నిశ్శబ్దపు రోదన
- Munipalle Vasundhara Rani
- 5 hours ago
- 2 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Nissabdapu Rodana - New Telugu Poem Written By Vasundhara Rani Munipalle
Published in manatelugukathalu.com on 06/01/2026
నిశ్శబ్దపు రోదన - తెలుగు కవిత
రచన: వసుంధర రాణి మునిపల్లె
పైన శాంతంగా కనిపిస్తున్నా.. నా లోపల
బద్దలవుతున్న అగ్నిపర్వతాలు ఎవరికి కనిపిస్తాయి?
నవ్వుతూ తిరుగుతున్నానని లోకం అనుకుంటుంది
కానీ అనుక్షణం నేను ఎదుర్కొనే యుద్ధాలు ఎవరికి తెలుస్తాయి?
ఆవిడ వల్లే నా జీవితం నాశనమయ్యింది,
ఐనా ఏమీ తెలియనట్టు అమాయకురాలిలా ఆవిడ నటిస్తుంది!
తప్పు చేసి ఏమీ తెలియనట్టు ఆవిడ నటించడం,
దానిని లోకం నమ్మడం.. నాకో మానసిక నరకం!
ఆవిడ ఒంటరిగా ఉందన్న బాధ అప్పుడప్పుడు కలిగినా..
ఆవిడతో కలిసి ఉండటమనే నరకం కంటే అది పెద్దదేమీ కాదు!
వయసును అడ్డుపెట్టుకుని ఆవిడ ఆడే నాటకం..
ఆవిడ అసలు సంగతి తెలిసిన వారికే అర్థమవుతుంది!
ఆమె కన్నీరు చూసి లోకం జాలి పడుతోంది,
నా గుండె రగులుతుంటే అది నాటకమని నవ్వుతోంది!
దివ్వె వెలుగు కోసం నేనేమీ ఆశ పడటం లేదు..
నా బతుకు దివ్వె ఇక వెలగదని నాకు తెలుసు.
నన్ను దాటించే నావ ఏదని నేనేమీ వెతకడం లేదు..
ఆ నావ ఎప్పుడో మునిగిపోయిందని నాకు బాగా తెలుసు.
గతాన్ని మోస్తూ, వర్తమానంలో పోరాడుతున్నా..
కానీ 'రేపు' అన్నది నాకైతే ఒక పెద్ద ప్రశ్నార్థకం.
దిక్కులేని బతుకున దిక్కులన్నీ మూసుకుపోయాయి
కన్నవారు లేక, కడుపున పుట్టిన వారు అర్థం చేసుకోక..
నలుగురిలో ఉన్నా నలిగిపోయే ఈ మౌనం
ముగింపు లేని పోరాటంలా సాగుతోంది నా జీవనం.

మమతల కోవెల
---------------------------------------
కన్నవారి కమ్మని దీవెనలు తోడై,
వారి చల్లని దయ మాకు నీడై..
ఈ ఇంటి పునాదికి ప్రాణం పోశాయి,
మా కలల సౌధాన్ని నిలబెట్టి చూశాయి!
భౌతికంగా దూరమైనా.. గుండెల్లో కొలువైన,
నా భర్త కష్ట ఫలితం మమ్మల్ని దీవించింది..
ఆయన చూపిన ఆ అపారమైన ప్రేమ,
వరమై మమ్మల్ని వరించింది!
ఆయన జ్ఞాపకమే మా ఇంటి దివ్య జ్యోతి,
మా ప్రతి అడుగుకు అది ఒక విజయ స్ఫూర్తి!
ధైర్యమై నిలిచిన కూతురి సంకల్పం,
మా ఈ చిన్న గూడు సాకారమైన సత్ఫలితం..
కుటుంబంపై కుమారుడు చూపే ఆత్మీయత,
మా అందరి అండగా నిలిచిన మమత!
మా పురోభివృద్ధిని ఓర్వలేని వారి ఏడ్పులే,
మాకు శ్రీరామరక్షై మమ్మల్ని కాపాడాలి..
కన్నెర్ర చేసే దిష్టి మాపై పడకుండా,
ఏ కీడూ మా వాకిలి దాటి లోపలికి రాకుండా..
ఆ దేవుడి చల్లని చూపు మాపై ఉండాలి,
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మా ఇల్లు విలసిల్లాలి!
***
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.
