ఎట "కారం"

Etakaram - Telugu Inspirational Article | Kotha Viritha
ఎట "కారం" - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 06/11/2026
“ఎటకారం నవ్వించాలి… నొప్పించకూడదు. చురక పెట్టాలి… చితకబాదకూడదు!”
ఈ ఆసక్తికరమైన అంశాన్ని సరదా ఉదాహరణలతో వివరిస్తున్న కొత్త విరిత గారి హాస్య వ్యంగ్య రచన “ఎట ‘కారం’”.
కూరలో ఉప్పుతో పాటు కారం కూడా చాలా ముఖ్యం… రుచికి మాత్రమే కాదు, తినేవాడి మొహం చిట్లించడానికి కూడా!
ఒక్కసారి కారం లేని కూర తింటున్నట్లు ఊహించుకోండి… “యాక్!” అంటూ మూతి విరిచే ఎక్స్ప్రెషన్ తప్పదు.అలాగే జీవితంలో కూడా కాస్త ఎటకారం అవసరమే… లేకపోతే జీవితం రుచి పచి లేకుండా తయారవుతుంది.
ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకుంటే, చివరికి మనమే మన జీవితానికి కామెడీ అవుతాం.
ఎవరైనా “మీరు చాలా తెలివైనవారు” అంటే వెంటనే పొంగిపోవాల్సిన అవసరం లేదు… ఆ మాటలో "కారం" ఎంతుందో ముందుగా అర్థం చేసుకోవాలి. కొంతమంది పొగడ్తల్లో చక్కెర కంటే వ్యంగ్యమే ఎక్కువగా ఉంటుంది. ఎటకారం అంటే ఎదుటివాడిని అవమానించడం కాదు… నిజాన్ని నవ్వుతూ చురక పెట్టి చూపించే చిన్న అద్దం.
“నాకు అన్నీ తెలుసు” అనుకునేవాళ్లకు ఎటకారం మాత్రం అసలు జీర్ణం కాదు.
వాళ్ల జ్ఞానానికి తోడు అహంకారం కూడా ఉచితంగా వస్తుంది. కష్టాల్లో కూడా నవ్వుకోగలగడం ఓ రకమైన మానసిక బలం. ఎటకారం పరిస్థితుల్ని తేలిక చేయాలి… మనుషుల్ని తక్కువ చేయకూడదు.
కారం మోతాదు దాటితే కూర తినలేం… ఎటకారం మోతాదు దాటితే మనిషితో కలవలేం. అందుకే మాటలో కారం ఉండాలి… కానీ ఎదుటివాడి గుండెల్లో మంట పెట్టేంత కాదు. మనసు మంచిదైతే ఎటకారం నవ్విస్తుంది… మనసు చెడ్డదైతే అదే ఎటకారం గాయపరుస్తుంది. జీవితానికి ఉప్పు కావాలి, కారం కావాలి… మధ్యలో కాస్త ఎటకారం కూడా కావాలి. లేకపోతే జీవితం భోజనం కాదు. .ఆసుపత్రిలో పెట్టే డైట్‌లా ఉంటుంది!
ఎటకారం నవ్వించాలి… నొప్పించకూడదు.
చురక పెట్టాలి…చితకబాదకూడదు.
మాటకు మజా ఉండాలి… మనిషికి గౌరవం ఉండాలి.
అదే అసలైన ఎటకారం…
అదే పక్కనవాడికి మాటలతో చేసే ఉపకారం.
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.










Comments