కళ్యాణి కదా? జపాన్ వెళ్ళింది అప్పట్లో.. అనుకున్నాడు సతీష్.. )
అనుకున్నాడో లేదో.. కళ్యాణి వచ్చింది..
కళ్యాణి.. కళ్ళలో నీళ్లు పెట్టుకుని వచ్చి.. సతీష్ ని వాటేసుకుంది..
"ఏమిటిది కళ్యాణి.. బాగోదు? కళ్ళు తుడుచుకో.. "
"ఏమైంది.. చెప్పు.. "
"తర్వాత మాట్లాడుతాను.. కొంచం రిలాక్స్ అవ్వు.. "
"ఏమండి! కళ్యాణి మీతో చాలా ఎమోషనల్ గా ఉంది. "
"నా పాత టీం మెంబెర్ కదా.. ఆ ఎఫక్షన్"
ఈలోపు కేక్ కటింగ్ కోసం అందరు హాజరు అయ్యారు..
కేక్ కట్ చేసాడు.. మొదటి ముక్క.. సుశీల తినిపించింది.. తర్వాత అందరు కేక్ ను ఎంజాయ్ చేసారు..
అప్పుడే సతీష్ మైక్ అందుకున్నాడు..
"ఫ్రెండ్స్..
నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది.. ఎన్నో పుట్టిన రోజులు జరుపుకున్నాను.. కానీ, ఇది నా జీవితంలో మర్చిపోలేనిది అవుతుంది.. ఎందుకో తెలుసా?
నా మనసు తెలుసుకున్న నా శ్రీమతి.. నా పాత స్నేహితులను.. ఇక్కడకు పిలచి నన్ను ఆనందింప చేసింది. నా క్లాస్మేట్స్, కాలేజీ మేట్స్.. నా తో పని చేసిన సహుద్యోగులు.. అందరు ఇక్కడే ఉన్నారు.. ఇంతకన్నా ఏమిటి కావాలి నాకు?
రాణి.. నాకోసం వచ్చింది.. స్కూల్ లో నేను ఎప్పుడు తనని చూడలేదు.. ఐనా నా కోసం వచ్చింది.. నా పై అభిమానం తో..
రజని.. కాలేజీ లో ఎంతో ఫ్రెండ్లీ గా ఉండేది.
లత.. చాలా దూరం నుంచి నా మీద ప్రేమా.. అభిమానం తో వచ్చింది..
లక్ష్మి.. కాలేజీ లో నా కవితలంటే చాలా పిచ్చి తనకి..
ఇంకా కళ్యాణి.. నా టీం లో మెంబెర్.. పాత కంపెనీ లో..
ఇలా అందరి గురించి ప్రస్తావించాడు సతీష్..
మీ అందరికి నా గురించి కొంచం చెప్పాలి. నేను ఒక మిడిల్ క్లాసు నుంచి వచ్చిన వాడిని. నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మ హౌస్ వైఫ్.
చిన్నప్పటినుంచి, చదువులో చాలా చురుకుగా ఉండేవాడిని. ఎప్పుడు ఫస్ట్ రావాలనే తపన.. నాలో చాలా ఉండేది. గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా ఎక్కువ. ఏదైనా చూసిన వెంటనే.. గుర్తుంచుకోవడం బాగా వొచ్చు. మా అమ్మ.. నా కోసం చాలా కష్టపడేది. రోజూ.. స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ మోస్తూ.. స్కూల్ లో ఉదయం దింపేది. మధ్యాహ్నం మళ్లీ.. నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చేది. ఎండైనా.. వానైనా.. స్కూల్ బెల్ కన్నా ముందే వచ్చేది.
మా నాన్నగారు.. ఎప్పుడు ఆఫీస్ లో బిజీ. అన్నీ.. అమ్మే చూసుకునేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కావాల్సిన స్నాక్స్ చెయ్యడం.. హోంవర్క్ చేయించడం.. అన్ని చేసేది. ఇవన్నీ.. ఎందుకు చెబుతున్నాను అని మీకు సందేహం రావొచ్చు. నా గురించి అందరికి చెబుదామని.
మా స్కూల్ లో టీచర్స్ చాలా ఫ్రెండ్లీ గా ఉండేవాళ్ళు. ఏది అడిగినా చాలా ఓర్పు తో చెప్పేవారు. తెలుగు టీచర్ అంటే మటుకు మా క్లాసు లో అందరికీ భయమే.
ఆవిడ ఎక్కువ కొట్టేవారు. మా సైన్సు టీచర్ చాలా బాగా చదివించే వారు. మా స్టూడెంట్స్ ని.. ఎప్పుడూ.. ప్రిన్సిపాల్ దగ్గర పోగొడుతూ ఉండేవారు. అప్పట్లో.. మా ఇంటి పెరట్లో.. జామ చెట్టు ఉండేది.. రోజూ నేను దానికి కాసే జామకాయలు తీసుకుని వెళ్లి.. సైన్సు టీచర్ కు ఇచ్చే వాడిని. టీచర్ చాలా సంతోషించేవారు.
తర్వాత కాలేజీ లో జాయిన్ అయిన తర్వాత లైఫ్ అంతా మారిపోయింది. అక్కడే.. మా ఫ్రెండ్స్ అందరూ పరిచయమయ్యారు.
