పంతులమ్మ పాఠం
- Gadwala Somanna
- Sep 9
- 2 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PanthulammaPatam, #పంతులమ్మపాఠం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 116
Panthulamma Patam - Somanna Gari Kavithalu Part 116 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 09/09/2025
పంతులమ్మ పాఠం - సోమన్న గారి కవితలు పార్ట్ 116 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
పంతులమ్మ పాఠం
----------------------------
చూసి నేర్చుకో తరువును
మదిని నిలుపుకో గురువును
వృద్ధినొందు జీవితాలు
చక్కబడును కుటుంబాలు
సాయపడే చేతులే
ప్రేమలొలికే మనసులే
ఎటుచూసినా ఉత్తమము
పొందునోయి గౌరవము
స్థిరం కాదు అవరోధము
మేలు కాదు విరోధము
అమూల్యమైన స్నేహమే
నిలుస్తుంది నిరంతరము
విరుద్ధమైన పనులే
మానుకుంటే ఘనులే
ఈ సభ్య సమాజాన
చూడ విశ్వ విజేతలే

ఊతకర్ర సహకారి
---------------------------------------
ఊతకర్ర ఉపయోగము
వృద్ధులకే తెలుసులే!
వారి అవసాన దశలో
అవసరమే ఉందిలే!
మనము కూడా ఊతకర్ర
పెద్దలకు కావాలోయ్!
చూడు చూడు దుడ్డు కర్ర
కాపరులకు మేలోనోయ్!
ఊతమే ఇస్తుందోయ్!
తోడుగా నడుస్తుందోయ్!
పెద్దోళ్లకు ఊతకర్ర
మిత్రునిగా ఉంటుందోయ్!
ఊతకర్ర సహకారి
తిరుగులేని ఉపకారి
దివ్యాంగుల పాలిటదే
నడిపించే నేస్తమదే

స్ఫూర్తి నిచ్చు సుభాషితాలు
--------------------------------------
ఆపదలో సాయము
అభాగ్యులకు న్యాయము
అందేలా చూడాలి
అది మన కర్తవ్యము
వృద్ధులకు అండగా
బలమైన కొండగా
ఉండాలి అందరూ
బ్రతకాలి గొప్పగా
పనికిరాని మాటలు
విలువలేని చేతలు
ఆదిలో తరమాలి
యోధలా నిలవాలి
జ్ఞానంలో మిన్నగా
ఖ్యాతిలో జ్యోతిగా
వెలగాలి జగతిలో
ఎదగాలి బ్రతుకులో

అద్భుతం "అంజూరపు చెట్టు"
-----------------------------------------
అరుదైన అందమైన చెట్టు
అపురూపం అంజూరపు చెట్టు
దాని ఫలాలు అతిమధురము
అందిస్తుంది ఆరోగ్యము
తరువు చూడ మిగుల చిన్నది
వృక్షాల్లోనూ బహు మిన్నది
అమూల్యము అంజూరపు చెట్టు
ఔషద గుణం కల్గియున్నది
అంజూరపు పండ్లు తింటే
ఆరోగ్యమే ఆరోగ్యము
ఆరగించాలోయ్!అనుదినము
సత్ఫాలితాలు అద్భుతము
తలపించు మేడిపండు రూపము
ఉపయోగపడే ఈ వృక్షము
మంచిది చెట్టు ఏదైనా
సంరక్షించు ఇకనైనా
చెట్లను చేయకు నాశనము
భవిత యగును అంధకారము
చేతనైతే పెంచాలోయ్!
నరుకువేయుట మానాలోయ్!
పంచును స్వచ్ఛమైన వాయువు
పెంచును మానవుని ఆయువు
అది అంజూరపు చెటైనా
మరి ఏజాతి తరువైనా

ఆధారభూతుడు దేవుడు
---------------------------------
దేవుడే ఆధారము
నమ్ముకున్న భక్తులకు
సంపూర్ణ ఆనందము
అందించును మనసులకు
పూజిస్తే భక్తితోన
కుమ్మరించును దీవెనలు
దివారాత్రులు సేవలోన
తరిస్తే ఎన్నో మేలులు
విశ్వాసముండాలోయ్!
భగవంతుని చేరుటకు
అనిశము స్మరించాలోయ్!
మనశ్శాంతిని పొందుటకు
ఆధ్యాత్మిక చింతనతో
దినదినమూ గడపాలోయ్!
పారమార్ధిక విషయాల్లో
దీక్షతో ఉండాలోయ్!
-గద్వాల సోమన్న
Comments