top of page
Original.png

ప్రతీ రోజూ... నిజమైన మహిళా దినోత్సవమే

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #ప్రతీరోజూనిజమైనమహిళాదినోత్సవమే, #TeluguSpecialArticle


Prati Roju Nijamaina Mahila Dinotsavame - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 08/03/2026

ప్రతీ రోజూ... నిజమైన మహిళా దినోత్సవమే - తెలుగు వ్యాసం

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1) ప్రతీ రోజూ... నిజమైన మహిళా దినోత్సవమే ----------


ఎలా? ఎందుకు? ఏమిటి?...


వాస్తవం ఏమిటంటే "ప్రతి రోజు 'మహిళా దినోత్సవం'" జరుపుకోవాలి, సంవత్సరానికి కేవలం ఒక రోజు (మార్చి 08) కాదు.


ఎందుకలా?...


ప్రతీ రోజూ... నిజమైన మహిళా దినోత్సవమే... అనడం నిజమైన నిజం.


ఏమిటి?...


తల్లులుగా, సోదరీమణులుగా, కుమార్తెలుగా, భార్యలుగా, స్నేహితులుగా, ఉద్యోగులుగా మరియు నిర్వాహకులుగా- నాయకులుగా వివిధ అవతారాలలో... మహిళలు...


I)


కుటుంబానికి, విస్తృత కుటుంబానికి- అంకిత భావంతో... నిస్వార్థ (100%) దయ, కరుణ (తో కూడిన ప్రేమను), నిర్మాణాత్మకతను కురిపిస్తున్నారు మరియు నిస్వార్థ సేవను అందిస్తున్నారు.


II)


సమాజానికి, పని ప్రదేశాలకు, కార్యాలయాల్లో... నిస్వార్థ సేవను అందిస్తున్నారు.


III)


అయితే, మానవులుగా (సమాజం మరియు ఇతరుల నుండి పొందిన అనేక పరిమితులు మరియు ప్రతికూల లక్షణాలతో కూడా ఉంటారు కాబట్టి),... (ప్రతి వ్యక్తికి) మహిళలకు కూడా... సంతోషకరమైన అభివృద్ధి, నిర్వహణ, గెలుపు-గెలుపు ఆనందకరమైన విజయంపై, నిర్మాణాత్మకతపై... క్రమం తప్పకుండా శిక్షణ తరచు అవసరం.


IV)


అంతే కాదు... ఆధునిక కాలానికి ఆధునిక అధునాతన నిర్వహణ లక్షణాలు అవసరం. పాత చింతకాయ పచ్చడి, పాత నమ్మకాలు, అపనమ్మకాలు కుదరవు... తగదు.


V)


పరిపాలనా చతురత, దక్షత, పద్ధతులను మెరుగుపరచడానికి తరచు శిక్షణ అవసరం (ఏ వ్యక్తికైనా).


VI)


తప్పు చేయడం మానవ సహజం, నైజం... అని... ప్రతీ మానవుడు అంగీకరించాలి. ఆ తప్పులు పునరావృతం కాకుండా, శిక్షణతో, నిర్వహణ లక్షణాలు మెరుగుపరుచుకోవాలి.


\----------- X X X ----- X X X ---------


\--- 2) "మహిళా శక్తి"... ప్రపంచంలో... యుద్ధాలు ఒక్క క్షణంలో ఆపవచ్చు??? ---


"అంతర్జాతీయ మహిళా దినోత్సవం" (8 మార్చి 2026) సందర్భంగా... అన్ని వైపుల నుండి మరియు అన్ని దేశాల నుండి, "మహిళా శక్తి"... అంటే (100%) మొత్తం... "అందరూ మహిళలే" బృందాలకు (- జట్లకు)... అవకాశం ఇవ్వాలి... శాంతి చర్చలు కొనసాగించడానికి... యుద్ధాలను ఆపడానికి.


"అందరూ మహిళలే" బృందాల శాంతి చర్చల వల్ల

...

ప్రపంచంలో యుద్ధాలు ఒక్క క్షణంలో ఆపవచ్చు

...

ప్రతిరోజూ ప్రపంచంలో... "శాశ్వత శాంతిని", తద్వారా శ్రేయస్సు, పురోగతిని మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని- మంచి మాటల కార్యాల అమలు- శాంతి, సౌభాగ్య పురోగతి... వ్యాప్తి చేస్తుందని... నిర్ధారిస్తుందని ఆశిస్తున్నాము.


\--- X X X ---


3) మహిళకు సమాన హక్కులు అంటే ???


I)


ఇంట్లో, బయట (పని స్థలాల్లో)... అందరూ సమానంగా పని పంచుకోవాలి... ఎక్కువ పని భారం మహిళలపై వేయకూడదు 

(వంట పని, ఇతరత్రా నిర్వహణ పని, పరిపాలన పని)... లేకుంటే??? అధిక పని ఒత్తిడి వల్ల... గుండెపోటు, తలనొప్పి, మధుమేహం, మానసిక మరియు హృదయ సంబంధిత- భౌతిక- నొప్పులు, వ్యాధులు... రావడానికి ఆస్కారం ఉంది.


