top of page

ప్రేమాలయం


'Premalayam' - New Telugu Story Written By Parupalli Ajay Kumar

'ప్రేమాలయం' తెలుగు కథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

రఘురామయ్య ఆవూళ్ళో మోతుబరి రైతు. అరవై సంవత్సరాలు నిండినా మనిషి ధృడంగా వుంటాడు. ముఖాన ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడుతూ వుంటుంది. స్నేహశీలి, మృదు స్వభావి. వూరిలో అందరితో కలివిడిగా వుంటూ, అవసర సమయాల్లో అందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంటాడు. భార్య సీతమ్మ అతని మనసెరిగి నడుచుకునే ఇల్లాలు.


రామయ్య షష్టిపూర్తి కని వేరే ఊళ్ళల్లో ఉంటున్న కుటుంబ సభ్యులు గ్రామానికి తరలి వచ్చారు. షష్టిపూర్తి ఘనంగా జరిగింది.


రఘురామయ్య పెద్దకూతురు ప్రమీల, పెద్దకొడుకు శ్రీ రామ్, రెండవ కొడుకు అశోక్, , పెద్దకోడలు భారతి , చిన్నకోడలు సత్య, అల్లుడు ప్రకాశ్, శ్రీ రాం కూతురు మనోజ్ఞ, చిన్నకొడుకు పిల్లలు ఇద్దరు అందరూ వచ్చారు.


ప్రమీల కొడుకు ప్రసాద్ ఆఫీసులో ఏదో పనివుండి రాలేదు.

రఘురామయ్య ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక కుటుంబసభ్యులందరిని హాలులో సమావేశపరిచాడు.

" మీ అందరకూ ఇష్టమైతే ప్రసాద్ కు, మనోజ్ఞ కు పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఆలోచన " రఘురామయ్య అన్నాడు.


వింటున్న మనోజ్ఞ ముఖం పాలిపోయినట్లయింది. పెద్దలందరూ సరేనన్నారు.

" నువ్వు చెప్పు చిన్నీ " అంటూ మనోజ్ఞను అడిగాడు.

మనోజ్ఞ ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని

" తాతయ్యా ! ప్రసాద్ బావ అంటే నాకు ఇష్టమే. ఒక అత్త కొడుకుగా, ఒక బావగా. అంతే. బావా, నేను చిన్నప్పటినుండి కలసిమెలసి పెరిగాం. మంచి స్నేహితుల్లా మెలిగాం. మా మధ్య ఆప్యాయతలు ఉన్నాయి. బావను వేరే దృష్టితో నేనెప్పుడూ చూడలేదు. మీరు ప్రసాద్ బావని అడిగినా ఇలానే చెపుతాడు. నేను నాతో పాటు పనిచేస్తున్న రవిని ప్రేమిస్తున్నాను. మీకీ విషయం చెప్పాలనే అనుకొన్నాను.

ఈ షష్టిపూర్తి హడావుడిలో చెప్పలేకపోయాను. మీరందరూ ఇష్టపడితే నేను రవిని పెళ్లిచేసుకుంటాను. "

అని చెప్పి మనోజ్ఞ తనగదిలోకి వెళ్లింది.


అందరూ ఏం మాట్లాడాలో తెలియక మిన్నకుండిపోయారు.

కొద్ది క్షణాల తరువాత ప్రమీల

"పోనీలెండి నాన్నా ! మనోఙ్ఞకు ఇష్టం లేనపుడు బలవంతం పెట్టొద్దు. పిల్లల అభిప్రాయాలను మనం పెద్దలుగా గౌరవించాలి. " అంది.

రఘురామయ్య మౌనంగా ఉండిపోయాడు.


కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరూ రఘురామయ్య మాటలను కాదని అనలేదు.


మొదటిసారిగా మనోజ్ఞ నోరువిప్పి తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పటం కుటుంబ సభ్యులను విస్మయపరిచింది.


***************************


అర్థరాత్రి రామయ్యకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.


ఆగమేఘాలమీద ఆంబులెన్స్ కు ఫోన్ చేసి దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేసారు.


ఐ సి యు లో ఒక రోజు చికిత్స తరువాత కళ్లు తెరిచాడు.

మరోసారి స్ట్రోక్ వస్తే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు.


మనోజ్ఞ ఐ సి యు లో వున్న తాతయ్యను చూస్తూ

"తాతయ్యా ! మీ కోరిక ప్రకారమే బావను పెళ్ళి చేసుకుంటా. మీరు త్వరగా కోలుకుని ఇంటికి రావాలి "

అంటూ కన్నీరు కార్చింది.


రామయ్య మనవరాలి బుగ్గలను ఆర్తిగా తడిమి కన్నీరు తుడిచాడు.


***************************


ఆ రాత్రి మనోఙ్ఞ రవికి ఉత్తరం రాసింది.


రవీ ,

నేను రాసినది పూర్తిగా చదువు. నామీద కోపం తెచ్చుకోవద్దు. మన విషయం యింట్లో చెప్పాను.

ఆరాత్రే తాతయ్యకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం బాగానే ఉన్నారు.

మా ఇంట్లో వారికి నన్ను మాబావకి ఇచ్చి చెయ్యాలని వుంది. ఇటువంటి ఆలోచనలు మావాళ్లకు ఉన్నాయని నాకిప్పటి వరకూ తెలియదు. బావా, నేను మంచి స్నేహితుల్లాగానే పెరిగాము. ప్రేమ, ఆకర్షణ లాంటి భావాలే నాకెప్పుడూ రాలేదు. కానీ ప్రస్తుతం బావని పెళ్ళి చేసుకోమని తాతయ్య అడిగాడు.


మా కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరూ తాతయ్య మాటలను జవదాటలేదు. అలాఅని మాతాతయ్య నిరంకుశుడు కాదు.


అతను మమ్ములను విపరీతంగా ప్రేమించే వ్యక్తి. ఆప్యాయతకు అనురాగానికి మారుపేరు మాతాతయ్య. నిరంతరం మాబాగుకోసం, మా క్షేమంకోసం, మా ఉన్నతికోసం ఆరాటపడే మనిషి.


మనం ఎన్నో కలలు కన్నాం. కానీ అవి నెరవేరే ఆశ లేదు.


మనిద్దరం పెళ్లి చేసుకుంటే మనంమాత్రమే సంతోషంగా ఉండగలం.

అందరినీ బాధ పెట్టి మనం సంతోషంగా ఉండగలమా ?


అసలు ప్రేమంటే ఏమిటి ?మన సుఖం మనం చూసుకోవటమా? మనను కనిపెంచి పెద్దవారిని చేసి మన కోసమే తపించే వారి ప్రేమలముందు మనప్రేమ ఏ పాటిది?


మనమధ్య ఏర్పడిన ఆకర్షణ , ఇష్టం , స్నేహం, ప్రేమ వీటన్నిటినీ నేను తక్కువచేసి మాట్లాడటం లేదు.

నేను మావాళ్లను దూరం చేసుకుని బతకలేను. నన్ను అర్థం చేసుకో.


మన చుట్టూ ఉన్న మనవారి ప్రేమానురాగాలు మనకు వున్నప్పుడే మనజీవితాలు బాగుంటాయి.

అందరి ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు లేకుండా కేవలం మన ప్రేమకే నేను కట్టుబడి ఉండలేను.


ఇదే నేను నీకు రాసే చివరి ఉత్తరం.

నన్ను మన్నిస్తావనే ఆశతో.


- నీదాన్ని కాలేని

మనోజ్ఞ


కన్నీళ్లతో తడిసిన ఉత్తరాన్ని పనిమనిషి మంగకిచ్చి పోస్టు చేయమంది మనోజ్ఞ.


*****************************


ప్రసాద్ భిలాయ్ నుండి వచ్చాడు.


మూడు రోజుల తరువాత పెళ్లిచూపులు ఏర్పాటు చేసారు.


మనోజ్ఞను ముందు హాల్ లోనికి తీసుకువచ్చి కుర్చీలో కూచోబెట్టారు.


మనోజ్ఞ తలదించుకుని కూర్చుంది.


"చిన్నీ కొద్దిగా తలఎత్తి పెళ్లి కొడుకును చూడు" రామయ్య నెమ్మదిగా అన్నాడు.


మనోజ్ఞ కళ్లు ఎత్తి యెదురుగా చూసింది.


ఎదురుగా రవి అతని తల్లితండ్రులు వున్నారు.


మనోజ్ఞ ఆశ్చర్యంతో, ఆనందంతో తాతయ్య వైపు చూసింది.


గుబురు మీసాల మాటున ముసిముసిగా నవ్వుతూ తల నిలువుగా ఊపాడు.


మనోజ్ఞ ఒక్క ఉదుటున లేచి "తాతయ్యా" అంటూ రామయ్యను వాటేసుకుని సంతోషంతో ఏడ్చేసింది.


"నీ కిష్టంలేని పెళ్లి మేము బలవంతంగా చేస్తామా చిన్నీ?

నువ్వు రవికి రాసిన ఉత్తరం మంగి ద్వారా నాకు చేరింది. నేను చదివాను.

ఇంత చిన్న వయసులోనే నువ్వు మా అందరి గురించి నీ ప్రేమను చంపుకుంటే ,

ఇంత వయసొచ్చిన మేము నీ సుఖాన్ని కోరుకోకుండా ఉండగలమా?


ప్రసాద్ కూడా నీకు, రవికి పెళ్ళి చేయటమే మంచిపని అని అన్నాడు.

నేను, ప్రసాద్ వెళ్ళి రవిని కలిసాము.

అతని తల్లితండ్రులతో మాట్లాడి పెళ్ళిచూపులకు రమ్మని చెప్పి వచ్చాము.

మరి పెళ్లికొడుకు నచ్చాడో లేడో చెప్పు" రామయ్య అడిగాడు.


మనోజ్ఞ చిరునవ్వుతో రవిని చూసింది.


******************************

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/ajay

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.





40 views0 comments
bottom of page