top of page
Original.png

ప్రాణం ఖరీదు


మొసలి నుంచి నక్కను కాపాడుతున్న కోతి – ప్రాణం ఖరీదు తెలుగు నీతి కథ

Pranam Kharidu - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

ప్రాణం ఖరీదు తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 23/08/2026


“ప్రాణం ఖరీదు” ఒక ఆసక్తికరమైన తెలుగు నీతి కథ. ఈ కథలో మొసలి తన మాయమాటలతో నక్కను నమ్మించి, ప్రతిరోజూ రెండు చేపలు ఇస్తూ స్నేహం పెంచుకుంటుంది. ఇతర జంతువులు హెచ్చరించినా నక్క ఆ మాటలను పట్టించుకోదు. చివరకు మొసలి అసలు ఉద్దేశాన్ని బయటపెట్టి నక్కను ప్రమాదంలోకి నెట్టినప్పుడు, కోతి తన తెలివితో నక్క ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రాణం ఏ వస్తువుతోనూ పోల్చలేనంత విలువైనదని, తప్పుడు స్నేహాలను నమ్మకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఈ కథ మనకు చక్కని నీతిని అందిస్తుంది.


అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక మడుగు. ఆ మడుగులో ఒక మొసలి అనేక జల చరాలుతో నివాసం ఉండేది. ఆ మడుగు పక్కన పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు పై ఎన్నో జీవులు నివాసం ఉండేవి. మడుగులోని మొసలి చాలా టక్కరి. తన మాయ మాటలతో ఎన్నో జీవులను తన కడుపు మంటకు బలి తీసుకుంది.మొసలి మొదట స్నేహం చేస్తూన్నట్టు నటించి అవతల జీవిని నమ్మిస్తుంది. ఒక సారి అవతల జీవి పూర్తిగా మొసలిని నమ్మితే అంతే దాని అంతు చూసేది.


అలాగా ఒక సారి మడుగు కు నీరు తాగడం కోసం వచ్చిన నక్క మామతో మొసలి మాటలు కలిపింది. నక్క మడుగుకు రావడం తన అదృష్టమని నమ్మ బలికింది. నక్కతో స్నేహం కోసం ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. రోజు మడుగు దగ్గరకు వస్తే రెండు చేపలు ఇస్తానని చెప్పింది. రోజు నక్కకు ఆహారం వేదికే బేజాడి లేకుండా చేస్తానంది. రోజుకు రెండు చేపల రూపంలో నక్కకు ఆహారం లభించడం.....పరాన్నజీవి ఐన   నక్క కు నచ్చింది.రోజు నక్క మడుగు దగ్గరకు రావడం. మొసలి ఇచ్చిన రెండు చేపలు తినటం షరా మాములు ఐపోయింది. ఆ రెండింటికి స్నేహం కుదిరింది. మొసలి తో స్నేహం మంచిది కాదని మిగిలిన జీవులు చెప్పిన నక్క వినిపించుకోలేదు.


ఒక రోజు మడుగు దగ్గరకు వచ్చిన నక్కతో మొసలి "నేస్తమా, ఈ రోజు నువ్వు మా మడుగు చూడాలి. నువ్వు నా వీపు పై కూర్చో. మడుగు మొత్తం తిప్పి చూపిస్తాను" అంది. అలాగే అని నక్క మొసలి వీపు పై కూర్చుంది. మొసలి నక్కను మడుగు మధ్య లోకి తీసుకెళ్లి పీక లోతున్న చోట నక్కను దించింది. అప్పుడు నక్కకు భయం వేసింది. ఈ మొసలి తన్ను చంపడానికి ఈ ఎత్తు వేసిందని చాలా ఆలస్యంగా తెలుసు కుంది. ఏం చేయాలో తెలియ లేదు.


మర్రి చెట్టు పై నుంచి గమనిస్తున్న కోతి "నక్క మామ ఇక్కడున్నావా? నీకోసం నేను అడవి అంతా వెతుకుతున్నాను.రోజూ ఇంటిలో పూజా చేసి బయటకు వస్తావట. ఈ రోజు రోజు లా పూజ చేయకుండా బయటకు వచ్చావట. రా పూజ చేసి వద్దువు" అంటూ మర్రి ఊడ మడుగు లోకి విసిరింది కోతి.


బతుకు జీవుడా అంటూ ఆ మర్రి ఊడ పట్టుకుని చెట్టుపైకి చేరింది నక్క. నోటి దాకా వచ్చిన కూడు చేజారిందని మొసలి బాధ పడింది."ప్రాణం ఖరీదు రెండు చేపలు కాదు మిత్రమా. ప్రాణం ఎంతో విలువైంది. ప్రాణానికి ఖరీదు కట్టలేము. ఇకనైనా జాగ్రత్తగా మసులుకో" అంటూ కోతి నక్క మామకు ప్రాణం ఖరీదు విడమరచి చెప్పింది.



*** 

రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page