top of page
Original.png

పోలయ్య కవి కూకట్లపల్లి అద్భుత నటన - ఘన సన్మానం

6 hours ago
2 min read

పోలయ్య కవి కూకట్లపల్లి అద్భుత నటన - ఘన సన్మానం

Polayya Kavi Kukatlapalliki Adbhutha Natana - Ghana Sanmanam -|Special Telugu Article| Polayya Kavi

పోలయ్య కవి కూకట్లపల్లి అద్భుత నటన - ఘన సన్మానం - తెలుగు వ్యాసం |పోలయ్య కవి

Published In manatelugukathalu.com On 08/11/2026


హైదరాబాద్ రవీంద్రభారతిలో అక్టోబర్ 25, 2026న జరిగిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో ప్రదర్శించిన ‘వాల్మీకి’ లఘునాటికలో షావుకారుగా అద్భుత నటన కనబరిచిన ప్రముఖ కవి, రచయిత, నటుడు పోలయ్య కవి కూకట్లపల్లి ఘన సన్మానం అందుకున్నారు.


"వాల్మీకి" లఘు నాటికలో షావుకారుగా పోలయ్య కవి కూకట్లపల్లి అద్భుత నటన

డాక్టర్ .విడి రాజగోపాల్ గట్టు తిమ్మప్పలచే ఘన సన్మానం...


హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం (25.10.2026) సాయంత్రం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సంస్థ గౌరవాధ్యక్షులు పూర్వ మైన్స్ డైరెక్టర్.  డాక్టర్ విడి రాజగోపాల్ రూపకల్పనతో మాటలు పాటలతో డా. వేము వందనం దర్శకత్వంలో వాల్మీకి లఘునాటిక విజయవంతంగా ప్రదర్శింపబడింది.


సభ ప్రారంభంలో శరత్ చంద్ర సంగీత సారధ్యంలో నోరిదంపతులు రఘురామమూర్తి హేమ కళ్యాణి మరియు అరవ రవీంద్రబాబు శరత్ చంద్ర ఆపాత మధురాలను ఆలపించారు...


చిన్న పిల్లలచే రామాయణ కథా

నృత్య రూపకం ప్రదర్శింపబడింది


తర్వాత సాంబశివా రెడ్డి (రత్నాకరుడిగా)

శ్రీహరి రావు... (వాల్మీకిగా)... కాటంరాజు ...(నారదుడిగా)... నటించారు ఇందులో

ప్రముఖ కవి రచయిత నటుడు, కూకట్లపల్లి పోలయ్య, శ్రీమతి యం. రామలక్ష్మి (పాదాచారులుగా) నటించారు


షావుకారుగా చక్కని నటనను ప్రదర్శించి 

ప్రేక్షకుల ప్రశంసలు అభిమానుల మన్ననలు పొందినందుకు...డాక్టర్ విడి రాజగోపాల్, గట్టు తిమ్మప్ప పోలయ్య కవి కూకట్లపల్లిని ఘనంగా సన్మానించారు


తదనంతరం సభా కార్యక్రమంలో ముఖ్య అతిథి పాల్గొన్న పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ వాల్మీకి లఘునాటికను సినిమా తీయాలన్నారు

సన్మానితులు ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు... సముద్ర... క్రిష్ణారెడ్డి 

డాక్టర్ .విడి రాజగోపాల్ సాహితీ సేవలను శ్లాఘించారు


ఖమ్మం ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ వాల్మీకి భవన నిర్మాణం కోసం 50 లక్షలు ఎంపీలార్డ్స్ కింద ఇవ్వడానికి సుముఖుత వ్యక్తం చేశారు. అనాదిగా అనేక సమస్యలతో సతమతమవుతున్న వాల్మీకి జాతి అభివృద్ధికోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు... వాల్మీకి వారసులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తామన్నారు... గట్టు తిమ్మప్ప తమ వాల్మీకి జాతి అభివృద్ధి కోసం రాజగోపాల్ సహాయ సహకారాలు కావాలన్నారు... పి వి రావు...విడి 

రాజగోపాల్ ను "అభినవ వాల్మీకిగా" వర్ణించారు


చివర సన్మానితులను, ముఖ్య ,విశిష్ట, ఆత్మీయ, అతిథులను లఘునాటికలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించిన నటీనటులందరిని డాక్టర్.విడి రాజగోపాల్... గట్టు తిమ్మప్ప శాలువా మెమోంటోలతో ఘనంగా సన్మానించారు కమ్మని విందు భోజనంతో తీపి జ్ఞాపకాలతో వాల్మీకి జయంతి వేడుక దిగ్విజయంగా ముగిసింది.


"వాల్మీకి" లఘు నాటికలో షావుకారుగా పోలయ్య కవి కూకట్లపల్లి అద్భుత నటన

డాక్టర్ .విడి రాజగోపాల్ గట్టు తిమ్మప్పలచే ఘన సన్మానం...

పోలయ్య కవి

-పోలయ్య కవి




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page