top of page
Original.png

పిల్లి ఎలుక స్నేహం


పిల్లి ఎలుక స్నేహం తెలుగు నీతి కథలో కిరాణా కొట్టులో స్నేహితులుగా మారిన పిల్లి మరియు ఎలుక

Pilli Eluka Sneham - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

పిల్లి ఎలుక స్నేహం - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 04/09/2026


పిల్లి, ఎలుక సహజంగా శత్రువులు. కానీ అన్యాయంగా వ్యాపారం చేస్తున్న వర్తకుడిని మార్చేందుకు అవి స్నేహితులైతే? రాళ్లబండి సంగంనాయుడు రచించిన సందేశాత్మక తెలుగు నీతి కథ ‘పిల్లి ఎలుక స్నేహం’.



అనగనగా ఒక వర్తకుడు ఉండేవాడు. అతని కిరాణా కొట్టులో ఒక ఎలుక ఉం

డేది. వర్తకుని సామానులున్న బస్తాలకు కన్నాలు చేసి సరుకులు తినేసేది. అంతేకాదు, కొన్ని సరుకులను నాశనం చేసేది. వర్తకుడు పిల్లి బాధ పడలేక తలపట్టుకున్నాడు. అప్పుడు వర్తకుని భార్య, ఎలుకుల మందు పెట్టి ఎలుకను చంపమని వర్తకునికి సలహా చెప్పింది. ఎలుకల మందు పెట్టి చాలా సార్లు ఎలుకను చంపాలని చూశాడు వర్తకుడు. కానీ, అన్ని సార్లు ఎలుక తప్పించుకుంది. 


వర్తకునికి వ్యాపారంలో చాలా నష్టం వస్తుంది. ఈ ఎలుక బెడద తప్పాలంటే పిల్లిని పెంచటమే మార్గమని ఒక పిల్లిని తెచ్చి పెంచసాగాడు. పిల్లి స్వామిభక్తితో ఒకసారి తన కంట పడ్డ ఎలుకను చంపబోయింది. 


అప్పుడు ఎలుక ఇలా చెప్పింది: "ఆగు మిత్రమా! మనమిద్దరం మిత్రులం. వ్యాపారి పిసినారి. ఎవరికీ పైసా దానం చేయడు. అత్యాశపరుడు. వ్యాపారి వ్యాపారం న్యాయమార్గంలో చెయ్యట్లేదు. సరుకులు కల్తీ చేస్తున్నాడు. సరుకుల ధరలు ఎక్కువ. ప్రజలకు నష్టం కలిగిస్తున్న వ్యాపారి సరుకులు నేనందుకే నాశనం చేస్తున్నాను. వ్యాపారం న్యాయమార్గంలో సాగితే నేను వేరే చోటుకి పోతాను" అంది.


తన వైరి జంతువు తనను మిత్రమా అనటం పిల్లికి భలే నచ్చింది. తన యజమాని అన్నం కూడా సరిగా పెట్టటం లేదు మరి. అంతేకాకుండా ఎలుక చెప్పిన మాటలు నూటికి నూరు నిజం. సమాజం కోసం ఎలుకతో స్నేహం చేయాలనుకుంది పిల్లి. మంచి కోసం యజమానిని మోసం చేసినా పర్లేదు. పిల్లి, ఎలుక చేతులు కలిపాయి.


పిల్లి వచ్చినా ఎలుక బెడద తప్పలేదని, పిల్లికి అన్నం పెట్టడం దండగ అని వ్యాపారి పిల్లికి అన్నం పెట్టడం మానేశాడు. ఎలుక కొట్టులోని పాలు, పెరుగు దొంగిలించి పిల్లికిచ్చేది. ఎలుక, పిల్లి కలిసి వ్యాపారికి ఎక్కువ మొత్తంలో నష్టం కలిగించటం మొదలెట్టాయి. పిల్లి, వ్యాపారికి చుక్కలు చూపించాయి. విషయం వ్యాపారికి అర్థమైంది. పిల్లితో వ్యాపారి, "నా వ్యాపారానికి ఎందుకు నష్టం కలిగిస్తున్నావు? ఎలుకను ఎందుకు చంపలేదు? అన్నం పెట్టే చేతిని కరవటం ధర్మమా?" అన్నాడు.


పిల్లి వ్యాపారి సమాజానికి చేస్తున్న నష్టాన్ని వివరించింది. ఈ దొంగ వ్యాపారం ఆపకపోతే మరింత నష్టం చేస్తామంది. "వ్యాపారి మారకపోతే, పిల్లులు, ఎలుకలను మరిన్ని తెచ్చి వ్యాపారం సాగనీయం" అంది పిల్లి. పిల్లి అన్నంత పని చేస్తుందని వ్యాపారి న్యాయ మార్గంలో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. వ్యాపారిలో వచ్చిన మార్పుకు సంతోషించిన ఎలుక ఆ కొట్టు వదిలి పొలాల్లోకి పోయింది. పిల్లి వ్యాపారి వద్దే ఉండిపోయింది.


*** 

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.


మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page