top of page
Original.png

శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయం - హిమాచల్ ప్రదేశ్ యాత్ర


హిమాచల్ ప్రదేశ్ కాంగ్రాలోని శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయం మరియు ధౌలాధార్ పర్వతాల మధ్య సాగిన ఆధ్యాత్మిక యాత్ర

Sri Vajreswari Devi Alayam - Himachal Pradesh Yathra - Telugu Piligrimage Story | Annapurna Somayajulu

శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయం - హిమాచల్ ప్రదేశ్ యాత్ర - తెలుగు తీర్థయాత్ర కథ | అన్నపూర్ణ సోమయాజులు

Published in manatelugukathalu.com on 04/09/2026



శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయం - హిమాచల్ ప్రదేశ్ యాత్ర


కాంగ్రా వజ్రేశ్వరి దేవి శక్తిపీఠం నుంచి చాముండా దేవి ఆలయం వరకు—హిమాచల్ పర్వతాల ప్రకృతి సౌందర్యం, పురాణ విశిష్టత, భక్తి అనుభూతులతో కూడిన యాత్రా కథనం.

.


7.8.2026, శుక్రవారం ఉదయమే కాంగ్రా కి బయలుదేరాం. 


హిమాచల్ ప్రదేశ్. 


ఆ హైమవతి తమ ఇంటి ఆడపడుచు అనేమో ఈ హిమాచలములకు ఇంతటి స్వాతిశయం!!


ఆ పర్వతపుత్రిని పలురకాలుగా పొదివి పట్టుకున్నామనేమో ఈ పర్వతాలకు అంతటి రాజసం!!


సాక్షాత్తూ ఆ సౌందర్యలహరి సావాసంలో ఉన్నందువల్లనేమో ఈ కొండలకూ లోయలకూ చూపు మరల్చుకోనివ్వని ఈ చక్కదనం!!


అక్షరాలకు అందని అందం...

పదములలో పొదగలేని ప్రకృతి సౌందర్యం...

సమాసాలకు దొరకని సౌకుమార్యం...

అలంకారాలకే ఆభరణంగా వెలుగొందే ఆభిజాత్యం...

కలగలిసిన సుందర ప్రదేశం.....

వర్ణించపూనుకోవడం, నా స్థాయికి మించిన ప్రయత్నం. ఐనా, పదిమందితో పంచుకోవాలనే తాపత్రయం🙏



ముందుగా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయం చేరాం. 


శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా (ప్రాచీన నామం నాగర్‌కోట్) పట్టణంలో ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన 54 శక్తిపీఠాలలో ఒకటి. 


దక్షయజ్ఞం అనంతరం శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ తాండవం చేయగా, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించినపుడు, 

ఆ శరీర భాగాలలో ఎడమ స్తనం కాంగ్రాలో పడిందని భక్తుల విశ్వాసం.

అందుకే ఈ స్థలం శక్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. 


“వజ్రం” అంటే ఇంద్రుని ఆయుధం. దేవి వజ్రశక్తితో అసురులను సంహరించినందున ఆమెను వజ్రేశ్వరి దేవి అని పిలుస్తారు.


మహాభారత కాలంలో పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక విశ్వాసం ఉంది.

1009లో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దోచుకున్నాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

1905లో జరిగిన భారీ కాంగ్రా భూకంపంలో ఆలయం ధ్వంసమైందట. అనంతరం 1920లలో తిరిగి పునర్నిర్మించబడిందట. 


ఈ ఆలయంలో అమ్మవారు పిండి రూపంలో దర్శనమిస్తారు.

ఆలయ ప్రాంగణంలో భైరవ స్వామి ఆలయం కూడా ఉంది.

వెండి అలంకరణలు, బలమైన ప్రాకారాలు, ప్రత్యేక గోపుర నిర్మాణం..... చూడటానికి రెండు కళ్ళు చాలలేదంటే అతిశయోక్తి కాదేమో!!!


ఈ ఆలయంలో అత్యంత విశిష్టమైన ఆచారం వెన్న అలంకారం.

మహిషాసురుని సంహరించిన తరువాత అమ్మవారికి గాయాలు అయ్యాయట.

వాటికి ఉపశమనంగా వెన్న రాసుకున్నారనే పురాణ కథ ఆధారంగా, మకర సంక్రాంతి సమయంలో అమ్మవారిని వెన్నతో అలంకరిస్తారట. ఈ ఉత్సవం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. 


సాధారణంగా ఉదయం 5:00 నుంచి రాత్రి: 9:30 వరకు ఆలయం తెరిచే ఉంచుతారట.


మధ్యాహ్నం భోజనాలు దారిలోనే ముగించి, సాయంత్రానికి చాముండాదేవి ఆలయానికి చేరాం.


చాముండా దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోనే, పాలంపూర్ సమీపంలో బనేర్ నది ఒడ్డున ఉన్న అత్యంత పవిత్రమైన శక్తి క్షేత్రాలలో ఒకటి. ఇది శక్తి (చాముండా దేవి) మరియు శివుడు (నందికేశ్వరుడు) ఇద్దరికీ అంకితం చేయబడిన విశిష్ట ఆలయం. 


చాముండాదేవి, దుర్గాదేవి యొక్క ఉగ్ర స్వరూపం. దేవీ మహాత్మ్యం ప్రకారం, శుంభ-నిశుంభుల సేనాధిపతులైన చండుడు మరియు ముండుడు అనే రాక్షసులను సంహరించిన తర్వాత ఆమెకు “చాముండా” అనే నామం లభించిందట. 

అందువల్ల ఆమెను దుష్ట సంహారిణిగా, భక్తులను రక్షించే తల్లిగా ఆరాధిస్తారు. 



సుమారు 400 నుంచి 700 సంవత్సరాల క్రితం ఈ ఆలయం ప్రస్తుత స్థలంలో నిర్మించబడినట్లు చెబుతున్నారు. 


ఆలయం వెనుక అద్భుతమైన ధౌలాధార్ పర్వత శ్రేణులు, ఆలయ పక్కనే బనేర్ నది కనువిందు చేస్తాయి.


నందికేశ్వర మహాదేవుని ఆలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది.

ప్రశాంతమైన వాతావరణం, శిల్పకళ, ఉద్యానవనాలు భక్తులను ఆకర్షిస్తాయి. 



భక్తుల నమ్మకం ప్రకారం ఈ చాముండాదేవిని దర్శించుకోవడం వలన శత్రు బాధలు తొలగి, భయం, ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది.

ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి.

కుటుంబ శాంతి మరియు విజయాలు సిద్ధిస్తాయి.


మనఃస్పూర్తిగా నమస్కరించి, రక్షగా ఉండమని కోరుకున్నాం. 


ఈ రూపం అహంకారం, దురాశ, క్రూరత్వం, భయం వంటి అంతర్గత దుష్ప్రవృత్తులను నాశనం చేసే దివ్యశక్తికి ప్రతీకగా భావించబడుతుంది.


ఆధ్యాత్మిక సందేశం, 

మనలోని కామం, క్రోధం, లోభం, అహంకారం వంటి అంతర్గత రాక్షసులను జయించడమే నిజమైన చాముండా దేవి ఆరాధన యొక్క అంతరార్థం.


(సశేషం)

          

***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



అన్నపూర్ణ సోమయాజులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


అన్నపూర్ణ సోమయాజులు

 రచయిత్రి పరిచయం: అన్నపూర్ణ సోమయాజులు

పేరు : అన్నపూర్ణ సోమయాజులు. వెంపటి.

W/o. V.s. somayajulu.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page