II)


సమాన పని, సమాన వేతనం... పురుషులు మరియు స్త్రీలకు... అన్ని రంగాలలో... (క్రికెట్‌లోనే కాదు)


III)


సమాన హక్కులు అంటే... ఏ లింగం, ఏ వయస్సు, ఏ వృత్తి నుండి... ఆధిపత్యం ఉండకూడదు. 

(పురుషులైనా- మహిళలైనా కూడా... 

ఆధిపత్యం లేకుండా... నెత్తికెక్కకుండా... 

స్నేహపూరిత- సంతోషపూరిత- ఆనందదాయక పరిష్కారాల పూరిత- నిర్మాణాత్మక... నిర్వహణ చేయాలి... అనుక్షణం- క్షణక్షణం.


ఇది సాధ్యం... కాస్త దూరం, గోప్యత పాటిస్తే... ఎక్కడిదక్కడే వదిలేయడం- మరచిపోవడం... ఇంకో చెవినుండి వదిలేయడం (విన్నవి- కన్నవి)... జీవితం శాశ్వతం కాదు అని గమనించడం... అందరూ ఓ రోజు చనిపోయేదే అనే నిజం తెలుసుకోవడం.


\--- X X X ---


4)


మహిళల పై అత్యాచారాలు ఎలా ఆపాలి?


I) 


ప్రతి మహిళ 

యుద్ధ కళలు (Martial Arts)... కరాటే- కుంగ్ఫు- జూడో- టైక్వెండో నేర్చుకోవాలి... చిన్నప్పటి నుండి అయితే మరీ మంచిది.


II)


కుక్కలు, పిల్లలు... ఇతర పెంపుడు జంతువులు... దగ్గర పెట్టుకోవాలి... వాటికి (ఎమర్జెన్సీ-) అత్యవసర పరిస్థితిలో కాపాడటం పై శిక్షణ ఇచ్చి


III)


బ్యాగులో- జేబులో

షాక్ ఇచ్చే ఆధునిక పరికరాలు- ఆయుధాలు... జేబులో మిరప పొడి, మిరియాలు పొడి 

... ఆత్మరక్షణ

(- సెల్ఫ్ డిఫెన్స్) కొరకు పెట్టుకోవాలి.


IV)


తెలియని వారితో స్నేహాలు- పలుకులు, చిరునవ్వులు ఉండకూడదు- జోక్యం చేయకూడదు... దూరంగా ఉండాలి... పరిచయాలకు వెళ్ళకూడదు


V)


భద్రత విషయాలపై... తరచు జాగ్రత్త ఇవ్వాలి... ఆడవారికి... ప్రతి పాఠశాల, కళాశాల, పని ప్రదేశం, (ఇంట్లో కూడా).


VI)


ప్రత్యేకంగా మహిళా పోలీసు గస్తీ పెంచాలి... రాత్రి పూట మరీ ఎక్కువగా.


\--- X X X ---


5)


ప్రత్యేక 24 గంటల (రహస్య- CONFIDENTIAL)

మహిళా హెల్ప్‌లైన్ పెట్టాలి... ఫోన్ కాల్- ఈమెయిల్- వాట్సాప్ సందేశం... వాటి పై (సమస్యలపై- అత్యాచారాలపై) గోప్యతతో... (సంతోషపూరిత- సానుకూల) పరిష్కారాలు ఇవ్వాలి (ఎవ్వరికీ కష్టం- నష్టం- భూత హాని లేకుండా)... వెను వెంటనే 


6) ప్రతి రోజు... మహిళలు వేగంగా పరిగెత్తడం సాధన చేయాలి... అది ప్రమాదం సమయంలో కాపాడుతుంది


7)


మహిళలు సమూహంగా తిరిగితే మంచిది... ఒక్కరిగా కాకుండా.


గృహ హింస- లేక ఇతర హింస- దోపిడీ- హాని ఉంటే... వెంటనే స్నేహితులకు... షీ టీమ్‌కు (మహిళా పోలీసులకు)...

...

తెలియజేయాలి... జాప్యం చేయరాదు 

... 

విడాకులు- పదవి (లేక రాజీనామా) మిన్న,... అసంతుష్ట పెళ్లి జీవితం- (లేక వృత్తి జీవితం) కంటే... భరిస్తూ పోతే మానసిక- శారీరక ఒత్తిడి వల్ల... రకరకాల సమస్యలు రావచ్చు


8)


మహిళా భద్రత కొరకు... వేరు వేరు బెంచీలు- గదులు- సీట్లు పెడితే... మంచిదేమో (పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాల్లో... పబ్లిక్ (ప్రజా)- ప్రైవేట్ రవాణాలో).


గమనిక:-

కీడెంచి మేలెంచమన్నారు కదా పెద్దలు.


--- వ్యాసం సమాప్తం ---

పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page