top of page

ప్రతిస్పందన

#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #Pratispandana, #ప్రతిస్పందన,  #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Pratispandana - New Telugu Poem Written By  - Chilakamarri Rajeswari

Published in manatelugukathalu.com on 09/05/2025 

ప్రతిస్పందన - తెలుగు కవిత

రచన: చిలకమర్రి రాజేశ్వరి


విహారయాత్ర విషాద యాత్ర గా మారిన వైనం 

ప్రకృతి అందాలమధ్య ఉగ్రవాదం ప్రళయతాండవం

మతం పేరిట మనుషుల్ని ఊచకోత కోసిన పైశాచిక ఆనందం

మహిళల సౌభాగ్యాన్ని కాలరాచిన మతోన్మాదం

మన శాంతివాదాన్ని నిస్సహాయతగా హేళన చేసిన ఆటంకవాదం

అమాయక ప్రజల ప్రాణాలు,తీయడమే వారి లక్ష్యం 


ఊహించని సంఘటనతో ఉలిక్కిపడ్డ భారతం

ప్రతీకారవాంఛతో కుతకుతలాడిన ప్రజల రక్తం

మనిషి మృగంగా మారినవేళ పనికిరాదు అహింసావాదం

అందుకే తక్షణచర్యగా ఆపరేషన్ సింధూర్ ప్రయోగం

బాధితుల మనసుకి కలిగించిన ఉపశమనం

ఇకపై ఉగ్రవాద చర్యలు సహించబోమని ఇచ్చిన సంకేతం


మట్టుపెడదాం కూకటివేళ్ళతో ఉగ్రవాదాన్ని

మన శాంతిభద్రతలకి కలిగిస్తున్న అవరోధాలని 

అంతం చూసేవరకు సాగిద్దాం ఈ పోరాటయజ్ఞం

జయం మనదే, లేదు లేశమాత్రం సందేహం

  

***


చిలకమర్రి రాజేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి

 

నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.


మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.


నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.


పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

3 Comments


ఒక బాధాకరమైన పరిస్థితిని ఒక మంచి కవయిత్రి ప్రగాఢ భావమున్న కవితగా వ్రాసినప్పుడు, ప్రతి పదం హృదయన్ని కదిలిస్తుంది. కన్నీళ్ళు ఒక వంక మనోధైర్యం ఇంకొక వంక వచ్చేలా చాల బగా వ్రాసారు. జై హింద్🫡

Like

The poem reflects the bleeding heart of every Indian woman and the respect and emotion to every Indian Women's marital life and family. Let every Indian join hands together to root out terrorism in the world.

Like

భావావేశంతో కృత నిశ్చయం వ్యక్తీకరిస్తూసాగిన కవిత మనోవీధిలో సింధూరం చెరిగిన ఆడ బడుచుల ను నిలిపింది. స్త్రీ కన్నీరు, వినాశకరంమని నిరూపిద్దాం. కవితకు చిత్రం వన్నె తెచ్చింది.

Like
bottom of page