top of page

ప్రకృతిమాత

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ప్రకృతిమాత, #PrakruthiMatha, #వేసవిసెలవులువచ్చాయి

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 17

Prakruthi Matha - Gayathri Gari Kavithalu Part 17 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 05/05/2025

ప్రకృతిమాత - గాయత్రి గారి కవితలు పార్ట్ 17 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


ప్రకృతిమాత

(కవిత)


******************************

ప్రకృతికే మానవులు ప్రణతులను చేయాలి 

సుకృతంబుగా తలచి శుద్ధులై మెలగాలి 


మన్నులోకనిపించు మాణిక్యములు నేడు 

చెన్నుగా మనకిడును జీవంబు లేనాడు 


ప్రాతపద్ధతులు సౌభాగ్యంబుగా నిలుచు

జాతినే నిలబెట్టు చైతన్యమే పొలుచు


మనవాళ్ళు బోధించు మంచినే తలుచుకో!

ఘనమైన సంస్కృతిని కాపాడి మసలుకో!


పూర్వకాలమునుండి భువిపైన విలసిల్లు

సర్వ జాతులు మనకు సమతతో ప్రణమిల్లు


సాధుసంతులు చూపు సన్మార్గమే నిజము

ఆధునిక కాలమున కాధారమౌ సతము


మరచి పోరాదు మన మాతృ భూమిని మనము

నిరతమా  పదములను నిష్ఠతో మ్రొక్కెదము//


************************************

వేసవి సెలవులు వచ్చాయి.

(గేయం)


ree












ఎండాకాలం వచ్చింది 

వేసవి సెలవుల నిచ్చింది 

మండే తాపము పెరిగింది 

కుండకు గిరాకి హెచ్చింది 


తాటి ముంజలను తిందాము 

నీటిలో నీతలు కొడదాము 

ఆటలనెన్నో ఆడేద్దాము

పాటల నింట్లో పాడేద్దాము


తాతా బామ్మలను చూద్దాము

నీతి కథలనే విందాము

విహారయాత్రలు చేద్దాము

'ఆహా!'అంటూ ఎగురుదాము


అమ్మకు సాయం చేద్దాము

కమ్మగ కబుర్లు చెబుదాము

నాన్న చెప్పినవి విందాము

దన్నుగ వెంట నిలుచుందాము


దేవుని గుడికి వెళదాము

దీవెనలిమ్మని కోరుదాము

ప్రదక్షిణలనే చేసేద్దాము

ప్రసాదాలను తినేద్దాము


భలే భలే!వేసవి వచ్చింది

కలలన్నింటినీ తీర్చింది.//


*******************************

ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page