చండకరుని ప్రతాపము
'Raboyedi Endakalamu' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 23/01/2024
'రాబోయేది ఎండా కాలము' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
1}చండకరుడు మండుచుండగ
ఎండ దెబ్బకు గుండెలదురగ
దండి వారలు తల దాచుకున్నను
ఎండ బీదల వెంబడించును.
2}రెక్కలాడితేనె డొక్క నిండెడి
బక్కవాడికి బతుకు కరువై
దిక్కు తోచని దీనుడయ్యును
చెక్కు చెదరక సేయు పనులను.
3}నోరు లేని జీవులెన్నో
నీరు లేక అలమటిస్తు
బోరు చెంతన నోరు తెరచి
జారు చుక్కకు నాల్క జాపును
4}డొక్క లిరు పక్కలందున
పెక్కు మార్లు కొట్టుకొనగ
దిక్కు లేని వీధి కుక్కలు
సొక్కిపోవును సూర్యునెండకు.
5.}చెట్టు కొమ్మన ఆకు చాటున
కట్టుకున్న గూడు గూడ
ఎండ వేడికి మండిపోగ
తిండి లేక పులుగు లెండును.
సుదర్శన రావు పోచంపల్లి
Comments