top of page

పరిష్కార మార్గము

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ParishkaraMargamu, #పరిష్కారమార్గము, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు


ree

సోమన్న గారి కవితలు పార్ట్ 109


Parishkara Margamu - Somanna Gari Kavithalu Part 109 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 16/08/2025

పరిష్కార మార్గము - సోమన్న గారి కవితలు పార్ట్ 109 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


పరిష్కార మార్గము

------------------------

సంభవిస్తే కష్టాలు

దాపురిస్తే నష్టాలు

వెదకాలోయ్! గట్టేక్కే

పరిష్కార మార్గాలు


కన్నీరు కాదు కాదు

సమస్యలకు జవాబు

గుండె ధైర్యం కావాలి

తొలగు యోచన రావాలి


కుమిలి కుమిలి ఏడిస్తే

ప్రయోజనం శూన్యమే

సింగమై గర్జిస్తే

గెలుపు పాదక్రాంతమే


ప్రతి ప్రశ్నకు సమాధానము

సమస్యలకు పరిష్కారము

తప్పకుండా ఉంటుంది

చరిత్ర ఇదే చెబుతుంది

ree











ఉండాలి అందరూ

---------------------------------------

తెలుగులా తీయగా

వెలుగులా గొప్పగా

ఉండాలి అందరూ

గెలుపులా స్ఫూర్తిగా


పూవులా మెత్తగా

నగవులా సొగసుగా

ఉండాలి అందరూ

వెన్నలా మృదువుగా


చుక్కలా కాంతిగా

మొక్కలా ముద్దుగా

ఉండాలి అందరూ

అమ్నలా ప్రేమగా


బువ్వలా శక్తిగా

అవ్వలా యుక్తిగా

ఉండాలి అందరూ

గువ్వలా స్వేచ్ఛగా


ree












అమ్మ సుబోధ

--------------------------------------

ఉన్న ఊరు ఘనతను

కన్నవారి ప్రేమను

అన్ని చోట్ల చాటాలి

మిన్నగా బ్రతకాలి


మాట యొక్క విలువను

మమకారపు కలువను

మహిని యందు తెలపాలి

మనసులోన నిలపాలి


తరువుల్లా ఫలాలను

గురువుల్లా జ్ఞానమును

పదిమందికి పంచాలి

జ్యోతుల్లా వెలగాలి


చెరుపు చేయు గర్వాన్ని

కురుపులాంటి నైజాన్ని

తక్షణమే వీడాలి

ధరించాలి వినయాన్ని


ree











చూసి నేర్చుకోవాలి

--------------------------------------

ప్రవహించే యేరులను

విహరించే పక్షులను

వికసించే పూవులను

చూసి నేర్చుకోవాలి


రవళించే మువ్వలను

ప్రకాశించు దివ్వెలను

ఆలపించు పికములను

చూసి నేర్చుకోవాలి


భానునిని కిరణాలను

సముద్రపు కెరటాలను

పరిమళించు హారాలను

చూసి నేర్చుకోవాలి


అండ నిలుచు మిత్రులను

దారి చూవు గురువులను

మేలు చేయు తరువులను

చూసి నేర్చుకోవాలి


పొదుపు చేయు చీమలను

క్రమము నేర్పు పెద్దలను

మహిలో మహనీయులను

చూసి నేర్చుకోవాలి


ree










తల్లి విన్నపాలు

--------------------------------------

ఆశయాన్ని పెట్టుకొని

అనురాగం కట్టుకొని

అవనిలోన సాగాలి

కడగండ్లను తట్టుకొని


పెద్ద మనసు చేసుకొని

క్షమాగుణం పెంచుకొని

తప్పులను మన్నించాలి

శత్రుత్వం తరమాలి


దానవత్వం మానుకొని

వ్యక్తిత్వం మలచుకొని

నవలోకం తేవాలి

విశ్వశాంతి కోరాలి


బాధ్యతలు మోసుకొని

పెద్దరికం నిలుపుకొని

హుందాతనం చాటాలి

విజేతగా నిలవాలి


-గద్వాల సోమన్న

Comments


bottom of page