top of page

రా రా.. కృష్ణయ్య


'Rara Krishnaiah' - New Telugu Story Written By Mohana Krishna Tata

'రా రా.. కృష్ణయ్య' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


"లక్ష్మీ! ఏమిటే నీ చాదస్తం!?"


"చాదస్తం కాదండీ!.. ఇలాగ చేస్తే.. మన ఇంటికి కృష్ణయ్య వస్తాడంట! అందుకే ఈ పాదాలు.. బయట నుంచి లోపలికి వేసాను.. "


"అత్తయ్య! కృష్ణాష్టమి శుభాకాంక్షలు!"


"రావే రాధా! అన్నీ.. మా జీవితంలో సరిగ్గా ఉండి ఉంటే.. ఈ పాటికి నువ్వు మా కోడలి అయ్యేదానివి"


"ఊరుకో అత్త! నీ కోరిక తప్పకుండా తీరుతుంది.. చూడు"


"బావ ఎక్కడకు వెళ్ళాడు అత్తా?"


"అది తెలియాలంటే.. చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి మా జీవితం..


అప్పట్లో.. నా జుట్టు నల్లగా.. నిగ నిగ లాడుతూ.. ఉండేది.. నేను సినిమా హీరోయిన్ లాగా ఉండేదానిని అని అందరూ అనేవారు. మా ఇంట్లో.. మా అమ్మ.. పండగలలో కృష్ణాష్టమి బాగా చేసేది. మా ఇంట్లో పెద్ద కృష్ణుడు బొమ్మ ఉండేది.. దానిని అమ్మ బాగా అలంకరించేది.. ఇంట్లో పిండి వంటలు చేసి అందరికి పెట్టేది. ఉదయం నుంచి ఊరిలో వాళ్ళు, బంధువులు.. అందరు మా ఇంటికి వచ్చేవారు. కృష్ణుడు పాదాలు వెయ్యడంలో.. మా అమ్మ ఎప్పుడు ముందు ఉండేది..


అలా పాదాలు వేస్తే.. ఇంటికి ఎవరో వస్తారని.. అందరి నమ్మకం.. మా అమ్మ కూడా అదే నమ్మేది..


సాయంత్రం.. అందరిని పిలిచి.. కృష్ణుడి పాటలతో చాలా సండది చేసేది.. కృష్ణయ్య అంటే అంత భక్తి.. మా ఇంట్లో”.

"మరి పగలు ఏమి చేసేవారు?"


"చెబితే, నువ్వు చాలా ఆశ్చర్యపోతావు.. ఇంత భక్తీ ఏమిటా అని?"..


"చెప్పు అత్తా!"


"మా అమ్మ కృష్ణుడంటే.. ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటే కృష్ణుడు.. అని బాగా నమ్ముతుంది.. అందుకే మా పూజగదిలో.. ఎన్టీఆర్ కృష్ణుడు ఫోటోలు ఉండేవి. ఆ శివరాత్రికి శివుని.. సినిమాలు ఎలా చూస్తామో!.. కృష్ణాష్టమి కి ఎన్టీఆర్ నటించిన సినిమాలు చూసేది మా అమ్మ. కృష్ణుడు పాదాలు మహిమ బాగా నమ్మే మా అమ్మ కి..


మర్నాడు నన్ను పెళ్ళిచూపులు చూడడానికి మీ తాతగారు వచ్చారు.. మొదటి చూపులోనే.. నచ్చానని పట్టు బట్టి మరీ.. పెళ్ళి చేసుకున్నారు..


అలా.. ఆ సంవత్సరం.. మా అమ్మ కు మంచి అల్లుడు ఇంటికి వచ్చాడని.. చాలా ఆనందించింది.. అలా.. మీ తాతగారు నా జీవితం లోకి వచ్చారు..


అప్పటినుంచి నేను కూడా మా అమ్మ తరహాలో.. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నాను”.


"మీరు కూడా ఎన్టీఆర్ ఫ్యానా అత్తయ్య!"


"మీ తాతగారు 'ఎన్టీఆర్' ఫ్యాన్.. నేను 'ఏయన్ఆర్' ఫ్యాన్.

అలా.. మా ఇంటికి చిన్ని కృష్ణయ్య వచ్చాడు.. అదే మీ బావ.. వాడు కృష్ణాష్టమి రోజు పుట్టాడని.. కృష్ణయ్య అని పేరు పెట్టుకున్నాము..


అదేమీ దురదృష్టమో.. మా ఆనందం ఎక్కువ కాలం లేదు.. ఒక సారి మేము పుణ్య యాత్రలకు వెళ్ళినప్పుడు.. మీ బావ అక్కడ తప్పిపోయాడు.. అప్పుడు మీ బావ వయసు ఐదు సంవత్సరాలు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం.. మా కృష్ణయ్య కోసం చూస్తూనే వున్నాను.. "


"ఏవండి!” అంటూ ఎవరో పిలుస్తున్నారు..


"చూడు రాధా! పండగ పూట ఎవరో వచ్చారు ? లోపలికి తీసుకు రా రాధా!"


"అలాగే అత్తా!"


"మావయ్య! మీ పేరు చెప్పి.. మీకోసం ఎవరో వచ్చారు"


"ఎవరండి.. మీ పరిచయం?"


"నేను పరంధామయ్య! మాది తిరుపతి.. 10 సంవత్సరాల ముందు.. మేము పుణ్య యాత్రలకు వెళ్ళినప్పుడు మాకు ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు..


మాకు పిల్లలు లేకపోవడంతో.. ఆశ కలిగింది.. మా ఆవిడ మాట కాదనలేక.. ఆ బాబు ని తెచ్చి పెంచుకున్నాము.. మేము వాడికి ప్రేమ ని అందించాము కానీ..


వాడు ఎప్పుడూ.. మా మీద ప్రేమ చూపించలేదు.. ‘మా అమ్మా నాన్న మీరు కాదు’ అని మారం చేసేవాడు.. అసలు తల్లి దండ్రులకు అప్పగించాలని.. మా ప్రయత్నం ఇన్ని సంవత్సరాలకు ఫలించింది.. ఇదిగోండి.. మీ అబ్బాయి..”


"బాబు కృష్ణయ్య! రా కన్నా!” అని తల్లి లక్ష్మి మురిసిపోయింది. “ఇన్నాళ్ళకు.. ఆ కృష్ణయ్య కు మా మీద దయ కలిగింది.. "


"అవును.. మా నిజమైన అమ్మా! నాన్నా.. నాకు గుర్తొస్తుంది.. అని తల్లి దండ్రులకు నమస్కరించాడు.."


"మా అబ్బాయిని మాకు క్షేమంగా అప్పగించినందుకు చాలా ధన్యవాదాలు.."

"ఈ పండగ పుట.. మీరందరూ.. మా ఇంట ఆతిధ్యం స్వీకరించి వెళ్ళాలి.."


"అమ్మా! ఈ అమ్మాయి ఎవరమ్మ?"


"రాధ! నీ మరదలు.. నీ కోసమే పుట్టిన నీ రాధ.. కృష్ణయ్యా!"


****************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


36 views0 comments

Comments


bottom of page