top of page
Original.png

వరంగల్ లో వాల్మీకి లఘునాటిక ప్రదర్శన - ఘన సన్మానం

6 hours ago
1 min read

వరంగల్ లో వాల్మీకి లఘునాటిక ప్రదర్శన - ఘన సన్మానం

Varangal Lo Valmiki Laghunatika Pradarsana - Ghana Sanmanam -|Special Telugu Article| Polayya Kavi

వరంగల్ లో వాల్మీకి లఘునాటిక ప్రదర్శన - ఘన సన్మానం - తెలుగు వ్యాసం |పోలయ్య కవి

Published In manatelugukathalu.com On 08/11/2026


వరంగల్ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో నవంబర్ 3, 2026న జరిగిన మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాల్లో ‘వాల్మీకి’ లఘునాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. షావుకారు పాత్రలో అద్భుతంగా నటించిన ప్రముఖ కవి, రచయిత పోలయ్య కవి కూకట్లపల్లిని డా. వి.డి. రాజగోపాల్, గట్టు తిమ్మప్ప ఘనంగా సన్మానించారు.


వరంగల్ లో వాల్మీకి లఘునాటిక ప్రదర్శన షావుకారిగా పోలయ్య కవి అద్భుత నటన డాక్టర్ విడి రాజగోపాల్ గట్టు తిమ్మప్పలచే ఘన సన్మానం...


వరంగల్ కాజీపేట మండలం మడికొండ గ్రామంలో మంగళవారం (03.11.2026)

జరిగిన మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాల్లో భాగంగా  హైదరాబాద్ 

వాల్మీకి మహర్షి సాంస్కృతిక సేవా సంస్థ గౌరవాధ్యక్షులు డాక్టర్ వీడి రాజగోపాల్ ఆధ్వర్యంలో వాల్మీకి లఘునాటిక ప్రదర్శన ఘనంగా జరిగింది 


మాటలు పాటలు: డాక్టర్ విడి రాజగోపాల్ 

దర్శకత్వం: వేము వందనం 

సంగీత సారథ్యం: డాక్టర్ శరత్ చంద్ర

పాత్రలు పాత్రధారులు: 

సాంబశివారెడ్డి...రత్నాకరుడిగా

శ్రీహరిరావు...వాల్మీకిగా 

కాటంరాజు... నారదుడిగా 

పోలయ్య కవి కూకట్లపల్లి... షావుకారుగా 

శ్రీమతి మోచర్ల రామలక్ష్మి షావుకారు భార్యగా అత్యద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 


ఈ సందర్భంగా గట్టు తిమ్మప్ప తెలంగాణ ప్రభుత్వ వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్... మైన్స్ ఊర్వ డైరెక్టర్ డాక్టర్ విడి రాజగోపాల్ నటీనటులను ఘనంగా సన్మానించారు. సన్మానగ్రహీత ప్రముఖ కవి రచయిత పోలయ్యకవి కూకట్లపల్లి మాట్లాడుతూ వాల్మీకి లఘునాటికలో తాను షావుగారిగా పాత్రలో లీనమై చక్కగా నటించినందుకు తనను సన్మానించిన ప్రముఖులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

లఘునాటిక అనంతరం గ్రామ ప్రజలకు 

అందరికీ అన్నదానం చేయడం జరిగింది 


ఈ కార్యక్రమానికి ఇంకా  బోయ నగేష్ వైస్ చైర్మన్ జోగులాంబ గ్రంధాలయ చైర్మన్ 

శ్రీనివాస్ బి కృష్ణమూర్తి మడికొండ వాల్మీకి సంఘం నాయకులు సత్యనారాయణ..

బీటవరం శ్రీమన్నారాయణ బహుభాషా 

వేత్త ప్రముఖ కవి... పిట్టల మధుసూదన్

ఎండి మధుమిత్ర ఆర్ట్స్ తదితరులు పాల్గొన్నారు


వరంగల్ లో వాల్మీకి లఘునాటిక ప్రదర్శన షావుకారిగా పోలయ్య కవి



పోలయ్య కవి

-పోలయ్య కవి




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page