'Pellam Oka Manasunna Manishe' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 12/10/2023
'పెళ్ళాం.. ఒక మనసున్న మనిషే' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఒసేయ్! కావ్య! ఎక్కడున్నావే? నీ భర్త గారు ఆఫీస్ నుంచి ఇంటి కొచ్చి ఇంత సేపైనా.. ఒక కప్పు కాఫీ ఇవ్వాలని లేదే నా పెళ్ళానికి... కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు కుడా ఇవ్వలేదే!... ఇంత అరుస్తున్నా... ఆ వంటింట్లో ఎక్కడో... కూర్చొని ఫోన్ చూస్తున్నావా! ఏమిటే మహారాణి!" ఆ అరుపులకి ఇల్లంతా అదిరిపోయింది...
కావ్య... కంట్లో నీళ్ళతో.... గ్లాసు తో నీళ్ళు తెచ్చి భర్త కు ఇచ్చింది.
నీళ్ళు తాగిన తర్వాత...
"తినడానికి ఎవరు తెస్తారు? అసలే అలసిపోయి వచ్చాను.. కాఫీ తో పాటు ఏమైనా తినడానికి ఇవ్వొచ్చు గా... అన్నీ చెప్పాలా?... పేరుకు వెనుక అరడజను డిగ్రీ లతో మాకు అంటగట్టారు పెళ్ళి చేసి... మీ తల్లి దండ్రులు నేర్పించలేదా? మొగుడికి ఎలా సేవలు చెయ్యాలో... అంత చదువుకుని ఏమిటి ప్రయోజనం?"
కావ్య... ఈలోపు వేడిగా పకోడీ... వేయించి, కప్పు తో కాఫీ తెచ్చి.. టేబుల్ పైన పెట్టింది...
"పకోడీ ఇంత వేడిగా ఇస్తారా?... చెయ్యి కాలిపోతుంది... కొంచం చలార్చి ఇస్తే.. నీ సొమ్ము ఏమైనా పోతుందా? కాఫీ చూడు చల్లగా అయిపోయింది... వేడి చేసి తీసుకుని రా... !"
రోజూ.. ఇన్ని మాటలు భర్త అంటున్నా... కావ్య... మాత్రం ఏమీ అనదు.. తనలో తాను సర్దుకుపోతుంది.. తన బాధ తల్లిదండ్రులకు చెప్పుకోలేదు.. అత్తమామలకు చెప్పుకున్నా... తననే తిడతారు... మౌనంగా భరిస్తుంది.. ఎప్పటికైనా.. భర్త మరకపోడా అని ఒక నమ్మకం, అంతే...
కావ్య కు కిరణ్ తో పెళ్ళయి రెండు సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైననాటి నుంచి కిరణ్ ది ఇదే ధోరణి... కొంచం కోపం ఎక్కువని సరిపెట్టుకుంది కావ్య. ఉదయం లేచిన దగ్గరనుంచి... మొగుడికి సేవలు చెయ్యడం... అదే రొటీన్ అయిపోయింది... తనకి ఉద్యోగం చెయ్యాలని ఉన్నా... భర్త ఎప్పుడు ఒప్పుకునే వాడు కాదు. పైగా... ‘థర్మామీటర్ కున్నన్ని డిగ్రీలు ఉన్నాయి నీకు... ఏమిటి ఉపయోగం’ అని ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు కిరణ్.
ఇలా ఉండగా.. ఒక రోజు.. ఇంటి ముందు క్యాబ్ ఆగింది. ఎవరొచ్చారో అని బయటకు వచ్చి చూసాడు కిరణ్. చూస్తే, తన చెల్లెలు రూప లగేజ్ తో సహా వచ్చింది. లగేజ్ కిందకు దించి... క్యాబ్ కు పే చేసి వస్తుంటే, కిరణ్ వచ్చి..
"రూప! ఏమిటి ఇలా వచ్చావు? లగేజ్ చూస్తే చాలా బరువుగా కూడా ఉంది... ఏమిటి విషయం?... మీ అయన వెనుక వస్తున్నారా?"
దేనికీ సమాధానం చెప్పకుండా... లోపలికి వెళ్లిపోయింది రూప.
"సమాధానం ఏది రూప? ఏం జరిగింది చెప్పు?"
"అన్నయ్యా! నేను ఇంక మా ఆయనతో ఉండాలని అనుకోవట్లేదు.. "
"ఎందుకో?"
"ఎప్పుడూ.. ఆయన నన్ను తిడుతూ ఉంటారు... అన్నిటికి వంకలు పెడతారు... నన్ను అమ్మ నాన్న సరిగ్గా పెంచలేదంట... రోజూ ఇలాగే తిడుతూ ఉంటారు... నేను ఇంక వెళ్ళను.. "
"అదేమిటి అలాగంటావు!.. బావగారితో నేను మాట్లాడతాను.. నువ్వు వెళ్ళు.. మంచి జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు?"
"నువ్వు వదిన తో ఎలా ఉంటావో నాకు తెలుసు... మా ఆయనా అంతే!.. చెప్పాలంటే.. ఈ మొగుళ్ళు అందరూ పెళ్ళాలను ఇలాగే చూస్తారేమో! ముందు నువ్వు మారి.. అప్పుడు... మా ఆయన గురించి ఆలోచించు" అనేసింది రూప
ఆ మాటలు విన్న... కిరణ్ కు చాలా బాధ అనిపించింది. తాను చేసిన తప్పులు ఏమిటో తెలిసింది. పెళ్ళాన్ని ఎప్పుడూ తిట్టడం కాదు.. ప్రేమగా చూసుకోవాలి అని అర్ధమైంది..
ఇదంతా... ఒక పక్కనుంచి కావ్య... చూస్తునే వుంది... ఏమీ అనలేని పరిస్థితి తనది..
కిరణ్ తన తప్పు తెలుసుకుని... కావ్య దగ్గరకు వచ్చి...
"కావ్యా! నన్ను క్షమించు! నిన్ను చాలా బాధపెట్టాను…” అని చేతులు పట్టుకుని వేడుకున్నాడు... “నిన్ను ఇక మీదట బాగా చూసుకుంటాను... " అని బ్రతిమాలాడు..
భర్త దీనంగా మాట్లాడడం గమనించింది కావ్య! తన ఏడుపు ముఖంలో చిరునవ్వు వికసించింది...
"ఏమండీ! మీరు నన్ను బాగా చూసుకుంటే చాలు... ఈ క్షమాపణలు అవీ వద్దు.. "
"అలాగే కావ్య!"
కావ్య... తను ఉహించుకున్న... జీవితం దొరకనుందని.... చాలా ఆనందపడింది..
కిరణ్ చెల్లెలు... ఇంక నాటకం ముగించింది...
“నేను అబద్ధం చెప్పాను అన్నయ్యా! మా అయన నన్ను చాలా బాగా చూసుకుంటారు... నిన్ను మార్చడానికే ఈ నాటకం... నువ్వు మారినందుకు చాలా హ్యాపీ!” అంది నవ్వుతూ.
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments