పెళ్ళి కానుక

'Pelli Kanuka' - New Telugu Story Written By Mohana Krishna Tata
'పెళ్ళి కానుక' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
ఫోన్ రింగ్ అవుతోంది..
"హలో! చెప్పవే సునీత"
"ఏంటి చెప్పేది! ఇంకా బయల్దేరలేదా?"
"ఎక్కడికి తల్లి"
"నా బారసాల కే.. "
"జోకులు మళ్ళీను"
"అవునే మరి.. పెళ్ళికి పిలిచి ఎన్ని రోజులైందే? ఇంకా స్టార్ట్ అవలేదా?"
"నీ పెళ్లెప్పుడే?.. ఇంకా వారం ఉందిగా.. " అంది పూజ.
"వారం ముందే రమ్మన్నాను కదే!"
"స్టార్ట్ అవుతున్నామే.. వదిలేయ్ మమల్ని"
"వినండి ఫ్రెండ్స్! మన ఫ్రెండ్ సునీత పెళ్ళికి పిలిచింది మనందరినీ.. "
"అయితే ఏం చేద్దాం చెప్పవే పూజ" అడిగింది లావణ్య
"వినండి.. లావణ్య, కీర్తన, జయ.. మనం నలుగురం రేపు రాత్రికి స్టార్ట్ అవుదాం.. లేకపోతే తినేస్తుంది సునీత"
"అలాగే!"
"మనం ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదే!.. ఏమీ కొనలేదు"
"ఏమీ కొనడం లేదు"
"మా ఇంట్లో ఫంక్షన్ కి పిలిస్తే, ఒక చిన్న పది రూపాయల చాక్లెట్ తీసుకుని వచ్చి ఇచ్చింది.. ఏమని అడిగితే.. ‘నీకు చాక్లెట్ ఇష్టం కదా’ అంది ఆ సునీత”
"నేను చెప్పినట్టు గిఫ్ట్ ప్యాక్ చెయ్యండి ఫ్రెండ్స్. మన పెళ్ళి కానుక అదిరిపోవాలి!"
అనుకున్న ప్రకారం ఫ్రెండ్స్ అందరూ.. గిఫ్ట్ ను ప్యాక్ చేసి.. రాత్రి బస్సు లో సునీత ఊరు కు బయల్దేరారు. బస్సు స్టార్ట్ అవబోతుంది..
"ఒసేయ్ పూజ! ఏమిటే.. ఈ బస్సు బుక్ చేసావు.. ఒక ఏసీ లేదు ఏమి లేదు"
"దాని పెళ్ళికి ఏసీ ఎందుకే దండగ" బదులిచ్చింది పూజ.
"మనకే కదా! ఇప్పుడు ఉక్క"
"విండో ఓపెన్ చేసి పడుకోండి. ఇంకా కావాలంటే, నైటీ వేసుకుని పడుకోండి"
"నీ రివెంజ్ పాడుగాను.. ఏమిటే మాకు ఈ కష్టాలు.. "
"బస్సు డిపో వచ్చిందే.. ఇక్కడ బస్సు అరగంట ఆగుతుంది. నేను ఇప్పుడే వస్తానే..” అంది పూజ.
"ఎక్కడికే!.. నేనూ వస్తాను..” అంది లావణ్య.
"ఏమండి.. చాక్లెట్లు ఉన్నాయా?"
"ఉన్నాయ్" అన్నాడు షాపువాడు.
"ఇది 200 , ఇది 100 , ఇది 50 ఇంకా కాస్ట్‌లీ వి కూడా ఉన్నాయి"
"అన్నింటికన్నా తక్కువ ఎంత?"
"ఇవిగోండి.. రూపాయికి రెండు"
"ఇవే కావాలి.. ఇవ్వండి"
"అమ్మాయిలు చూస్తే, జీన్స్.. టి-షర్టు.. రిచ్ గా ఉన్నారు.. చీప్ గా అర్ధరూపాయి చాక్లెట్లు.. ఏమిటో?" అనుకున్నాడు షాపువాడు.
"ఇంకేమైనా కావాలా చెప్పండి" అడిగింది పూజ.
"ఇప్పుడేమి వద్దు"
"ఒక గంట లో వెళ్ళిపోతాము ఊరు.. అక్కడ తిందాం"
"సునీత పెడుతుంది.. విందు భోజనం.. తినండి" అని వెటకారం చేసింది పూజ.
"కొంచం కూల్ అవేవీ.. మనం ట్రిప్ ఎంజాయ్ చెయ్యడానికి వచ్చాము. చీర్ ఫ్రెండ్స్ " అంది .
తెల్లారింది.. బస్సు దిగాల్సిన స్టాప్ కు చేరుకుంది.. అందరు దిగి సునీత ఇంటికి బయల్దేరారు.
***
"ఏమే పెళ్లికూతురు.. ఎలా ఉన్నావు?"
"మొత్తానికి ఫోన్ చేస్తే గాని రాలేదు"
"అలాగంటావేంటీ.. పెళ్ళి పనులు ఎక్కడ వరకు వచ్చాయి చెప్పు"
"అవుతున్నాయి.. "
పెళ్ళి ముహూర్తం లో పెళ్ళి చాలా గ్రాండ్ గా జరిగింది. అందరూ కానుకలు చదివిస్తున్నారు..
"పూజ! వెళ్లవే.. నీ పెళ్ళి కానుక ప్యాక్ చేశావు కదా!.. ఇచ్చేయి.. " అన్నారు ఫ్రెండ్స్.
"అందరూ రండి.. ఇద్దాం.. " అంది పూజ.
"అందులో ఏముందో మాకు తెలుసు.. భయమే మాకు.. "
"ఏముంది?"
"నాకేమో అది పది రూపాయల చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చింది.. నేనేమో అర్ధరూపాయి చాక్లెట్ గిఫ్ట్ ఇస్తున్నాను అంతే.. "
"అదేనే మా భయం.. ఎవరైనా చూస్తే?"
"చూసే టైం కి మనం ఇక్కడ ఉండమే.. పేరు.. అడ్రస్.. రాసి పెడతామేమిటి.. చెప్పు"
"మరి వీడియో.. ఫొటోస్ ఉంటాయి కదా!"
"వాళ్ళు లేనప్పుడే ఇస్తాము సైలెంట్ గా" చెప్పింది పూజ.
అందరు వెళ్ళి.. సైలెంట్ గా గిఫ్ట్ ఇచ్చేసి వచ్చారు. పెళ్ళి హడావిడి అయిపొయింది..
"మేము ఇంక స్టార్ట్ అవుతామే సునీత.. నువ్వు ఇంక బిజీ గా ఉంటావు కదా" అంది పూజ.
"అదేంటే!.. రాత్రి మనం గిఫ్ట్స్ చూద్దాం.. నాకు వచ్చిన ఆ గిఫ్ట్స్ చూడవా చెప్పు?"
"ఎందుకే.. మీరు చూసుకోండి.. మాకు రేపు కాలేజీ లో ప్రాక్టికల్స్ ఉన్నాయి"
"ఉండవే.. రేపు ఉదయం బస్సు కు పంపిస్తాను లేవే" రిక్వెస్ట్ చేసింది సునీత.
‘ఇరుకున్నామే మనం..’ అనుకున్నారు నలుగురు ఫ్రెండ్స్.
గిఫ్ట్స్ ఒక్కొకటి గా ఓపెన్ చేస్తున్నారు.. పెద్ద పెద్ద గిఫ్ట్స్.. ఖరీదైన గిఫ్ట్స్ వచ్చాయి.. అని అందరు అనుకుంటున్నారు..
మా ఫ్రెండ్స్ ఇంకా ఖరీదైన గిఫ్ట్ ఇస్తారు.. చూడండి అని.. ఫ్రెండ్స్ గిఫ్ట్ తీసింది సునీత..
"మన గిఫ్ట్ అని ఎలా తెలిసిందే?"
"నేను చెబుతానే! "అన్నది సునీత. “మా బామ్మ చూసిందే.. "
"ఓసి బామ్మ.. "
"సునీత గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది.. కవర్ తీసింది.. గిఫ్ చాలా పెద్ద సైజు లో ఉంది.. " అనుకుంది సునీత.
‘నాకు బాత్రూమ్ వస్తోంది..’ అని ఫ్రెండ్స్ ఒక్కొకరు జారుకుంటున్నారు. పూజ మటుకు వెళ్ళలేని పరిస్థితి..
"ఒక చాక్లెట్.. నా నోరు తీపి చేసుకోమని.. ఇచ్చింది నా ఫ్రెండ్.. "
"పెద్ద చాక్లెట్ ఇవ్వొచ్చు గా".. అంది బామ్మ.
"షుగర్ ఎక్కువ తినడం మంచిది కాదని.. నా గురించి ఆలోచించింది నా ఫ్రెండ్.. " బదులిచ్చింది సునీత.
లోపల చాలా పేపర్స్ ఉన్నాయి.. అంటే ఏదో ఇంపార్టెంట్ ఉంది..
“తీయవే తొందరగా..” అన్నది బామ్మ..
"ఒక ఉంగరం.. బంగారు ఉంగరం.. "
అందరు చప్పట్లు కొట్టారు..
"థాంక్స్ పూజ.. "
"కానీ.. నేను.. " అనబోయింది పూజ.
"మన స్నేహం.. మీరిచ్చే గిఫ్ట్స్ కన్నా చాలా విలువైంది.. అందుకే ఆ ఉంగరం నేనే వేసాను.. ఇది అందరి కోసం చేసింది.. "
"నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా.. నువ్వు మా పరువు కాపాడావు.. " అంది పూజ.
"మీరు నాకిచ్చే నిజమైన పెళ్ళి కానుక ఏమిటో తెలుసా ఫ్రెండ్స్.. చిరకాల మన స్నేహం.. " అంది సునీత.
******************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
https://www.manatelugukathalu.com/profile/mohanakrishna
Youtube Play List Link:
https://www.youtube.com/playlist?list=PLUnPHTES7xZqBiHIEhQgw3iQJWx6Vverc
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