'Prathibha' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 15/11/2023
'ప్రతిభ' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
రాజారావు ఒక స్కూల్ లో మాస్టారు. పిల్లలకు పాఠాలు చెప్పడంతో పాటు, ప్రిన్సిపాల్ అతనికి స్కూల్ కి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాల పనులు కుడా అప్పజెప్పేవారు. స్కూల్ వార్షికోత్సవం దగ్గరకు రానే వచ్చింది.
ఒక రోజు, రాజారావు క్లాసు లో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండగా, సర్క్యులర్ వచ్చింది. స్కూల్ వార్షికోత్సవానికి అనేక పోటీలు ఉన్నాయి. వాటికి పిల్లలు తమ పేర్లు ఇచ్చి నమోదు చేయించుకోవాలని అందులో ఉంది. ఈ విషయం రాజారావు బయటకి చదివి వినిపించాడు. అందులో పాటలు, డాన్స్, ఇంకా అనేక పోటీలు ఉన్నాయి. రేపటి వరకు ఆలోచించుకుని చెప్పమని వెళ్ళిపోయాడు రాజారావు.
మర్నాడు రాజారావు.. క్లాసు కు రాగానే, మళ్ళీ ఈ విషయం అడిగాడు. ప్రస్తుతానికి పాటలు, డాన్స్ పోటీలకు మాత్రమే పేర్లు ఇమ్మని చెప్పాడు. రాజు తను పాటల పోటీ కి పేరు ఇస్తానని చెప్పాడు. రాము అని ఇంకొక విద్యార్ధి, తను డాన్స్ కోసం పేరు ఇస్తానని చెప్పాడు. అప్పుడు రాజారావు కొంచం కోపంగా...
"ఒరేయ్! రాజు ! నువ్వేమో లాస్ట్ బెంచ్ లో కూర్చుంటావు. పాఠాలు సరిగ్గా వినవు.. అన్నీ తక్కువ మార్కులే వస్తాయి. నీకెందుకు రా! పాటల పోటీ. నువ్వేమిటి పాడతావు చెప్పు! స్టేజ్ మీదకు వెళ్లి ఏం పాడాలో మర్చిపోతావేమో! ఏదైనా తేడా వస్తే, నాకు చెడ్డ పేరు వస్తుంది. ఇక రాము.. నువ్వేమో రాజు తోనే తిరుగుతావు... నువ్వూ అంత గొప్పగా ఏమీ చదవవు.. అలాంటి నీకు డాన్స్ చెయ్యడం వస్తుందా? నీ తెలివితేటలకి డాన్స్ అవసరమా చెప్పు? పాటలు పాడడానికైనా... డాన్స్ చెయ్యాలన్నా.. తెలివితేటలు అవసరము. అన్నీ గుర్తు పెట్టుకోవడమంటే మీకు అంత ఈజీ కాదు. కూర్చోండి!"
మాస్టారి మాటలకి మనసు బాధ పడ్డా... ఏమీ అనలేక... కూర్చున్నారు రాజు, రాము. మాష్టారు బాగా చదివే వారి పేర్లు తీసుకున్నారు.
మర్నాడు రాజు, రాము తల్లిదండ్రులు.. ఈ విషయమై మాట్లాడడానికి స్కూల్ కు వచ్చి ప్రిన్సిపాల్ ని కలిసారు . వాళ్ళు వెళ్ళిన తర్వాత.. ప్రిన్సిపాల్ గారు రాజారావు ను తన ఛాంబర్ కు పిలిపించారు.
"రాజారావు గారు! మీరు చాలా అనుభవం ఉన్నవారు. మీరు ఇలా చేస్తే ఎలాగా?"
"ఏం చేసాను సార్?"
"రాజు, రాము పేరెంట్స్ నాతో విషయం చెప్పారు. మీరు వారి పేర్లు తీసుకోలేదంటా?"
"సార్! అదీ.... మరి..... అదీ... "
"ఇలాంటి పోటిలలో పాల్గొనాలంటే, క్లాస్ టాపర్ అవనక్కరలేదు... అలాగనీ, మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే పాల్గొనాలనేదేమీ లేదు. చరిత్రలో మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి.. చదువు లో ఫెయిల్ అయిన వారు, చదువులో పెద్దగా రాణించని వారు.. వేరే విషయాలు లో చాలా గొప్ప గా స్థిరపడ్డారు. ప్రతిభ అనేది చదువులో ఒకలాగ ఉంటుంది... వేరే విషయాలలో వేరేలాగ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ టాపర్ ని పిలిచి పాట పాడమంటే, పాడలేకపోవచ్చు. కానీ రాజు పాటలు అంటే బాగా ఆసక్తి ఉందని వాళ్ళ అమ్మగారు నాకు చెప్పారు. కాలనీ లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలలో పాటలు పాడి, మెప్పు పొందాడట. అలాగే, రాము కూడా ఇలాగే డాన్స్ లో చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇలాంటి వారిని మనం ప్రోత్సహించాలి రాజారావు గారు. ఎలాగో ప్రాక్టీస్ చేస్తారు గా!" అన్నారు ప్రిన్సిపాల్..
"నా తప్పు తెలుసుకున్నాను సార్! అందరికీ సమాన అవకాశం కల్పిస్తాను. రాజు, రాము పేర్లు తీసుకుంటాను.. "
*****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments