top of page

ప్రతిస్పందన

#Prathispandana, #ప్రతిస్పందన, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Prathispandana - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 20/06/2025

ప్రతిస్పందన - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పుడో ఒకప్పుడు గుర్తుకు వస్తుంటాయి. అవి విషాద సంఘటనలు కావచ్చు లేదావినోద భరితమైనవి కావచ్చు.


నేను రక్షణ రంగం, సివిల్ మెడికల్ విభాగాల్లో సుమారు నలబై సంవత్సరాల అనంతరం హైదరాబాదు నగరంలో విశ్రాంత జీవితం గడుపుతున్నాను.


వయసురీత్యా వృద్దాప్యంలో వచ్చే శరీర సమస్యల వల్ల కుడి కాలు మోచిప్ప అరిగి నడవటం కష్టమైనందున చేయూతకు హేండ్ స్టిక్ వాడుతు ఇంటి బయట దూరం వెళ్లవలసి వచ్చినప్పుడు స్కూటీ వాడవల్సి వస్తోంది.


వార్దక్య జీవితంలో సహచర మిత్రులు, కుటుంబ సబ్యుల సహాయ సహకారాలు లభిస్తె చరమాంక సమయం ఆనందంగా ప్రశాంతంగా గడిచిపోతుంది.


నా దైనందినజీవితంలో రోజూ సాయంత్రం మా కాలనీ పార్కులో సహచర వయోవృద్ధ మిత్రుల సమూహంలో కూర్చుని ఏడు గంటల వరకు వర్తమాన రాజకీయాలు, ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతు ముచ్చట్లు పెట్టుకుంటాము.


నాలాంటి నడవలేని వారు లాన్సులోకూర్చుంటే మిగతా వారు వాకింగ్ ట్రాక్ మీద నడక సాగించి మాతో ముచ్చట్లకు దిగుతారు. మా సమూహ సబ్యుల్లో ఎవరి జన్మ దినమైనా, పండగ లప్పుడు, జాతీయ దినాలప్పుడు స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకుంటాము.


ఎవరైనా అనారోగ్యరీత్యాహాస్పిటల్లోఅడ్మిట్అయితే అందరం వెళ్లి పరామర్స చేసి మనోదైర్యం చెప్పి వస్తాము. విధి వశాత్తు ఎవరికైనా మరణం సంభవిస్తె వారి కర్మ క్రియల్లో పాల్గొని కుటుంబ సబ్యులకు సంతాపంతెలియచేసి వస్తాము. ఇలా పార్కు మిత్రులతో రోజులు ఆనందంగా గడుస్తున్నాయి.

 

నా శరీర అవయవ సమస్య రీత్యా ఇంటి వద్దనుంచి స్కూటీ మీద పార్కువరకూ వచ్చి పార్కింగ్ ఏరియాలో వెహికిల్ ఉంచి వాకింగ్  స్టిక్సహాయంతో గేట్ నుంచిలోపలి కొస్తాను. సాయంత్రంఏడు గంటలవగానె ఎవరి ఇళ్లకు వారు బయలుదేరుతాము.


ఎప్పటిలా ఒకరోజు ఏడవగానే నేను పార్కు గేటు దాటి స్కూటీ దగ్గరి కొచ్చాను. నాకు అనుకూలంగా ఉంటుందని పార్కింగులో ఒక మూలన వెహికిల్ పెట్టుకుంటాను.


స్కూటీ దగ్గరకు రాగా ఒక నడి వయసు వ్యక్తి రాయలసీమ వస్త్రధారణలో అంటే తెల్లని షర్టు, తెల్లని ధోతీలో స్కూటీ మీద కూర్చుని స్టైల్ గా సిగరెట్ తాగుతు పొగ వదులు తున్నాడు.


నేను వాకర్ స్టిక్ తో నడుచుకుంటు స్కూటీ దగ్గరికొచ్చాను. నన్ను చూసి కూడా లేవకుండా "బండి మీదా?" అన్నాడు. 

అవుననగానె పక్కన నిలబడి సిగరెట్ పొగ వదులు తున్నాడు.


"బాబూ, ఇలా సిగరెట్ తాగితే నీ ఆరోగ్యం పాడవుతుంది." అన్నాను.


 టక్కున "మీకేమైనా ఇబ్బందా?" అన్నాడు ఆ పెద్దమనిషి.


నాకు మనసు చివ్వు మంది. కనీసం వయసుకైన విలువ ఇవ్వకుండా అంత నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు బాధ కలిగింది.


వాకర్ స్టిక్ ఫోల్డ్ చేసి, కాళ్ల దగ్గర ఉంచుకుని స్కూటీ స్టార్టు చేసి ఇంటికి చేరుకున్నాను.


మర్నాడు సాయంకాలం ఎప్పటిలా ఐదు గంటలకు పార్కుకి చేరి మాటల సందర్భం లో ముందు రోజు జరిగిన సంఘటన చెప్పాను.


నా మాటలు విని మిత్రులందరు నాకు చివాట్లు పెట్టారు. నా ఆప్తమిత్రుడు కలగచేసుకుని "నీకు నోటి దురద ఎక్కువ. ఎందుకు అతనితో అలా అన్నావు.. ఎవరి ఆరోగ్యం వారికి తెలియదా" అన్నాడు.


నేను వివరణ ఇస్తూ " ఆయన నా స్కూటీ మీద కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. అక్కడ ఉన్న టూ వీలర్లన్నీ పెట్రోల్ తో నడిచేవి. అతని నిర్లక్ష్యం కారణంగా జరగరాని సంఘటన జరిగితే భారీ నష్టం జరగవచ్చు.


అదీగాక నా శరీర స్థితి చూసి బండి మీద నుంచి లేవనందుకు బాధ కల్గింది. నేను నా గత ఉద్యోగ రీత్యా వైద్య రంగానికి చెందిన వాడిని కాబట్టి పొగ తాగడం వల్ల ఆరోగ్య సమస్యల గురించి చెప్పవలసి వచ్చింది" అన్నాను.


అక్కడితో ఆ ప్రస్తావన ఆగిపోయింది. ఏడు గంటలవగానే ఎవరికి వారు ఇళ్లకు బయలు దేరాము.


నేను నా స్కూటీ దగ్గరకు రాగానే ఎప్పటి నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాడో నిన్నటి రాయలసీమ వ్యక్తి ఎదురొచ్చి నా చేతులు పట్టుకుని,


"ఏదో ఆవేశంలో మీతో అసందర్భంగా మాట్లాడాను.పెద్దవారు, మన్నించండి" అని చెప్పి గబగబా వెళిపోయాడు.


 పశ్చాత్తాపంతో తన తప్పు తెలుసుకున్నందుకు ఆనందమైంది నాకు.


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page