top of page
Original.png

పట్టుదల ఉంటే ఏదైనా, ఎవరైనా సాధించవచ్చును

16 hours ago
3 min read

పట్టుదలతో పత్తి ఒత్తులు తయారు చేసి పొదుపుతో అన్నసత్రం నిర్మించిన రాణి ప్రవల్లిక

Pattudhala Unte Edaina, Evarain Saadinchavachunu - Telugu Moral Story | C. V. S. Mahalakshmi

పట్టుదల ఉంటే ఏదైనా, ఎవరైనా సాధించవచ్చును - తెలుగు నీతి కథ| C. V. S. మహాలక్ష్మి

Published in manatelugukathalu.com on 16/11/2026


పట్టుదలతో పాటు పొదుపు, తెలివితేటలు ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని చెప్పే స్ఫూర్తిదాయకమైన తెలుగు నీతి కథ ఇది. రాణి ప్రవల్లిక తన మాటను ఎలా నిజం చేసిందో ఈ కథలో తెలుసుకుందాం.



అవంతి నగర రాజు రాజశేఖరుడు, అతని భార్య ప్రవల్లిక. ఆ దంపతులు నిత్యం తమ రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులు, మునులు, ఋషులు అందరికీ దానధర్మాలు చేసేవారు.


ఒకనాడు ఒక పేద బ్రాహ్మణుడు ధనసహాయం కోసం వచ్చాడు. రాణిగారు ఒక పెద్ద పళ్ళెం నిండుగా బంగారు నాణెములు ఇచ్చి పంపింది. 


మరల కొన్ని రోజులకు ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ధనసహాయం కోసం వచ్చాడు. 


రాణి గారు మళ్ళీ నవరత్నాలతో, డబ్బుతో ఆయనను సత్కరించి పంపింది.


మరల కొన్ని రోజులకు అదే బ్రాహ్మణుడు మళ్ళీ ధనసహాయం కొరకు రాణిగారి వద్దకు వస్తాడు. 


అప్పుడు రాణి ఆయనతో ఇలా అంటుంది: "గవ్వంత పత్తి ఉంటే కంచి అంత కాపురం చేయవచ్చును.


ఇంత ధనం ఇచ్చినా మీ దారిద్ర్యం పోలేదా?" అని అంటూ ధనసహాయం చేసి పంపించింది. 


అది అప్పుడే అక్కడికి వచ్చిన రాజుగారు విన్నారు. రాణి బ్రాహ్మణుని అలా అందనే కోపం వచ్చింది.


"అయితే నీవు చేయగలవా గవ్వంత పత్తితో కంచి అంత కాపురం?" అని అడుగుతాడు. దానికి రాణి "ఇంటి ఇల్లాలు పొదుపుగా సంసారం చేస్తే ఏదైనా చేయగలదు" అని సమాధానం చెపుతుంది.


ఒకనాటి అర్ధరాత్రి రాణిగారు మంచి నిదురలో ఉండగా ఆమె పక్కన గవ్వంత పత్తిని ఉంచి, మంచంతో పాటుగా అడవిలో విడిచిపెట్టమని భటులకు ఆజ్ఞ ఇస్తాడు. 


తెల్లవారి లేచి చూసుకున్న రాణికి గవ్వ, పత్తి చూసి విషయం అంతా అర్థం అవుతుంది. ఎలాగైనా సాధించి చూపించాలని నిర్ణయం తీసుకుంటుంది.


అడవిలో ఒక చిన్న బాబును చేరదీసి, ఆ గవ్వంత పత్తితో ఒత్తులు చేసి ఆ బాబుకి ఇచ్చి గుడి వద్ద అమ్మి సొమ్ము తెమ్మంది. 


అమ్మగా వచ్చిన సొమ్ములో పదిశాతం పొదుపు డిబ్బీలో వేసి, మిగిలిన సొమ్ములో సగం సొమ్ముతో పత్తి కొని, ఇంకా నీ దగ్గర ఉన్న సొమ్ముతో మనకు నిత్యావసర వస్తువులు కొని తీసుకుని రా అని చెప్పింది.


ఆ బాబు అలాగే చేశాడు. రెండో సారి కొని తెచ్చిన 4 గవ్వలంత పత్తితో మళ్ళీ ఒత్తులు చేసి బాబుతో గుడి వద్ద అమ్మించింది. 


ఈసారి మొదటి సారి కన్నా నాలుగు రెట్లు ఆదాయం వచ్చింది. అప్పుడు ఆదాయంలో నాలుగో వంతు పొదుపు చేసి, ఒక వంతు సొమ్ముతో నిత్యావసర వస్తువులు కొని, మిగిలిన సగం సొమ్ముతో మళ్ళీ పత్తి కొని తెమ్మంది. 


ఈసారి 8 గవ్వలంత పత్తి వచ్చింది. ఒత్తులు ఎక్కువగా వచ్చాయి. ఆదాయం పెరిగింది. 


అంచెలంచెలుగా ఆదాయం, పొదుపు రెండూ పెరిగాయి. ఇదే విధంగా ఇద్దరూ కలిసి పొదుపు చేసిన సొమ్ముతో ఆ అడవిలో ఒక పెద్ద ఇల్లు కట్టుకుని బాటసారులకు అన్నసత్రం పెట్టారు.


ఒకనాడు అవంతి నగర రాజు రాజశేఖరుడు ఈ అడవికి వారి భటులతో కలిసి వేటకు వచ్చాడు. 


అలసిపోయి ఆకలి దాహంతో ఉండగా దూరంగా కనబడిన పెద్ద భవనం చూసి, "ఇంత అడవిలో ఎవరు ఉన్నారు? ఏమైనా తినడానికి దొరుకుతుందేమో" అని అక్కడికి వెళతారు. అక్కడ అందరికీ చక్కటి భోజనాలు పెడతారు.


రాజు అక్కడ ఉన్న బాబుతో "ఈ ఇల్లు ఎవరిది?" అని అడుగుతాడు. దానికి ఆ పిల్లవాడు అక్కడ గోడపై ఉన్న రాణి ప్రవల్లిక చిత్రపటాన్ని చూపాడు. 


అది చూసిన వెంటనే రాజుగారు తన భార్యను గుర్తుపట్టి, ఆమెను కలిసి మాట్లాడి, తాను ఓడిపోయానని, "ఇల్లాలు తలచుకుంటే ఏదైనా చేయగలదని నీవు అన్న మాట నిజమే" అని, దయచేసి తనతో పాటు రాజ్యానికి తిరిగి రమ్మని కోరతాడు. 


దానికి రాణి సరే అని, అడవిలో కట్టిన భవనం, అన్నసత్రం, ధనం అన్నింటినీ తనతో పాటు ఇన్నాళ్లు ఉన్న బాబుకి అప్పగించి రాజుతో కలిసి రాజ్యానికి వెళ్ళిపోతుంది.


నీతి: పట్టుదల ఉంటే ఏదైనా, ఎవరైనా సాధించవచ్చును.










📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


C. V. S. మహాలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: C. V. S. మహాలక్ష్మి



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page