top of page
Original.png

పారిజాతమా! సుపుష్ప జాతమా!

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ParijathamaSupushpaJathama, #పారిజాతమాసుపుష్ప జాతమా


ree

Parijathama Supushpa Jathama - New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 16/11/2025

పారిజాతమా! సుపుష్ప జాతమా! - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


సుమనోరంజితమా! సువాసిని పూజితమా!

సత్వగుణ రంజితయై  ఊర్థ్వభాగం  ధవళ రంగుతో  మెరిసె.

రజోగుణ రంజితయై  అథోభాగం ఎరుపు రంగుతో  మెరిసె. 

పరిమళ సువాసనతో  తమోగుణం శోభిల్లె. 

త్రిగుణ రంజితయైన  ‘మనసు’ అనే పుష్పంతో  దేవదేవుని  కంఠహారమాయె.

ద్వివర్ణ శోభిత  నీదు  సుందర మాల  మాధవునికెంతో  ప్రీతి. 

సువాసన, సుమనోహర రూపమై  సుదతి మనసుల దోచె. 

ఇంతులెందరో  నీ నామంతో  తరించె. 

నీకై సత్యభామ అలుక వహించి  రుక్మిణిపై   ఈర్ష్య చూపె.

సతుల  మధ్యన  సతమతమాయె మాధవుడు.

అమరుని మెప్పించి  భువికేగిన అరుదైన  పుష్పరాజమా!

పరిమళ సువాసనతో  దిగంతాలు నీవు  వ్యాప్తి చెందె.   

దేవలోకం నుంచి  దిగివచ్చిన   ఓ దేవతాపుష్పమా!

అగ్రపూజలందుకున్న  అమోఘ పుష్పము  నీవు. 

భువిన ఎన్ని  పూజాతులున్నా  దేవజాతివి నీవే.

పుష్పాలలో  మహరాణివి  నీవే.

సరితూగదు ఏ పుష్పము  నీకు.

భక్తిలో, ముక్తిలో  సాటిలేదు నీకు. 

   

…..నీరజ హరి ప్రభల. 



ree

-నీరజ  హరి ప్రభల

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page