ఇక ముఖ్యంగా చెప్పాల్సింది నా శ్రీమతి సుశీల గురించి. నన్ను ఎంతో ప్రేమతో.. కంట్లో పెట్టుకుని చూసుకుంటుంది నా సూసీ.. నేను చాలా లక్కీ.
మాది లవ్ మ్యారేజ్. అంతా ఫోన్ లో ప్రేమ.. ఇంకా.. చెప్పాలంటే రోజూ చాటింగ్.. ఫోన్ లో టాకింగ్. నన్ను ఎంతగా.. ప్రేమించిందంటే.. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి.
మా పెళ్ళి కి వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోయినా.. ఎదిరించి.. నన్ను చేసుకుంటానని అంది నా సుశీల. నేనంటే అంత ఇష్టం తనకి. నేనెప్పుడూ.. తనను ప్రేమించడం తప్ప.. ద్వేషించడం, తిట్టడం నాకు తెలియదు.. అసలు తన ముఖము.. చుస్తే ఎంత కోపం ఉన్నా.. కరిగిపోవల్సిందే.. అందులో సందేహం లేదు.
నా సూసీ.. ఈ పార్టీ కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మీ అందరిని పర్సనల్ గా కలిసి.. మీ గురించి తెలుసుకుని, మిమల్ని ఒప్పించి.. ఇక్కడకు రప్పించింది. మెనీ థాంక్స్ సూసీ!
ఈలోపు లంచ్ టైం అయ్యింది.. అందరు లంచ్ చెయ్యండి.. అని సతీష్ చెప్పాడు..
సతీష్.. కళ్యాణి దగ్గరకు వచ్చి..
"కళ్యాణి.. ఎలా ఉన్నావు? ఇందాక అంత ఎమోషన్ ఎందుకు?"
"సతీష్! నీ గురించి చాలా వెతికాను.. మీ అడ్రస్ కోసం, ఫోన్ నెంబర్ కోసం.. కానీ.. నాకు దొరకలేదు.. అనుకోకుండా సుశీల కాల్ చేసింది.. అప్పుడు నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను.. ఈ రోజు కోసం ఎంత వెయిట్ చేసానో తెలుసా.. ? నాకు అప్పుడు ఇంట్లో చూసిన పెళ్లి ఇష్టం లేదు.. నువ్వంటే చాలా ఇష్టం.. కానీ ఇంట్లో మాట కోసం పెళ్లి చేసుకున్నాను.. మా అయన ఎప్పుడు టార్చర్ పెట్టేవాడు.. నరకం చూపించాడు నా లైఫ్ మొత్తం.. "
"మీ అయన ఎక్కడ"?
"విడాకులు ఇచ్చేసాను.. సతీష్"
"విడాకులా?"
"నాకు కలసి ఉండడం ఇష్టం లేదు.. పాప కోసం బతుకుతున్నాను"
"ఇప్పుడు ఏమి చేస్తున్నావు మరి?"
"ఇండియా కు పెర్మనంట్ గా వచ్చేసాను.. "
"మా కంపెనీ లో జాబ్ చేస్తావా కళ్యాణి?.. "
"వద్దు సతీష్. మీ భార్య సుశీల ను పిలువు.. "
"సూసీ! సూసీ!” అని పిలిచాడు.
"ఏమిటండి!"
"కళ్యాణి నీతో ఏదో చెప్పాలనుకుంటుందంటా"
"కళ్యాణి! ఏమైంది?"
"నీ దగ్గర ఒక విషయం దాచాను సుశీల"?
"ఏమిటది కళ్యాణి?"
"అప్పట్లో సతీష్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది.. కానీ ఇంట్లో చూసిన పెళ్ళి సంబంధం చేసుకోవాల్సి వచ్చింది.. మా అయన ఒక శాడిస్ట్.. ఆ టార్చర్ భరించలేక విడాకులు ఇచ్చేసాను.. ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది.. అది టైం వచ్చినప్పుడు చెబుతాను" అని చెప్పి కళ్యాణి వెళ్లిపోయింది..
"సుశీల! నువ్వు నా సంతోషం కోసం.. నా ఫ్రెండ్స్ అందరితో కలిపావు.. కానీ కళ్యాణి చాలా డిఫరెంట్.. తన గురించి నేను చాలా ఆలోచించేవాడిని.. చాలా అమాయకురాలు.. అప్పట్లో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని కూడా చెప్పింది.. నేను ఎప్పుడు ఆలోచించేది తన కోసమే సుశీల..
ఇప్పుడు ఇలాగ..” అని కంట్లో నీళ్లు పెట్టుకున్నాడు..
రాణి, రజని, లత, లక్ష్మి.. అందరూ.. నన్ను ఇష్టపడ్డారు.. కానీ.. కళ్యాణి విషయం లో నాకు ఎక్కడో సాఫ్ట్ కార్నేర్ ఉండేది.. అలాగని నన్ను అపార్ధం చేసుకోకు సుశీల.. నేను చాలా ప్యూర్ టు హార్ట్..”
=====================================================================
ఇంకా వుంది..
=====================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments