top of page
Original.png

పుస్తకమా నీకు వందనం!

#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #పుస్తకమానీకువందనం, #PusthakamaNeekuVandanam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

పుస్తకమా నీకు వందనం ! వచన కవిత

Pusthakama Neeku Vandanam - New Telugu Poem Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 18/12/2025

పుస్తకమా నీకు వందనం! - తెలుగు కవిత

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

నేను పుస్తకం చదవడం మొదలుపెట్టాను 

నాకు నాన్నగారు చెప్పేరు చదవమని

ఊహతెలిసే వయసులో, ఇది చదువు అని చెప్పలేదు  

వారు పీఆర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్, తెలుగులో రైటర్  

అందువలన నాన్నగారి దగ్గిర లైబ్రెరీలో ఆరు బీరువాలనిణ్డా పుస్తకాలు, వారురాసిన వ్యాసాలతో పత్రికలూ వున్నాయి  


భారత, భాగవత, రామాయణం వంటి పురాణగ్రంధాలు..

శరత్, ప్రేమ్చంద్, ఠాగూర్, తిలక్, విశ్వనాధ.. ఇలా ప్రముఖ రచయితల నవలలు ఉండేవి 


మొదట చదివింది శరత్ నవల దేవదాసు

తర్వాత ప్రేమ్చంద్ నిర్మల

అన్నీ చదివాను..


విశ్వనాథవారి ఏకవీర. చాలా కష్టపడి చదవాల్సివచ్చింది ఏకవీర. అదొక్కటే చదివాను. అదీ సబ్జెక్ట్ నచ్చడం వలన

మిగిలినవాటి జోలికి పోలేదు 


తర్వాత సునాయాసంగా చదివినవి శరత్, ప్రేమ్చంద్, మిగిలిన అందరు రైటర్స్వీ కూడా 


తిలక్ గారు, మామేనత్తకి భర్త. నాకు ఇష్టమైన బుక్స్ చదివాక, మాఇంటికి ఎదురుగా ''ఈశ్వర పుస్తక బాండాగారం ''అనే లైబ్రెరీ ఉండేది.. అక్కడనుంచి కొత్తగా వచ్చే పత్రికలూ చదవడం హాబీ ఐ పోయింది. అలా మొదలైన అలవాటు కొనసాగుతూ నన్ను రచనలు చేసే స్థాయికి చేర్చింది

 

పుస్తకం చదవడమంటే ప్రపంచం ఏమిటో తెలుసుకోడం

పుస్తకం చేతిలోవుంటే మనలను మనం మరచిపోతాం

కొత్త ఊహలకు ఊపిరి పోస్తుంది. ఎక్కడికో ఎగిరిపోడానికి రెక్కలు వస్తాయి


చదవడమనే అలవాటు మనిషిని తీర్చి దిద్దుతుంది

ఏ ఉపాధ్యాయుడు ఇవ్వని జ్ఞానం పుస్తకం తోనే సాధ్యం

ఆభరణాలు శరీరానికి అలంకారం మాత్రమే. కొందరికి

బుద్ధి వికసించడానికి మెరుగు పరచుకోడానికి కావలసింది పుస్తకం


పుస్తకమంటే వెల కట్టలేని అపురూపమైన నిధి

వినోదాన్ని, వివేకాన్ని, విచక్షణను, ధైర్యాన్ని ఇవ్వగలిగేది పుస్తకం


మనిషి సరి ఐన దారిలో నడవటానికి పుస్తకం దారి చూపుతుంది

బాధలో వచ్చే కన్నీటిని తుడుస్తుంది. మనసును ఊరడిస్తుంది


మనిషి చేయలేని మంచిని పుస్తకం నుంచి పొందగలం

పుస్తకం మనకు జీవితకాలం తోడుగా వుండే స్నేహితుడు

ఏదేశమేగినా, ఏవూరిలో అడుగుపెట్టినా ముందు గ్రంధాలయం వెదుక్కుంటాను


అక్కడ ఉన్నంతసేపు ''ఇది నా ప్రపంచం '' అనే సంతోషాన్ని ఇస్తుంది!

ఇది నా అనుభవం. 


******************* 

ree

-ఏ. అన్నపూర్ణ



bottom of page